వైకాపా పెద్దలు, ఎమ్మెల్యేలు మంత్రులు ద్వారా, జగన్ గారికి రావాల్సిన, న్యాయమైన ప్రచారం - Request - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2027 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2062 General Articles and views 1,788,285; 104 తత్వాలు (Tatvaalu) and views 217,396.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

మీకు గుర్తు ఉందా, రాష్ట్ర మరియు ప్రకాశం జిల్లా సమాచార మరియు పౌర సంబంధాల శాఖ లేదా కలెక్టర్ భవనం వారు, జిల్లా ప్రెస్ రిలీజ్ లు, గత సంవత్సరం గా మీడియా కోసము పెట్టడం లేదని, జిల్లా అధికారులు నారాయణ రెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ గారికి మరియు రాష్ట్ర అధికారులు విజయ కుమార్ రెడ్డి గారికి, మెసేజ్ లేదా ఇమెయిల్ లు ద్వారా విన్నపాలు చేశాము, గత మే నెలలో. Link

జూన్ పదవ తేదీ నుంచి, కొన్ని ప్రెస్ రిలీజ్ లు పెట్టడం మొదలు పెట్టారు. అయితే ప్రతి రోజూ అన్ని కార్యక్రమాలవి పెట్టడం లేదు. రెండు రోజులు, వారం కు, అలా ఖాళీ ఉన్నప్పుడు పెడుతున్నారు. పర్లేదు ముందు కొంత కదిలితే, చిన్నగా మిగతా మార్పులు వస్తాయి. ప్రకాశం జిల్లా ప్రెస్ రిలీజ్ లింక్, పై లింక్ లో చూడవచ్చు టేబుల్ లో. దీనికి తగు చర్యలు తీసుకున్న, జిల్లా కలెక్టర్ గారికి మరియు సమాచార శాఖ అధికారులు కు ధన్యవాదాలు.

గత వారం లో, వెంటనే స్పందించి అధికారులు ను వివరణ కోరిన, జిల్లా పంచాయతీ అధికారి జీవీ నారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. వారు రాష్ట్ర స్ధాయి అధికారి గా చేరుకోవాలి త్వరలోనే, ప్రజలకు స్పందించే వారు మంచి స్థానాలలో ఉండాలి.

ఇంకా మనం ఎదురు చూస్తున్నవి, ప్రకాశం జిల్లా కలెక్టరు గారి ఫేస్బుక్ మరియు ట్విట్టర్ అప్డేట్స్. ఒకవేళ కొత్త లింక్ లు వచ్చి ఉంటే పంపగలరు. అలాగే కలెక్టర్ గారి వెబ్సైట్ లో, న్యూస్ సెక్షన్ ఫోటోలు తో పాటు, పాల్గొన్న కార్యక్రమం గురించి మరియు అధికారుల పేర్లు తో, ఓ నాలుగు మాటలు ఉంటే బాగుంటుంది కదా. ఇతర జిల్లా స్ధాయి అధికారులు కు కూడా, మర్యాద ఇవ్వాలని కోరుతున్నాము. వారి మీటింగ్ వివరాలు కూడా పెట్టాలి.

అలాగే పంచాయతీ, మున్సిపల్, రెవిన్యూ, విద్య, ఆరోగ్య వైద్య, జిల్లా మండల పట్టణ గ్రామ స్ధాయి అధికారులు కూడా, ప్రభుత్వ నవరత్నాలు మరియు తమ సిబ్బంది సేవలు త్యాగాల గురించి, రోజూ ఫేస్బుక్ అప్డేట్స్ ఇవ్వడము జరగాలి.

గతము లోనే, అటు పోలీసు శాఖలో కూడా ఐజీ, డిఎస్పీ, సీఐ స్ధాయి అధికారులు కూడా, ప్రభుత్వ చర్యలు గురించి, సిబ్బంది సేవల గురించి, ఫేస్బుక్ లేదా సోషల్ మీడియా అప్డేట్స్ ఇవ్వాలని కోరాము.

కరోనా మరియు తమ సిబ్బంది సేవల గురించి, అందరు ప్రభుత్వ అధికారులు ఫేస్బుక్ లేదా సోషల్ మీడియాలో, ప్రజలను అప్రమత్తం చేయాలి కదా.

