భగవంతుని తో లేదా గురువు తో, మనస్ఫూర్తిగా మమేకం అవడమే పూజ, ధ్యానం, తపస్సు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,587; 104 తత్వాలు (Tatvaalu) and views 225,158.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

గురువారం సాయంత్రం అమ్మ తో కూడి, ఎలుగెత్తి బాబాకు సాయంత్ర మరియు రాత్రి పూట పవళింపు సేవ చేసే భాగ్యం కల్పించారు.

మరాఠా హారతులు అందరూ పారవశ్యం తో పాడారు, చాలా మంది వచ్చారు, ఎక్కువ గొంతు లు పలికాయి.

ఏరా తెలుగు తండ్రి తర్వాత నే, మరాఠా బాబాయి అంటావు, ఇప్పుడు నా దగ్గర కే రప్పించుకొని, ఎదురు గా పెట్టుకున్నా గా, 2 హారతులు పాడిస్తున్న మరి, కన్నతల్లి తో కలపి.

తెలుగు గురువు లు కు ముందు గౌరవం అంటూ కూడా, ధర్మం గా నిలబడి, హింది హారతులకు బదులు మరాఠా హారతులు పలికించావు ఈ వారం నుంచి, అందుకే నువ్వు అంటే నాకిష్టం, నిన్ను వదలా, నువ్వు ఏమన్నా కూడా, అన్నట్లు సూటిగా మన కళ్ళ లోకి బాబా చిద్విలాసం.

మనసులో మన జవాబు, నిజం తండ్రి, అమ్మ ఎదురుగా 20 ఏళ్ల లో ఇదొక కొత్త అనుభూతి.

తండ్రి లాంటి తెలుగు గురువు లు, బ్రహ్మం రాఘవేంద్ర వేమన లను పొగిడితే లేదా గొప్ప అంటే లేదా వారి మాటలను ఆచరిస్తే, బాబాయి కి లేదా బాబా కు కోపం వస్తుందా తండ్రి, అని మనం, శిరస్సు వంచి నమస్సుమాంజలి.

శిలను ప్రతిమ చేసి చీకటి లో పెట్టి, మొక్క వలదు కనుడు మూర్ఖలారా, ఉల్లమందు బ్రహ్మ ముండుట తెలియుడీ - అన్న వేమన తేట తెలుగు ఆధ్యాత్మిక త ను

అలాగే మాయదారి మరలా బండి రా , ఈ మాయ దేహం ఆరు చక్రము లు, అమరి యున్నది రా. ఊపిరి పేరే హంస రా, ఉఛ్వాస నిశ్వాసాల కొలతరా - అన్న బ్రహ్మంగారి వేదాంతం భగవద్గీత సారాంశం ను కాదనగలమా తండ్రి,

అలాగే నిరాకారుడు నిరంజనుడు అయి, బ్రహ్మాండం అంతా వ్యాపించిన, నారాయణ మాయను ఆదిశక్తి ప్రాబల్యం ను కాదనగలమా. ఏ రూపం అయితే ఏమి తండ్రి అంటే తలవంచి.

ఇదుగో రా, ఇలాంటి మాటలతోనే, మమ్మల్ని అలాగే అందరూ గురువు లను, మీలాంటి వారు కట్టేస్తున్నారు రా.

కన్న తల్లి మరియు తండ్రే ముందు, ఆ తర్వాత నే బాబాయి పిన్ని లే, నీ మాటే కానీ అన్నట్లు గా, బాబా ముసిముసి నవ్వులు. ఏకో నారాయణః, సర్వం బ్రహ్మ మయం.

హారతులు లేదా శ్లోకాలు అర్థం అయినా కాకపోయినా, భగవంతుని తో లేదా గురువు తో, మనస్ఫూర్తిగా మమేకం అవడమే పూజ, ధ్యానం, తపస్సు.

దానికి ఖర్చు, నైవేద్యం, ప్రయాణం అవసరం లేదు సుమా. మన ఇంట్లో అయినా, భగవంతుడు మనతో నే ఉంటాడు, పలుకుతాడు. అరిషడ్ వర్గాలు ను జయించి, సమతాస్ధితి లో ఉండగలిగితే చూడగలిగితే, ప్రతిరోజూ ప్రతిక్షణం, నారాయణుడు మన వెంటే ఉంటాడు సుమా.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,587; 104 తత్వాలు (Tatvaalu) and views 225,158
Dt : 29-Jul-2021, Upd Dt : 29-Jul-2021, Category : General
Views : 765 ( + More Social Media views ), Id : 1232 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : worship , meditation , tapas , lord , guru , baba , brahmam , raghavendra , vemana , narayana
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content