APLatestNews.com top Banner
         
పెద్ద లేదా చిన్న అయినా, తప్పును తప్పు అని చెప్పకపోతే, ఆ తప్పులో కలసిపోతే , రావణ గతే - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
శ్రీమద్రామాయణ ప్రవచనామ్రుతధార(65) - బ్రహ్మశ్రీ చాగంటి

అప్పుడు విభీషణుడు " నువ్వు నాకన్నా ముందు పుట్టినవాడివి, తండ్రి తరువాత పెద్దన్నగారు తండ్రిలాంటి వారు. నువ్వు నాకు తండ్రిలాంటి వాడివి కనుక, నిన్ను రక్షించుకోవాలనే బుద్ధితొ నాకు తోచిన సలహా చెప్పే ప్రయత్నం చేశాను. నాకన్నా పెద్దవాడిని అధిక్షేపించాలన్న కోరిక నాకు ఎన్నడూ లేదు. ఒకవేళ నేను ఏదన్నా పొరపాటుగా మాట్లాడి ఉంటె నన్ను క్షమించు.

నిన్ను పొగుడుతూ గోతుల్లోకి దింపేవాళ్ళు, తప్పుడు సలహాలు చెప్పేవాళ్ళు చాలామంది దొరుకుతారు. యదార్ధమైన సలహా చెప్పి నిన్ను గట్టెక్కించేవాడు ఎక్కడో ఒక్కడు ఉంటాడు. అలా చెప్పేవాడు దొరకడు, చెప్పినా వినేవాడు దొరకడు.

నేను ఇక్కడ ఉండడం వల్ల నీకు భయం ఏర్పడుతోందని అన్నావు కాబట్టి, నేను నీకు ప్రమాదకరంగా ఉన్నానన్నావు కాబట్టి, నీ కీర్తిని నేను ఓర్చలేకపోతున్నాను అన్నావు కాబట్టి, నేను నీకు ఎప్పటికైనా కంటకుడిని అవుతానని అన్నావు కాబట్టి నేను ఇక్కడినుంచి వెళ్ళిపోతాను.

ఇప్పటికీ నా కోరిక ఒకటే, నువ్వు, నీ పరిజనం, ఈ లంక, రాక్షసులు, నీ బంధువులు, అందరూ సుఖంగా ఉండండి " అని చెప్పి, రావణుడికి నమస్కరించి వెళ్ళిపోయాడు.
--
చూసారు గదా చాగంటి గారు మాటలు, అన్న అని, తప్పులు సమర్ధిస్తు కూర్చోలేదు రాజ్యధికారం అనుభవిస్తూ. ఆ తర్వాత నేరుగా రామునితో చేరిపొయాడు. యుద్దములో రావణ చనిపోయారు. అన్న తర్వాత రాజ్యం పొందారు.

భరతుడు కూడా, తల్లి కైక తప్పును సమర్ధించలేదు, రాముని అరణ్య వాసం భరత పట్టభిషేకం విషయములో. తల్లిని కోప్పడి, తప్పును అర్దమయేట్లు చెప్పి, రాముని వెతుక్కుంటూ వెళ్ళి, తల్లి తో క్షమాపణ కూడా చెప్పించి, తిరిగి రాజ్యానికి రమ్మని కాళ్ళు పట్టుకున్నాడు. రామయ్య రాకపోతె ఇచ్చిన మాటకోసం, రాముని పాదుకలతో రాజ్యం సాగించాడు.

అంతే కదా మరి? తండ్రి, తల్లి, బంధువు, పెద్ద, లేదా చిన్న అయినా, తప్పును తప్పు అని చెప్పకపోతే ప్రొత్సహించినట్లే, ఆ తప్పులో కలసిపోతే దూరంగా ఉండకుండా, రేపు మన బతుకూ, రావణ గతే, అధో గతే.

Dt : 09-May-2019, Upd Dt : 09-May-2019 , Category : General, Views : 47 ( id : 105 )
Tags : chaganti , ramayanam , raavana , vibheeshana
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments