పసుపు తమ్ముళ్ళూ, కాస్త తగ్గండి 5 ఏళ్ళు, ఒకరి దయా భిక్ష తో వచ్చిన అధికారం, అణుకువతో కూటమి విలువలు - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2136 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2171 General Articles and views 2,206,454; 104 తత్వాలు (Tatvaalu) and views 244,313.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Yellow brothers reduce bit 5 yrs power came kindness alms stay respect alliance values

*Yellow brothers, reduce a bit, 5 years, the power that came with one's kindness alms, stay respect and include others, protect the values ​​of the alliance. Don't provoke the Janasainik.*
*పసుపు తమ్ముళ్ళూ, కాస్త తగ్గండి 5 ఏళ్ళు, ఒకరి దయా భిక్ష తో వచ్చిన అధికారం, అణుకువతో ఉండి, 4 గురును కలుపుకుని, కూటమి విలువలు కాపాడండి. దయచేసి జనసైన్యం ను రెచ్చగొట్టకండి.*

- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva. Conquer Arishadvarga Ashtavyasana, Satsang జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 min నిమిషాలు

A few public comments about the composition of the Cabinet. Chandranna sacrifices should still be done, and one should change to sattva guna. What are raga dvesha? మంత్రివర్గం కూర్పు గురించి కొన్ని ప్రజల ముచ్చట్లు. చంద్రన్న త్యాగాలు ఇంకా చెయ్యాలి, సత్వ గుణముకు మారాలి. రాగ ద్వేషాలు అంటే ఏమిటి?

*పవనన్న సత్వ గుణం, చంద్రన్న తమో గుణం, జగనన్న రజో గుణం - ఇది మీ ముగ్గురు వరకే పోలిక. అందుకే ప్రతి ఒక్కరూ అరిషడ్వర్గం ను జయించాలి. లేదంటే అది చిత్తశుద్ది లేని పాలన/ పూజ/ బాధ్యత.*

ప్రాపంచిక వ్యామోహదాసులైన రజో తమో గుణాలు, నిలకడలేని తమ మనసును నియంత్రణ చేసి, సత్వ గుణం వారి మాటలు వినాలి, కలకాలం పదవిలో ఉండాలి, నిస్వార్ధ బంధముతో అనుబంధముతో అంటే.

చంద్రన్న అనే నేను ఎటువంటి రాగ ద్వేషాలు లేకుండా, పరిపాలన చేస్తాను రాజ్యాంగం/ దైవం/ ఆత్మ సాక్షిగా, అన్నప్పుడు అది 5 ఏళ్ళు గుర్తు ఉండాలి, ప్రతి ఎమ్మెల్యేకు/ ఎంపీకు/ అధికారికి కూడా. వారానికే మరిస్తే ఎలా?

ప్రధాని మోదీ ని చూసి, మనకు బుద్ది రాదా? మానవత్వం తో, ఆత్మాభిమానం తో బ్రతక లేమా, ఎవరూ వేలెత్తి చూపకుండా? మా పిల్లలు బీజేపీ, తెదేపా, వైకాపా, జనసేన బాగుండాలని మాత్రమే మా ఈ దిద్దుబాటులు.

ఈ చిన్నతప్పులే రేపు పెద్దవై, మన కూటమి బంధానికి బీటలు వేస్తాయి. అది భార్యాభర్తలైనా, బంధువులు, స్నేహితులూ అయినా అంతే. మొక్కగా ఉన్నప్పుడే రాగ ద్వేషాలు తీసేద్దాము.

*రాగ ద్వేషాలు అంటే ఏమిటి? మా పేరు, మా మామ పేరు, మా కుటుంబం పేరు, ప్రజా పన్నులతో నడిచే పధకాలకు ఉండాలి అన్న రాగం ప్రేమ వ్యామోహం దిగజారుడుతనం ఉండకూడదు. మా అబ్బాయి/ అమ్మాయి కి, మా బంధువులకు పదవులు వ్యాపారాలు ధనము ఆస్తులు ఇస్తాను, మా తర్వాత వారసులు వీరే అని ఉండకూడదు.*

కేవలం సత్వ గుణ సంపన్నులకే బలం ఇవ్వాలి. అప్పుడు అందరూ ప్రజలను కన్నబిడ్డలా మనశ్శాంతిగా పాలిస్తారు. రామరాజ్యం అంటే, సత్వ గుణ రాజు/ నాయకుడి తోనే వస్తుంది. మరి సత్వ గుణం లేని ప్రజలు, సత్వ గుణ నాయకుని ఎన్నుకుంటారా?

