APLatestNews.com top Banner
         
వయస్సు పెరిగింది, వాడు లెక్క చేయడం లేదు, వినే స్థితిలో లేడు - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
ఏవండీ, కష్టం సుఖం తెలీకుండా, మా అమ్మ వాడిని చవట , దద్దమ్మ లా, కాయా కష్టం తెలియకుండా/చేయకుండా పెంచింది. ఇప్పుడు వాడికి తల్లి దండ్రులు అన్నా, గౌరవం లేదు, భయం లేదు.

ఆ తర్వాత, నేను కూడా తప్పులు చెప్పకుండా, వాడిని సమర్దిస్తూ ఇంకా చెడగొట్టాను. ఇప్పుడు తెలియ వస్తుంది, నేను ఎంత పెద్ద తప్పు చేసానో.

ఇప్పటికీ నేను తప్పులు చెప్పకపోతే సరిచేసే ప్రయత్నం చేయకపోతె, రాబోయే రోజుల్లో నేనే/నా కుటుంబమే, ఆ బాధ భరించాలి.


ఒక పెద్దాయన ఆవేదన చూసారు కదా, ముందు మెసేజ్ లో. తన దాకా వస్తే కానీ చాలా మందికి అర్థం కాదు.

10 ఏళ్ల క్రితం, వేరే వాళ్ళ ద్వారా విన్నా, నేనూ చూసా పిల్లవాడి ప్రవర్తన, మిత్రమా , జాగ్రత్తలు నీవే ఇబ్బంది పడతావు భవిష్యత్ లో. అవి చిన్న సంఘటనలు గా చూడకు , ఇప్పుడు అందరూ అంతే అనకు. రేపు నువ్వు భరించలేవు, జాగ్రత్త పడు అని హెచ్చరించా.

అందరిలాగనే తను నవ్వుతూ, ఏం కాదు లే, అనవసర భయాలు వద్దు అన్నారు. ఇప్పుడు తట్టుకోలేక పోతున్నారు, నాకు వయస్సు పెరిగింది శక్తి తగ్గింది, వాడు అసలు లెక్క చేయడం లేదు, ఎవరు చెప్పినా వినే స్థితిలో లేడు. ఏమౌతుందో అని భయం మిత్రుడికి.

అందుకే సామెత ఉంది, మొక్కై వంగనిది మానై వంగుతుందా అని. ఇంక మన మిత్రుడు ని దేవుడే కాపాడాలి. మన అందరి ఇళ్ళు లో అలాగే ఉంది పరిస్థితి. ఎవరూ ఒప్పకోరు తప్పు తమదని తమ పెంపకంది అని. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అన్నారు, బాధపడతం తప్ప, ఏమీ చేయలేము.

Dt : 10-May-2019, Upd Dt : 10-May-2019 , Category : General, Views : 68 ( id : 106 )
Tags : father , son , issues
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments