APLatestNews.com top Banner
         
విజయము సాధించమని ఒకరు, సాధ్యం కాదు అని ఇంకొకరు - శ్రీ స్వామి తత్వాలు(Sri Swami Tatvaalu)
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
            
     
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ అన్ని సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇంకా సందేహాలు ఉంటే, జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
మనలో ఇద్దరు వున్నారు. అందులో ఒకరు, మనలను ముందుకు తోస్తూవుంటే(మంచి పనికి), రెండో వారు వెనక్కి లాగుతారు. విజయము సాధించమని ఒకరు ప్రోత్సహిస్తూవుంటే ,రెండవ వాడు అది సాధ్యం కాదు అంటాడు.

1) సూక్ష్మ మనసు(Sub-conscious Mind) - ఉత్సహము, మంచి, మాయ నుండి బయటకు తెస్తుంది - జపము చేద్దాము అంటే
2) స్థూల మనసు(Conscious Mind) - నిరుత్సాహము, చెడు, మాయ లో కి నడుస్తుంది - తర్వాత చేద్దాములే అని వాయిదా వేస్తుంది

స్థూల మనసు అనుకున్నవన్నీ కావాలనుకుంటుంది, కొన్ని మూర్ఖంగా చేసుకుపోతుంది. కానీ లోపల ఉన్న సూక్ష్మ మనసు ఏది ఒప్పు ,ఏది తప్పు అని విశ్లేషించి చెప్తుంది . అది కూడా తన వద్ద ఉన్న సమాచారాన్ని(తను పెరిగిన వాతావరణం, పరిస్తితులు, అవగాహన) బట్టి ఆలోంచించి చెపుతుంది.

మన మనసు కు సమాచారాన్ని అందించేవి - కుటుంబము, పాఠశాల, సంఘము, ఆర్దిక మరియు సాంఘీక పరిస్తితులు. నీ గురించి తెలుసుకోవాలంటే, నీ గురించి కొంచెము ఆలోంచించు, నీతో నీవు మాట్లాడుకో. మనస్సుకు అద్భుతాలు చేసే శక్తి ఉన్నది. ధ్యానం తో సూక్ష్మ మనసు కి శక్తి కలిగిద్దామా?

నీలోన వున్న శివుడిని, విష్ణువుని దర్శించకుండా బయట వెతుకుతాము. దర్శనము కోసము పరితపిస్తాము. నానా అగచాట్లు పడతాము. ఎప్పుడు స్థూలములో(బయట ప్రపంచంలో) వెతుకుతూ ఫలితము అంద లేదు అంటాము.

మనసు చంచలమైనది నిగ్రహించుటకు కష్టమనునది నిజమే. కాని దానిని జపములో అభ్యాసము చేత, వైరాగ్యము చేత సాధించవచ్చును. - భగవధ్గీత

గుణములు అనగా సత్వ, తమో, రజో గుణములు. ఆ గుణాలలో బుద్ది ఇరుక్కొని గుణ ప్రభావము చేత తన సహజమైన ఉనికిని కోల్పోయి గుణాలను బట్టి తన పనిని వ్యక్తపరుస్తుంది.

Dt : 14-Sep-2017, Upd Dt : 16-Feb-2019 , Category : Devotional, Views : 641 ( id : 12 )
Tags :

Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.