APLatestNews.com top Banner
         
మాత్రృదినం - అమ్మ రుణం - భూమి పుత్రులు పుత్రికలు కు విన్నపం - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
మాత్రృదినం(మదర్స్ డే) మే 12 న, మాత్రుమూర్తు లందరికి పాదాభి వందనము. కనీసం ఆరోజు అయినా మనము, కన్న తల్లి దండ్రులు ని పలకరించి, నటించే ప్రయత్నం అన్నా చేయాలి నాలుగు మంచి మాటలతో. అది కనీస మానవ ధర్మం.

ఇంకొంత మంది, భూమి పుత్రులు పుత్రికలు ఉన్నారు, అంటే సంవత్సరం కి ఒక సారి కూడా, బతికి ఉన్నప్పుడు తల్లి దండ్రులు తో కలవని, చేయిపట్టుకొని, మాట్లాడని వారు లేదా తల్లి దండ్రులు అంటే అసలు గౌరవం లేని వారు. వారు కనీసం, మనసులో అయినా, ఇంకోసారి తలిస్తే బాగుంటుంది. భవిష్యత్ లో మన పిల్లలు, 3D సినిమా ఎటూ చూపిస్తారు, వడ్డీ తో. ఇటువంటి భూమి పుత్రులు, తర్వాతి జన్మలో అనాధలుగా చేతిలో పైసా లేకుండా, రోడ్ వెంట తిరుగుతారు అని నిజం చెప్పినా నమ్మరేమో.

రాజుల కాలం లో, భూమి పుత్రులు అంటే, రాజులు రాజకుమారులు, ఆ గౌరవం వేరు. ఈ కాలం లో, భూమి పుత్రులు అంటే, తల్లి దండ్రులు కు మేము పుట్టలేదు, భూమిలో నుంచి వచ్చాము అనుకునే వారు.

60 ఏళ్ళు వచ్చి లేదా శక్తి ఓపిక లేక లేదా జబ్బుతో , ఒంటరిగా నడిస్తే పడతాము అని కర్రతో వూగుతూ నడిచే వాళ్ళ తో , ఒక్క రోజు ఉండి చూడండి. మన భవిష్యత్ మనకు కనపడుతుంది, భూతద్దంలో. ఆ తర్వాత నిద్ర పట్టదు. వయసులో ఉన్నప్పుడు మాకేమి డబ్బు ఉంది, ఆశ్రమాలు ఉన్నాయి అనుకుంటాము. సత్తువ పొయిన రోజున తెలుస్తుంది ప్రేమ అంటే ఏమిటో.

ఒక భూమి పుత్రుడు అడిగారు , సంవత్సరం అని లెక్క ఏముంది, మాకు కుదిరినప్పడు 2 లేదా 5 ఏళ్ల కు, వాళ్ళను కలసి చూస్తే, తప్పులు ఏమిటి? మాకు మాత్రం ప్రేమ ఉండదా అని, మాకు బాధ్యతలు సంసారాలు లేవా?

కొంత మంది నోరు తెరిస్తే నే, వారి మనసు మంచితనం, బయట పడుతుంది. డబ్బు లేక కష్టాలలో ఉన్న వారి గురించి కాదు ఇది. అన్ని ఉండి కూడా, చెయ్యనివారి గురించి.

ఫోన్, వాట్సాప్, స్కైప్ ను వాడి చూడటం , కాగితం పూల తో లాప్ టాప్ లో దేవుని పూజ లాంటిది, నిష్ప్రయోజనం. పెద్దలు ను వాటితో కాదు గౌరవించేది, నిజమైన పూలతో పక్కన కూర్చొని చేయిపట్టుకుని. చికెన్ బిర్యానీ, టీవీల్లో లెదా బొమ్మ లో , చూస్తే కడుపు నిండుద్దా?

సమయం గురించి సమాధానం, రేపు ఉదయం మనం నిద్ర లేస్తాము అని ఉందా? ఎవరికీ గారంటీ లేదు. దాదాపు మన తల్లి దండ్రులు 50 పై వాళ్లే.

దురదృష్టవశాత్తు, రేపు వారు లేకపోతే, ట్రంప్ బాబు జగన్ మోడీ, ఎవరి రికమండేషన్ తో, వారిని వెనక్కి తేగలము? ఒకవేళ మనం చచ్చి పైకి పోయినా , వారు వేరే చోట , ఎప్పుడో పుట్టి ఉంటారు , అలాగూ మనకు దొరకరు.

నీ కోట్ల డబ్బు తో, వాళ్ళను కలవ గలవా, వెళ్ళాక? మన జీవితం క్షణ కాలం , నీటి బుడగ. ఇది అందరికీ తెలుసు, మరి ఎందుకు ఈ పాడు బతుకులు, ఎవరిని ఉద్దరించడానికి. తల్లి రుణం తీర్చలేని వాళ్ళం, మనదొక సంసారం, మనకు సంస్కారవంతమైన పిల్లలు.

ఒక తుఫాను, ఉప్పెన , రోగాలు, భూకంపం , ప్రమాదాలు, మన వెంటనే నీడ లాగ నడుస్తున్నవి, ప్రతిక్షణం శివాజ్ఞ కోసం. మిత్రమా ఆలోచన చెయ్యి, నేల మీద నిలబడి. అహంకారం ఆవేశం వద్దు.

ఒంటరి వాళ్ళు చూడగలరు అంటారు కొందరు. ఒంటరి వాళ్ళు కే విషయాలు ఎక్కువ, అన్నీ తామే చూసుకోవలి. సింగల్ వాళ్ళు మింగల్ అవ్వాలని, విందు, వినోదాలు, అమ్మయిలతో తిరగడానికే టైం సరిపోదు, ఇంక పెద్దలను చూస్తారా? తప్పించుకోవడానికి అదొక సాకు.

మనం కట్నం తీసుకోకుండా లేదా అందం వెంట పరుగులు తీయకుండా ఉంటే, అవతలి మనిషి కూడా అర్ధము చేసుకుంటారు, లేదంటే భార్య లేద భర్త మీదో నెపం వేస్తారు.

వాళ్లు బయటివాళ్ళు కాదు, మన సొంత అమ్మ, నాన్న. మన భాగ్యం సౌభాగ్యం వాళ్ళ భిక్ష మాత్రమే. వాళ్ళ కష్టం, చెమట, నెత్తురే మన శరీరం.

Dt : 04-May-2019, Upd Dt : 04-May-2019 , Category : General, Views : 127 ( id : 101 )
Tags : mothers day
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments