APLatestNews.com top Banner
         
మాత్రృ దినం - చిన్నప్పుడు కర్ర లేదా చీపురు కట్ట, తీసుకొని కొట్టిన రోజులు - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
మాత్రృ దినం శుభాకాంక్షలు, బాధ్యత గల కన్న తల్లులు అందరికీ.

తల్లి దండ్రులు ను , తాత నాయనమ్మ లను ఇంట్లో నే పెట్టుకున్న సంస్కృతి నుంచి, తోడ పుట్టిన వాళ్ల కే లేదా అమ్మలకే దూరంగా ఉండేంత, డబ్బు వ్యామోహం లో ఎదిగి పోయాం.

చిన్నప్పుడు కర్ర లేదా చీపురు కట్ట, తీసుకొని ఇంటి బయట, కొట్టిన రోజులు మరువకూడదు. అలా కొట్టిచ్చుకొనే , మనం బాగుపడ్డాము. మా అమ్మ ఇప్పటికీ, కొట్టుద్ది మోహమాటం లేదు.

ఇప్పుడు మనము అలా పిల్లలను కొట్టే స్దితి లో లేము , పిల్లలు మనల్ని లెక్క చేసే పరిస్థితి లో లేరు.

పొద్దున్న కూరగాయలు లో పొరపాటున, కొత్తిమీర కట్ట తగ్గింది. అసలు ఎలా మరచావు , మరలా కారు తీసి అంత దూరం పోవాలా, ఆయ్? ఇక అమ్మ(74), అష్టోత్తర శత నామావళి మొదలు పెట్టి పావుగంట, నాలుగు మొట్టికాయలు వేసి , నడువు బజారు కి అని పావు కిలోమీటర్ నడిపించి తీసుకుని వెళ్ళి, కొనిపించింది, గోంగూర పచ్చడి లో వాసన తగ్గుతుంది అని. తప్పుకు వెంటనే శిక్ష ఉండాలి, మరలా తప్పు చేయకుండా.

భార్య తన్నులు కన్నా, తల్లి తన్నులు ఉత్తమం, అని ఎవరో ఒకాయన చెప్పారు, ఆయన పేరు అడగకండి, వారం తిండి ఉండదు అని బతిమిలాడారు. ఏదో ఒక తన్నులు భయం లేనిదే, మనిషి భూమి పై సరిగ్గా నడవడు.

Dt : 11-May-2019, Upd Dt : 11-May-2019 , Category : General, Views : 54 ( id : 110 )
Tags : mothers day , amma runam
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments