Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. ప్రకాశం జిల్లా పంచాయతీ అధికారులు, శ్రీ జీవీ నారాయణ రెడ్డి గారికి మరియు ఇతర కరోనా కోవిడ్ అధికారులకు మరియు ఇతర ప్రభుత్వ శాఖలకు (మున్సిపల్, పంచాయత్, ఆరోగ్య, రెవెన్యూ, పోలీస్), జిల్లా ప్రజలు మరియు విలేఖరుల తరపున నమస్కారములు, క్రుతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.
నిన్నటి దాకా మాకు, మీరు కేవలం జిల్లా పంచాయతీ అధికారులు గా మాత్రమే తెలుసు. కానీ నిన్న ఆలస్యముగా తెలిసిన కొత్త విషయము, ప్రకాశం జిల్లా (కరోనా) కోవిడ్ వారియర్స్ లిస్టు లో, అంటే కరోనా తో పోరాడే యోధులు లిస్టు లో, భారత ప్రభుత్వం కు మన ప్రకాశం జిల్లా తరుపున, మీరే సారధి గా ఉన్నారు అని చూసాము. చాలా ఆనందపడ్డాము. ప్రకాశం జిల్లా లో జీరో కేసులు ఉన్నాయి అంటే, ముందు గా మీ నాయకత్వం నే మెచ్చుకోవాలి. అన్ని ప్రభుత్వ శాఖలు ను, ఒక త్రాటిపైకి తెచ్చి ముందుకు నడిపిన, మీ అచంచల నాయకత్వ కృషి కి ధన్యవాదాలు, అభినందనలు.
కానీ ప్రజలకు సాధారణముగా, వార్తలు మరియు ఫోటోలు ద్వారా ఎక్కువగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు కనపడుతూ ఉంటారు గానీ, మీ పేరు ఫోటో కనపడదు. మీకు వ్యక్తిగతముగా ఇష్టము లేకపోయినా, ప్రచారము గురించి, మన పంచాయితీ శాఖ తరపున మన అధికారులకు బాసట ధైర్యముగా ఉండాలి అంటే, మీ అందరి సేవలు వార్తలు లో రావాలి, తగిన గుర్తింపు లభించాలి.
వార్తలు చూసే రాసే మాకే, నిన్నటి దాకా తెలియదు ఈ విషయం, మీరు కోవిడ్ వారియర్ గా నాయకత్వం వహించారు అని. గూగుల్ లో సెర్చు చేసినా, ప్రభుత్వం తరపున సమాచారం కనపడుతుంది కానీ, పేపరు వార్తలు తరపున మీ సమావేశములు పనులు కనపడటం లేదు ప్రజలకు.
రెండు నెలల పైగా, అందుకే మేము అందరూ జిల్లా, పట్టణ, గ్రామ అధికారులు ను చేతులు జోడించి వేడుకుంటుంది. మీరు వివిధ స్ధాయి ల లో, అంటే జిల్లా పట్టణ గ్రామీణ స్థాయిలలో, సోషల్ మీడియా పేజీలు తెరచి, సమగ్ర సమాచారం పెడుతుంటే, ప్రజలకు తెలుస్తాయి మన లేదా ఇతర శాఖల గురించి, అధికారులు త్యాగాల సేవలు గురించి, అని మేము మొత్తుకుంటున్నాము అందరు అధికారుల తో.
చూడండి, మీ గురించి, మాకు కూడా తెలీదు ఇప్పటిదాకా. అలాగే మా మండల అధికారులు సేవల గురించి, మా ప్రజలకు ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. మా ఎంపీడీవో, ఎండీవో, సెక్రటరీ గారు ఎంతో కష్టపడుతున్నారు, కానీ ప్రజలకు సమాచారం ఆన్లైన్ లో చేరడం లేదు. తెలుగు ప్రవాసులు కూడా మన వార్తలను ఇంటర్నెట్ లో గమనిస్తూ ఉంటారు.
మీరు ప్రకాశం పంచాయతీ శాఖ ఫేస్బుక్ పేజీ లో, ఉదాహరణకు చీరాల వేటపాలెం పర్చూరు మండలం లో ఒక్క అధికారినైనా ఫోటో పెట్టి, పొగిడినట్టుగా ఉంటే బాగుంటుంది కదా. న్యూస్ పేపర్ లో, ఓ మూలన చిన్న వార్త వచ్చినా కూడా, వాటిని జనం కొనడం లేదు చూడడం లేదు. పేపరు వాళ్ళ పేపర్ కటింగులు, గూగుల్ సెర్చ్ లో రాకపోవచ్చు.
ప్రజలు, గూగుల్ సెర్చ్ లేదా ఆన్లైన్ లో ఉచితం గా మాత్రమే వార్తలను ఎక్కువగా చూస్తున్నారు. అక్కడ మన అధికారులు సేవా సమాచారం లేదా వీడియోలు లేదా ఫోటోలు ఉండదు/ ఉండవు.
ఇప్పడు అయినా, మన మరియు ఇతర శాఖల అధికారుల విజయాలను, ప్రజలకు తెలిసే విధంగా వివిధ స్థాయిలలో, ఉచిత సోషల్ మీడియా పేజీలు (లేదా ఖర్చుతో సొంత వెబ్సైట్లు) తెరవాలని సమాచారము నింపాలని, మా సవినయ పూర్వక విన్నపము అభ్యర్ధన. జిల్లా, పట్టణ, గ్రామీణ కోవిడ్ మీటింగ్ ల లో కూడా, మిగతా జిల్లా పట్టణ గ్రామీణ అధికారులు కూ, దాని వలన లాభాన్ని వివరించమని మా ప్రార్ధనలు.
ప్రజల గుండెల్లో మన శాఖ, అలాగే ఇతర శాఖల అధికారులు, పడుతున్న కష్టాలు చేస్తున్న త్యాగాలు నిలిచిపోవడానికి, ఇదే సరైన సమయం, ఎందుకంటే భారత ప్రభుత్వమునకు మీరే జిల్లా ప్రధాన అధికారి, కరోనా పోరాటం లో.
కరోనా ముఖ్య అధికారులు గా, ప్రెస్ రిలీజ్ ల, లింక్ వెబ్సైట్ లేదా వివరాలు ఫోటోలు ఉంటే మాకు మరియు ఇతర విలేఖరులకు పంపగలరు, చెప్పగలరు.
మేము కూడా మంచి గా ఒక ఆర్టికల్ ద్వారా, మా వంతు ప్రచారం చేస్తాం, ఇంకో పదిమందికి చేరవేస్తాము. లేదా మీరు మీకు సంభంధించిన శాఖ, సోషల్ మీడియాలో, పెట్టినా చాలు.
మీరు ప్రకాశము జిల్లా కు చేస్తున్న, కరోనా అదనపు బాధ్యత లు సేవలకు, ధన్యవాదాలు, వందనములు.
Thanks for your great service, scarifies and exceptional work for our great Prakasam District, we appreciate that. Participated, Prakasam District Nodal Officers :
> Panchayat - G V NARAYANA REDDY
> AYUSH - Dr. G. Padmajathi
> National Youth Volunteers - District Youth Coordinator - kamal sa
> NSS - Dr. S. Vasundra
> sainik welfare/zila sainik boards - Dr. B. Ravi (FAC)
Covid Warriors list by District/ State
self4society
Note : మీకు తెలిసిన మంచి అధికారులు ఉంటే, దయచేసి లింక్ ఫోటోలు వీడియో ల తో , తెలియజేయగలరు. మంచి వాళ్ళ ను మంచి వాళ్ళే గుర్తించాలి మరి , వెలుగులోకి తేవాలి.
ఈ వార్తను సాధారణంగా, తండ్రి లాంటి జిల్లా కలెక్టరు గారి, సోషల్ మీడియా పేజీ లో చూడాలి రెండు నెలల ముందు, అంటే కరోనా టీమ్స్ ప్రారంభములో. కానీ వారి సోషల్ మీడియాలో మార్పులు లేవని విన్నవించాము చాలా సార్లు.
దాని వలన నిజాయితీ గా కష్టపడి పనిచేసే అధికారులు కు గుర్తింపు వస్తుంది కదా.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,370,573; 104 తత్వాలు (Tatvaalu) and views 256,754 Dt : 17-May-2020, Upd Dt : 17-May-2020, Category : News
Views : 1236
( + More Social Media views ), Id : 547 , City/ Town/ Village : Ongole , State : AP , Country : India
Tags :
zero corona cases ,
prakasam district ,
covid warriors ,
government of india ,
panchayat dept ,
G V NARAYANA REDDY కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments