APLatestNews.com top Banner
         
అత్త, అక్క ఆవేదన - అంత తెలివి తక్కువ వాళ్ళమా, మా కోడళ్లు కు పని , శ్రమ తగ్గనిస్తామా? - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
ఎవరు ఎన్ని అన్నా చెప్పినా, మేము మారము. మాకు గురువు లు గా, నాలుగు తగిలించి , మొట్టి చెప్పాలసింది, దేవతలు అయిన మా కోడళ్లు మాత్రమే. సీరియల్స్ చూస్తా లేదా పక్కింటి వారితో మాటలతో, మా కోడళ్లు కు ఒకవేళ తీరిక లేకపోతే, మా కొడుకు లే, ఆ బాధ్యత తీసుకుని మాకు బుద్ధి చెప్తారు.

అప్పటిదాకా ఇసుమంత , సూది మోపి నంత కూడా మారమంటే మారము. అబ్బా, అంత తెలివి తక్కువ వాళ్ళమా, మా కోడళ్లు కు పని , శ్రమ తగ్గనిస్తామా. మా ముసలి తనం లో, వాళ్ళ తిట్లు, కొట్లు, చీదరింపులే మాకు శ్రీరామ రక్ష.

ఓ మూలన పడి ఉంటాం, అన్ని ఆనందంగా భరిస్తాం, మా స్వార్ధ బాధ్యత లేని పెంపకానికి, ఫలితం అనుభవిస్తాం. జైలు లాగా, కన్నీటి బాధ చెప్పుకోవడానికి, చుట్టాలు తో మాట్లాడే వీలు, కల్పించకపోయినా నష్టం లేదు. పని మనిషిగా వెట్టి చాకిరి చేస్తూ, వేసిన సద్ది ముద్ద తిని, హాయిగా ఉంటాము. ఫోన్, నెట్, వాట్సాప్ ఎటూ ఇవ్వరు, మాకు తెలీదా ఇవన్ని, మేము ముందు చేయలేదా మా అత్తకు.

ఇంటికి తమ్ముడు గా వచ్చిన వాడివి, ఒక ముద్ద తిని వెళ్ళు నేతితో, మాకే నీతులు చెపుతావా? బావ(మావ) మొఖము ఒక్కసారి చూడూ, పెళ్ళికి ముందు మరియు ఇప్పుడు. పెళ్ళికి ముందు మనస్పూర్తిగా నవ్వేవాడు, పెళ్ళి రోజు కూడా చివరి నవ్వు నవ్వాడు.

పెళ్ళి తర్వాత మూసిన నోరు, ఇంత వరకు తెరవలేదు, నవ్వ లేదు. పాత ఫొటోలు చూసి, గతాన్ని తలుచుకొని, భోరున ఏడుస్తుంటాడు. అంత కన్న గొప్పవాడివా నువ్వు, ఇంక గమ్మున ఉండు. జుట్టు కూడా చూడు నెత్తిన, సగం ఎకరం నేనే అమ్మించాను.

వాళ్ళ అమ్మను ఎప్పుడైన సరిగ్గా మనిషిగా చూసానా? గౌరవించానా? ఇంటికి వస్తే, ముద్ద కూడా పెట్టకుండా పంపాను. నా అనుమతిలేనిదే కలవడు, ఫోన్ చెయ్యడు. ఒక సారి అమ్ముడుబోయినాక ఇంక బావకి, ఇవన్ని ఎందుకు అమ్మా బొమ్మా అని.

ఇదంతా, నాతోనే మొదలు అయి, నాతోనే చివర అవుతుంది అనుకుంటున్నావా? లేదు, పురాణాలలో కూడా ఉంది. బెజవాడకు ట్రైన్ లేటు అవ్వుద్ది కాబట్టి నీకు, అంత దూరం వెళ్ళను. మా దేవ అత్త, సూర్యాకాంతం కాలం నుంచి చెపుతాను విను. సూర్యాకాంతం, చాయాదేవి, అన్నపూర్నమ్మ లు మాకు ఆరాధ్య దైవాలు.

గుండమ్మ కధ సినిమా చూడు, నీకు అర్ధము అవుతుంది. కోడలిని/కూతురిని లేదా అల్లుడిని, ఏలా హింసించాలో అదుపులో పెట్టుకోవాలో, చిట్కాలు సలహాలు చాలా ఉన్నాయి. చివరలో మా గుండమ్మ తన్నులు తింటుంది గదా, అంతే మేము. సంప్రదాయాన్ని కొనసాగిస్తాము, ఇంకో వందేళ్ళు అయినా ఇంతే, స్రుష్టి ధర్మం మార్చలేము.

నోరుమూసుకోని, వెళ్ళు, ఇవన్నీ పెళ్ళి అయితే నీకే అర్ధము అవుతాయి, అక్క ఎందుకు చెప్పిందో. గుణం చూడకుండా, కట్నానికి, బాహ్య అందానికి బానిసలయ్యే మగవారి తల్లి దండ్రుల బతుకులు ఇంతే అని అక్క మంచిగా చెప్పింది.

ఓ అత్త(పిన్ని), అక్క(చెల్లి) ఆవేదన, బద్దకంతో , భవిష్యత్తు కు సిద్ధపడుతూ

Dt : 11-May-2019, Upd Dt : 11-May-2019 , Category : General, Views : 67 ( id : 108 )
Tags : aunt , sister , brother , duaghter in law
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments