APLatestNews.com top Banner
         
మనసున్న మంచి పాట - అమ్మ అన్నది ఒక కమ్మని మాట(బుల్లెమ్మా బుల్లోడు) - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
ఈ రోజుల తో పోలిక గమనించండి, వీడియో పాట కూడా వినండి చూడండి.

1. విదేశాలలో లేదా దేశం లోని నగరాలలో నేడు: ఎక్కువ మంది ఎన్నారై లకి లేదా ఉద్యోగులకి లేదా డబ్బు గల వారికి పనిమనుషులు దొరకడం కష్టం, జీతాలు ఇబ్బంది కూడా. కాబట్టి, కన్న తల్లి(తండ్రి అయినా అంతే) నోరు ఎత్తకుండా విసుక్కోకుండా నమ్మకంగా పని చేసే అంగడిలో దొరకని పని దేవత(కానుపులు, ఇంటిపని, వంటపని, తోటపని, చెత్తపని, కడిగేపని, పిల్లల పెంపకం/కాపలా). అమృతమూర్తి తల్లి తో ఉచిత సేవ చేయించుకోవచ్చు లేదా సొమ్ము మిగుల్చుకోవచ్చు.

2. మిగతా భారతం లో నేడు - ఫీజ్ సొమ్ము వచ్చిందాకా, పెళ్ళి అయిందాకా, అవసరాలు తీరిందాక, ఇదే పాట, ప్రతి నోట, సినిమా నటులనే మరిపించే బిడ్డల అవకాశవాద నటన.

60 వచ్చినా లేక జబ్బు చేసినా, వీలైతే డబ్బులు విదిలించి, పని మనిషితో లేదా చుట్టాలతో
లేదా ఆశ్రమమే దిక్కు మరల ఇదే పాటతో, పై ఇద్దరు నూ.

అసలు వదిలేసే, వారి సంగతి ఇప్పుడు వద్దు లే.

3. పాతకాలం, పిచ్చి రోజులలో నాడు, అసలు పాట ఇది:

అమ్మ అన్నది ఒక కమ్మని మాట | అది ఎన్నెన్నో తెలియని మమతల మూట
||అమ్మ అన్నది || మమతల మూట

దేవుడే లేడనే మనిషున్నాడు | అమ్మే లేడనువాడు అసలే లేడు - 2 సార్లు
తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు | తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు
ఆ తల్లి సేవ చేసుకునే బ్రతుకే బ్రతుకు ||అమ్మ అన్నది ||

అమ్మంటే అంతులేని సొమ్మురా | అది ఏ నాటికి తరగని భాగ్యమ్మురా
అమ్మ మనసు అమృతమే చిందురా | అమ్మ మనసు అమృతమే చిందురా
అమ్మ ఒడిలోన స్వర్గమే ఉందిరా ఉందిరా ||అమ్మ అన్నది ||

అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే | అందరికి ఇలవేలుపు అమ్మ ఒక్కటే - 2 సార్లు
అమ్మ వున్న ఇంటిలో లేనిది ఏది | అమ్మ వున్న ఇంటిలో లేనిది ఏది
అమ్మ అనురాగం ఇకనుంచి నీది నాది ||అమ్మ అన్నది ||

Amma Annadi Oka Kammani Maata(SPB AND VASANTHA,దాశరథి) - Bullemma Bullodu - 1972 - Telugu Lyrics/తెలుగు సాహిత్యం

మనసున్న మంచి పాట - అమ్మ అన్నది ఒక కమ్మని మాట(బుల్లెమ్మా బుల్లోడు) - Pic 2


Dt : 12-May-2019, Upd Dt : 12-May-2019 , Category : Songs, Views : 257 ( id : 112 )
Tags : mothers day , amma runam
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content