
గంగా నది(పరమాత్మ) లోని జలాన్ని 10 గ్లాసుల్లో(ఆత్మ) తీసుకొండి. ఒక గ్లాసు గుడికి, ఒక గ్లాసు బడికి, ఒక గ్లాసు మందుకి, ఒక మంచి పనికి, ఒక చెడ్డ పనికి వాడబడ్డాయి అనుకుందాము. ఇప్పుడు చెప్పండి ఏది గంగా జలము కాదో. కర్మలను బట్టి మన ఆత్మకు శరీరం, పరిస్తితులు లభిస్తాయి. నిజాన్ని తెలుసుకొని, పరమాత్మ తో చేరితే మన జన్మ సార్ధకము. కాబట్టి ఆత్మ జ్ఞానం నీ లో నే ఉంది, ప్రయత్నించు.
అలాగే సూర్యుడిని మధ్యాన్నం వేళ వీటిలొ చూస్తే 10 మంది కనపడతారు 10 గ్లాసుల్లో. అంటే ఒక్కడే గాదా? అదే శంకరుని అద్వైతం. లేదు వేరు వేరు అనుకున్నా, అదే మధ్వాచార్యులు/జీయరు ల ద్వైతం, పరమాత్మ తొ అను సంధానము కావాలి. విశిష్టాద్వైతం(రామానుజాచార్యులు) కూడా అదే - జీవాత్మ, పరమాత్మ, ప్రక్రుతి.
ప్రయత్నించకుండా అది కష్టమనుకో వద్దు. పుట్టటము తేలికా? చదువు తేలికా? సంపాదించటం తేలికా? పిల్లల్ని పెంచటము తేలికా? ఉద్యోగము తేలికా? బతకటము తేలికా? కష్టము లేకుండా అవి కూడా రావు.
Dt : 01-Aug-2017, Upd Dt : 16-Feb-2019 , Category : Devotional, Views : 1652 ( id : 1 )
Tags :
Facebook Comments