జగన్ గారి నవరత్నాలకు న్యాయముగా రావల్సిన పబ్లిసిటీ, ఇంకా ఎక్కువ స్థాయిలో వస్తుంది కదా. ఇప్పుడు గత సంవత్సరముగా జగన్ గారికి నష్టం జరుగుతుంది, వీరు అప్డేట్స్ ఇవ్వకపోతే. చదువుకున్న వారు, పార్టీలు కు తటస్థంగా ఉన్నవారు, అధికారుల ఫేస్బుక్ పేజీలు మాత్రమే చూస్తారు. ఎక్కువ మంది ప్రజలు, అధికారులను నమ్ముతారు నాయకుల కన్నా కూడా.

గత ప్రభుత్వం లో చంద్రబాబు గారు లేదా వారి సలహా దారులు, ఎందుకు ఈ న్యాయమైన ప్రచారాన్ని వదిలేశారో తెలీదు. ఇది అన్ని జిల్లా ల కు సంబంధించిన సమస్య, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య.

ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు కూడా నిర్లిప్తంగా ఉంటన్నారు , జిల్లా మండల పట్టణ గ్రామ స్ధాయి అధికారులు ను అడగకుండా.

ఏవండీ ఎమ్మెల్యే గారు, పంచాయతీ ఈవో ని, ఎమ్మార్వో ని, వైద్య ఆరోగ్య అధికారిని, డీఎస్పీ సీఐ లను, మున్సిపల్ కమిషనర్ ను అడగలేరా , కరోనా జాగ్రత్తలు, నవరత్నాలు మరియు తమ సొంత సిబ్బంది సేవల త్యాగాల గురించి, సోషల్ మీడియా లో, రోజూ ఎక్కడ పెడుతున్నారు అని. వాలంటరీ వ్యవస్థ చేతిలో ఉంది కదా.

ఎంపీలు జిల్లా స్ధాయిలో అధికారులు ను అవే పనులు గురించి అడగలేరా.

ప్రతి దానిని, జగన్మోహన్ గారు లేదా విజయ సాయి గారు, సుబ్బారెడ్డి గారు, సజ్జల గారు బొట్టు పెట్టి అడగమని చెప్పాలా? ఆ వివరాలు ఎక్కువగా ప్రజలకు చేరితే, పరిపాలన లో లోటుపాట్లు తెలుస్తాయి కదా. ఎక్కువ కాలం మరలా మరలా, జగన్ గారు ఉండాలి అంటే, తటస్థంగా ఉన్న ప్రజలకు ఈ సమాచారం అన్ని స్ధాయిల లో చేరాలి.

వైకాపా పార్టీ పెద్దలు విజయ్ సాయి గారు, సజ్జల గారు, వైవీ సుబ్బారెడ్డి గారు, దీని గురించి అధికారులు తో మాట్లాడి, ఎమ్మెల్యేలు మంత్రులు ద్వారా, తగిన చర్యలు తీసుకుని జగన్ గారికి రావాల్సిన, న్యాయమైన్ మంచి ప్రచారం ను, తెస్తారని కోరుతున్నాము.

ప్రతిపక్షాలు పరంగా చూసినా కూడా ఇది లాభం, సమాచారం ప్రజలకు చేరితే అన్ని స్ధాయిలలో, ప్రజలు అధికారులు ను ప్రశ్నలు కూడా అడుగుతారు. రేపు చంద్రబాబు గారు లేదా పవన్ గారు లేదా కన్నా గారు, ఒకవేళ అధికారంలోకి వచ్చినా కూడా, ఈ వ్యవస్థ వారికి కూడా ఉపయోగపడుతుంది కదా. ఆలోచన చేయండి, రాష్ట్ర భవిష్యత్తు కోరే మంచి వారందరూ కూడా ఇది ఉపయోగం. ధన్యవాదాలు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2062 General Articles and views 1,788,285; 104 తత్వాలు (Tatvaalu) and views 217,396
Dt : 19-Jul-2020, Upd Dt : 19-Jul-2020, Category : Request
Views : 877 ( + More Social Media views ), Id : 601 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : ysrcp , top leaders , vijay sai reddy , subbareddy , sajjala , mlas , ministers , fair campaign , ys jagan , navaratnalu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content