*మేము ఒక్కరిమే 5 సంతకాలు చేస్తాము డిప్యూటి సీయెం లేకుండా అనకూడదు. ఆ ఖ్యాతి మాకే ఉండాలి అన్న దుర్బుద్ది ఉండకూడదు.*

మేము వస్తుంటే రాజులు లాగా, ప్రజలు మాకు పూలు వేయాలి రోడ్ అంతా అన్న రాగం వ్యామోహం ఉండకూడదు. మనమే, సేవకులుగా, ఆ ప్రజలపై పూలు వెయ్యాలి, మీరే మాకు నాయకులు అని.

విలేఖరులు, అంటే ప్రజల మనోభావాలను ఆవేశాలను ఆఖరకు తిట్లను కూడా, అందముగా అక్షరాలలో మనకు మన మనసుకు అందించేవారు, మనల్ని తప్పు పడతున్నారు అని, లేదా విపక్షాలపై, లేదా సొంత పార్టీలో మంచి చెప్పిన నాయకులపై, లేదా నిలదీసిన ప్రజలపై కోపం ద్వేషం కోపం ఉండకూడదు.

పసుపు మీడియాపై ప్రేమ, బులుగు మీడియా లేదా మాలాంటి చిన్న మీడియా పై ద్వేషం, నిర్లక్ష్యం ఉండకూడదు. మన పసుపు/ బులుగు/ ఇతర అమ్ముడుబోయిన మీడియా పక్షపాతముతో, అసలు సత్వ గుణం గురించి మాట్లాడవు. అందరినీ సమముగా, పైకి తేవాలి, తోడ్పాటు ఇచ్చి, గౌరవించి ప్రజా వాక్కుగా.

మనలో ఉన్న చెడే, మనల్ని, మన కుటుంబమును, మన సమూహమును, మన పాలనను పతనము చేస్తాయి సుమా. గత పాలనల ఫలితాలను చూసాము, ఒక సారి 23, ఒక సారి 11 సీట్లు. ఎవరూ రాయంది, మీరు ఎందుకు రాస్తున్నారు మీ ధైర్యం ఏమిటి అంటారా, ప్రతి మనిషిలో సత్వ గుణం కూడా ఉంటుంది, తల్లి ప్రేమతో పెంచితే, కాబట్టి అవి మీకు ఉన్నాయి మంచిని స్వీకరిస్తారని మాత్రమే, మీరూ ఎల్ల కాలం ఆరోగ్యం తో పరిపాలించాలి అని.

శ్రీరాముడు, ఒక సామాన్య వ్యక్తి అభాండము వేసారు అని, అతనిని పట్టుకుని రండి, శిక్షిద్దాము అనలేదు, తన తప్పును సరి చేసుకునే ప్రయత్నం చేసారు, భార్యా వియోగముతో. మా వివరణలో తప్పు ఉంటే, సాక్ష్యాలతో మీరూ జవాబు తెలుగు లో గౌరవముగా ఇవ్వగలరు. అలాగే మన లింక్/ కధనం ఫోటోను పెద్దగా చేసి చూడండి, రాగ ద్వేషాల సాక్ష్యాల ను.

ఇది మన పసుపు తమ్ముళ్ళకు, జనసైనికులకు, మోదీ పరివార సభ్యులకు పంపి, వారిని చైతన్య పరచగలరు. మనమందరం మోదీ పరివార సభ్యులం, మరువద్దు.

హనుమంతుని కోపాన్ని రాముడు కూడా ఆపలేడు, లంకను తగల బెట్టారు, ఇంకా ఎంతో మందికి ముక్తి ని కలిగించారు.

అలాగే జనసైనికుల ఆవేశాన్ని, పవన్ కూడా ఆపలేరు. మీ తిక్క, కపట, నటన, 2 నాల్కల, వంకర, వెన్నుపోటు చేష్టలకు వాళ్ళు రగిలారు అంటే.

గతం మరువవద్దు. అలవాటు లేకపోయినా, మనసుకు కష్టం అయినా, క్రుతజ్ఞత, విశ్వసనీయత, విలువలతో తగ్గడం, అందరినీ కలుపుకుపోవడం హ్రుదయముతో, మంచి మర్యాద, నేర్చుకోండి. ఇవన్నీ జగనన్న అనుచరులకు కూడా వర్తిస్తాయి.

లేదంటే, మీకు మరలా మరలా, మన పసుపు నాయకుల, హీనత్వ రజో తమో గుణ లక్షణాలను, గౌరవముగా గుర్తు చేస్తాము. మొన్న రాసిన 2 కధనాలు చదివిన తర్వాత కూడా, కుక్క తోక వంకరే అని నిరూపించారు.

మనకు అన్నం పెట్టిన సొంత వారినే, నిర్దయగా వెన్నుపోటు పొడుస్తాము. వారి, వీరి, చేయి ఆసరా లేనిదే, మనము సొంతగా గెలవ లేము. కానీ సత్వ గుణ పవనన్నతో, అలా మన వెన్నుపోటు లక్షణాలతో ఉండటం కష్టం. జన సైనికులతో ఇంకా కష్టం.

బాబాయి అబ్బాయి లా కలసి ఉన్న చంద్రన్న, పవనన్న మధ్య, ఈ పసుపు తమ్ముళ్ళు మరల తమ సొంత తెలివితేటలతో తమ గొప్పతనము చాటాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు. దయచేసి వారి బంధాన్ని కలకాలం నిలపండి.

1). ఇది కూటమి విజయం ఎక్కడ చూసినా, ముగ్గురూ ఉండాలి, మూడు రంగులు (పసుపు, కాషాయం, తెలుపు/ ఎరుపు), పార్టీ జెండాలు, పార్టీ గుర్తులు ఉండాలి. మీకు తెలియని సంస్కారం మేము నేర్పుతాము, కూటమి మర్యాదలు. నాయకుల ఫోటోలు, వరుసగా మొదట చంద్రన్న, తర్వాత మోదీ అంటే మధ్యలో (ప్రధాని పెద్దగా), తర్వాత పవన్ (చివర). లేదా మొదట మోదీ, తర్వాత సంధాన కర్త పవన్ మధ్యలో, తర్వాత చంద్రన్న. ఇతర చిన్న నాయకుల ఫోటోలు పెడితే, మరి అటు చిరంజీవి నాగబాబు మనోహర్ అలాగే చిన్నమ్మ అలాగే అమిత్షా ఫోటోలు పెట్టాలి. చంద్రన్న మధ్యలో ఉండటం, అది రాగ ద్వేషము కాదా? ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు లో రంగులు బొమ్మలు అందరివి ఉండాలి.

2). పవనన్న త్యాగాలకు సరి పోయిన త్యాగం చంద్రన్న చేయలేకపోయారు, ఇంకా తనలో స్వార్ధ కపట ఆలోచనలు పోలేదు, లేకపోతే యువనాయకుడు పవనన్న కు అధికారం ఇచ్చి, పక్కన విశ్రాంతి తీసుకునే వారు, తన అపురూపమైన త్యాగముతో, ప్రపంచం నివ్వెర పోయేది, మొన్న పురాణ సాక్ష్యాలను ఇచ్చాము కదా మీకు. ఇంకా పదవీ కాంక్ష ఉండడం ఒకరి అండతో గెలిచాక కూడా, అది రాగ ద్వేషము కాదా?

3) ఒక వైపు ప్రతీకార చర్యలు ఉండవు అంటూనే, హోం మినిస్టర్ పదవి నీతి నిజాయితి సంస్కారం ఉన్న పవనన్న కు ఇవ్వలేదు, కేవలం చంద్రన్న మాటలకు తల ఊపే బసవన్నలకు ఇస్తున్నారు, జగనన్న పాలలో లాగా. అది రాగ ద్వేషము కాదా? అంటే, మరలా జగనన్న రావడానికి చంద్రన్న సహాయం చేస్తున్నారు.

హోం లేకుండా, ఇంక ఎన్ని ఇచ్చినా తక్కువే. డిప్యూటి సీయెం మరియు హోం ఉంటే, పక్షపాత బుద్ది లేకుండా, పరిపాలన సత్వ గుణ పవనన్న చూపేవారు అని ప్రజల అభిప్రాయం. ప్రతిపక్షాలపై లేదా మంచి చెప్పినవారిపై దాడులు జరగవు. జరిగితే, దాడులు చేసిన వారు, జైలు లో ఉంటారు నాయకుల అండలేకుండా. పవన్, ఎవరినీ వదలరు, వారు తప్పు చేసి ఉంటే, సొంత పార్టీ వారైనా అని ప్రజల అభిప్రాయం.

4). కూటమి/ ప్రభుత్వ/ ప్రజా/ దైవ భోరోసా ఫించన్ పెంపు అని సాధారణ పేరు ఉండాలి, అన్ని ప్రజా పధకాలకు. మొదటి 5 సంతకాలు చేసేటప్పుడు, పవనన్న ఏరి? ఇదేనా డిప్యూటి సీయెం కు మర్యాద?

5 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన, ఎన్డీఏ డబల్ ఇంజన్ సర్కారు అని ఆంధ్రా బీజేపీ చెపుతున్నది, మరి మీరు అలా చెప్పరేమిటి? మీరు కూటమిలో ఉన్నారని వారానికే మరిచారా? ఎలా పెడతారు, రామన్న చంద్రన్న పేర్లు? అది రాగ ద్వేషము కాదా?

