మంచి మాటకు విలువ? ఖరీదు ఉందా ఈరోజుల్లో? చదివి మారతున్నారా? చాదస్తం, నీతి నిబద్దత నియమం? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,276; 104 తత్వాలు (Tatvaalu) and views 225,138.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఏవండీ మంచి మాటకు విలువ ఉందా? దానికి ఖరీదు ఉందా ఈరోజుల్లో? మీ మాటలు ఎవరన్నా చదివి మారతున్నారా? మీది చాదస్తం, ఇప్పుడు నీతి నిబద్దత నియమం ఏమిటి అనరా?

జవాబు -

అరిషడ్వర్గాలను జయించడానికి, సాధనకు, సమయము ఎక్కువలేదు. ఏరోజు ఏమి జరుగుతుందో మనకు తెలీదు, మన చుట్టూ ఉన్నవారూ, ఏదో ఒక రోగము బాధతో, అకాల మరణం తో వదలి వెళ్ళిపోతున్నారు. కరోనా పరంపర, ఇతర విపత్తుల లెక్క ఎటూ ఉంది.

ప్రతీ దానికి టెన్షన్ విపరీతమైన్ ఆలోచన, ఏ స్థాయి వ్యక్తి అయినా. కనీసం 30 వ ఏడు నుంచి, మనసు సాధన మొదలు పెట్టాలి. ఆ తర్వాత, ఏ రోజూ మనది కాదు.

తమకు బాధ కలగనంత వరకూ, ఇతరులది చాదస్తం అంటారు, నీతి నియమం ఎందుకు అంటారు. తమకు నెప్పి కలిగినప్పుడు మాత్రం, లోకం లో నీతి లేదు అంటారు. అదే 2 నాల్కల ధోరణి, పతనం కూడా వారికే.

ఒకరు చదివారా మారారా అన్నది, మనకు వద్దు. 8 ఏళ్ళు గా మనము మారలేదు అని, గురువులకు మన పురోగతి చెపుతున్నాము, కొత్త సాధనలు అడుగుతున్నాము అనుకుందాము, దేవుని ఆజ్ఞ ఉన్నంత వరకు.

క్రుష్ణుడు మరియు విదురుడు, ఎంత చెప్పినా, కౌరవులు వినలేదు. వాళ్ళు కూడా చెప్పడం మానలేదు చివరి దాకా.

మంచి మాటకు విలువ ఎప్పుడూ ఉంది, 4 యుగాల లలో. మంచి మాటకు విలువ ఎంత అంటే, మన జీవితమంత, ఇంకొందరికి లక్షలు లేదా కోట్ల రూపాయల ఖర్చు అంత.

కాకపోతే, మోహము ముసుగు తీసి బయటకు వచ్చి, మంచిని అర్ధము చేసుకునే, ఆచరించే శక్తి సంస్కారం పెంపకం జ్ఞానం నిబద్దత, మనకు ఉందా అని, అనండి, అడగండి, అనుకోండి?

అది ఒప్పుకుంటామా? అది మనకు చేతకాదు, అంత ఓపిక సహనం మనకు లేవు. కరెక్టేనా.

అందుకే లాయర్లు, కోర్టులు, ఆసుపత్రులు, రోగాలు, అకాల మరణాలు, ఖర్చులు కన్నీళ్ళు తగువులు బాధలకు కూడా, అంతులేకుండా పోయింది.

కరోనా అజాగ్రత్తలు, ఇష్టం వచ్చిన విధము గా తీసుకున్న మందులు, తర్వాత కాలం లో ప్రభావం చూపుతున్నాయి. అయినా మన బద్దకము ను వీడము.

తెలుగు రాయడం రాకపోతే నష్టం ఏమిటి అంటాము, చూడటానికి చిన్న విషయం, ఆ ప్రశ్నే మన కుటుంబములోని సోమరితనాన్ని, విశ్వసనీయతను, బంధాల విలువను అందరికీ తెలుపుతుంది, క్రుతఘ్నుడు గా, మాత ని మాత్రు భాషను మాత్రుదేశాన్ని గౌరవించరు అని. అంటే, భాగస్వామి, పిల్లలను అంతే కపట ప్రేమతో చూస్తారు, అంతేనా? ఇక బయట వారిని, లెక్కే చేయరు.

దేవుడు కూడా మౌనముగా చూస్తూ, నేను ఇచ్చిన బుద్దిని దాచి, మిగతా అంతా అనవసరము గా వాడి, వ్యామోహం బ్రమలలో, మీకు మీరే నాశనం అయితే, నేనెందుకు రావడం అని, కేవలము, దూరంగా ఉండి మేలుకొలిపే వారినే పంపుతున్నారు, వాట్సాప్ ద్వారా, వారికి ప్రమాదం లేకుండా.

చెప్పడం గుర్తు చేయడం వరకే మన బాధ్యత, దగ్గర ఉండి చేపించడం, వారిని శిక్షించడం మన పని కాదు.

మొహములో ఉన్న ఇతరుల మెప్పు, మనకు అవసరం లేదు, కానీ దేవుని మెప్పు కావాలి, అలాగే మీ క్షేమం మాత్రమే మాకు కావాలి, ఎందుకంటే మీరూ మా లాగనే భగవంతుని సంతానము అని గట్టిగా నమ్ముతున్నాము.

మందలో నుంచి తప్పిన గొర్రెను దూడను, మనము వెనక్కి తెచ్చే ప్రయత్నం చెయ్యాలి, అహంకారముతో కుమ్మడానికి సిద్దము అయితే, ఇక గమ్ము గా వదిలేసి ఉండాలి.

నిప్పుకు పులికి పాముకు దూరంగా ఉండాలి కదా. ఇంకొంతమంది, వారే పారిపోతారు, మన మేలు కొలుపు మాటలు భరించలేక, ఫోన్లు ఆపుకుని, తర్వాత ఫలితాలు కోసం.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,276; 104 తత్వాలు (Tatvaalu) and views 225,138
Dt : 21-Feb-2022, Upd Dt : 21-Feb-2022, Category : General
Views : 561 ( + More Social Media views ), Id : 1308 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : worth , good , word , expensive , read , change , rule , moral , commitment
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content