5) ఇంకా రాజుల పాలనలో ఉన్నామా? ఏమిటి ఆ పూల జల్లులు? పవనన్న మనము సేవకులము అన్నారు, మరి మనము సేవకులుగా, ప్రజలపై పూలు వేసేది ఎప్పుడు? ఇంకా ఆ రాజరిక వాసనలు వదలమా? మన సత్వ గుణం చూపమా చంద్రన్నా? అది రాగ ద్వేషము కాదా?

6) తిరుమలలో రాజకీయాలు ఎందుకు? పదుల అనుచరులు లేకుండా, ప్రజలకు అలాగే ఇతర భక్తులకు ఇబ్బంది లేకుండా, మన కుటుంబము వరకే గుట్టుగా వెళ్ళి గుట్టుగా రాలేమా? ఒక గవర్నర్, రాష్ట్రపతి లాగా? అది రాగ ద్వేషము కాదా?

7) రాగ ద్వేషాలు లేని పాలన అంటే ఇదేనా? మనకు పదవి ఉంది, మన బిడ్డకు లేకపోయినా, ఇంకో తల్లి బిడ్డకు పదవి ఇస్తే, ఎంత సంతోషపడుతుంది? లోకన్న పార్టీ వ్యవహారాలు చూసుకుని, కార్యకర్తలతో బంధము పెంచుకుని, ఒక పవన్ లాగా గొప్ప నాయకుడు గా, సొంతముగా ఎదగనీయకుండా ఎందుకు చేస్తున్నారు?

3 వ పవర్ కేంద్రం ఎందుకు తెస్తున్నారు? ద్రుతరాష్ట్ర ప్రేమతో నష్టం మనకు కాదా? మీరు లేకుండా, లోకన్న ఒక నాయకునిగా సొంతముగా గుర్తింపు పొందేది ఎప్పుడు? అది రాగ ద్వేషము కాదా? త్యాగము ఏది, తండ్రి కొడుకులు లో?

మరి రేపు నాగబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇద్దామా? అప్పుడు కూడా అది రాగమే అవుతుంది, కాబట్టి ఇద్దరూ మంత్రులు కానవసరం లేదు, ఇంకో ఇద్దరు తమ బంధువులు ఉండగా.

8) అన్ని దేవాలయాలలో, రాజకీయ వాసన లేని నాయకులు అధికారులు ఉండాలి. సత్వ గుణం ఉండాలి, సజీవ గురువు సేవ ఉండాలి. మంత్రాలు శ్లోకాలు పద్యాలు పలకడం వచ్చి ఉండాలి. తాము దైవ సేవకులు గా ఉండాలి. ఇతర చోట్ల, ఇతర మత గ్రంధాలను పట్టుకుని ఉండకూడదు, 2 నాల్కల ధోరణితో, రజో తమో గుణ దాసులు గా. ప్రజలకు ఇతర భాషా/ మత బాబాయి దేవాలయాలు హిందువులు వా లేక ఇతర మతస్తులవా, పన్నులు కడుతున్నారా, దేవాదాయ శాఖ కిందకు వస్తున్నాయి రానిది, అని వివరముగా చెప్పగలరు, వారికి కనువిప్పు కలుగుతుంది. వేమన, బ్రమ్మం గారు, రాఘవేంద్ర స్వాముల గురించి తెలుగు ప్రజలకు గుర్తు చెప్పగలరు. సత్వ గుణం పెరుగుతుంది.

ఒక అరగంట ధ్యానము చేసి, గుండెల మీద చేయి వేసుకుని, మేము చెప్పిన దానిలో, ఏదైనా తప్పు ఉందేమో, మీ చుట్టూ ఉన్న, సత్వ గుణ సంపన్నులను, సజీవ గురువు సేవ చేసిన వారిని, పదవులు ఉద్యోగాలు ముదుసలి తల్లి తండ్రి సేవ కోసం త్యజించిని వారిని, 10+ ఏళ్ళు పైగా రోజూ నడవలేని తల్లిని 1 మైలు నడిపిన వారిని, 200+ పైగా 108 ప్రదక్షిణాలు చేస్తూ, 20 ఏళ్ళు పైగా శాఖాహారము తింటూ చాపపై నిద్రించే వారిని అడిగి తెలుసుకోగలరు.

తప్పులు ఉంటే మన్నించగలరు. సత్వ గుణముతో ప్రజలకు మంచి పాలన, ఎవరూ వేలెత్తి చూపలేని పాలన ఇద్దాము.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2171 General Articles and views 2,206,454; 104 తత్వాలు (Tatvaalu) and views 244,313
Dt : 14-Jun-2024, Upd Dt : 14-Jun-2024, Category : Politics
Views : 185 ( + More Social Media views ), Id : 2115 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Yellow , brothers , reduce , power , kindness , alms , respect , alliance , values , chandranna , pavananna , modi , tdp , bjp , janasena
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content