లోకం తీరు - ఎన్నో ఆసక్తి కరమైన విషయాలు 1000 కి పైగా కధనాలు, అందరికి వందనాలు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2183 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2218 General Articles and views 2,490,446; 104 తత్వాలు (Tatvaalu) and views 267,105.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

లోకం తీరు, వార్తలు, సలహాలు, జవాబులు, వెటకారాలు, సున్నిత విమర్శలు, అలవాట్లు, సాంప్రదాయాలు, భక్తి, దైవం, పురాణం, తత్వాలు, కష్ట సుఖాలు, పెద్దల తల్లి దండ్రుల సేవ, రాజకీయాలు, ఆరోగ్యం, విదేశీ కధలు, పార్టీలు నాయకులు అధికారులకు విన్నపాలు బాగోగులు మార్పులు, . . . ఎన్నో ఆసక్తి కరమైన విషయాలు, 1000 కి పైగా కధనాలు ఇప్పటివరకు అయ్యాయి.

అంటే 1000 పేజీల పుస్తకం రాసినట్టు, కొన్ని, 2 లేదా 3 పేజీలు పొడవు కూడా ఉంటాయి కదా. రూపాయి లాభాపేక్ష లేకుండా రాసి, దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని 10 మందికి పంచడమే. రాసేది రాపించేది ఆయనే (దేవుడు), మీ పొగడ్తలు తిట్లు ఆయనకే. మంచి రాయడం చెప్పడం పంపడం వరకే మన విధి, పాటిస్తున్నారా ఆచరిస్తున్నారా లేదా అన్నది నా పని కాదు, ఎందుకంటే ఆ ఫలితాలు పొందేది మీరే కాబట్టి, ఆ జాగ్రత్తలు మీవే.

దీనికి విసుక్కోకుండా, ప్రోత్సాహం చేసిన స్నేహితులు, బంధువులు అందరికి వందనాలు క్రుతజ్ఞతలు ధన్యవాదాములు.

ఇక్కడ ముఖ్యముగా పొగడాల్సింది అభినందించాల్సింది, ఆంధ్రా అన్ని పార్టీల పెద్దలను, నాయకులను, అధికారులను కూడా, చిన్న ఆన్లైన్ పత్రికా లేదా చిన్న వారా అని చూడకుండా, మనకు పార్టీ పరముగా అలాగే వ్యక్తిగతము గా, మంచి సూచనలా కాదా, అన్నది మాత్రమే చూసే, మహాను భావులు గొప్ప వ్యక్తులు ఉంటారు ఉన్నారు.

పండగలకు శుభాకాంక్షలు చెప్పిన, పెద్దలు నాయకులు అధికారులు ఉన్నారు, తమ స్థాయి హోదా గొప్పలు పట్టించుకోకుండా, ఆభిజాత్యము అహంకారము లేకుండా. అయితే, వారి గోప్యతను కాపాడుతూ, మనము ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టలేదు. మనకు ఫలానా కావాలని అడగలేదు. ఊరి కోసము, జిల్లా కోసం, రాష్ట్రం కోసం, అందరికోసం అడగడం తప్పు లేదు.

అన్ని పార్టీ ల అభివ్రుద్ది కోసం, కొన్ని గౌరవ విమర్శలు చేసినా కూడా, నేరు గా వారికి పంపినా కూడా, 2 సంవత్సరాలు గా, ఏ పార్టీ నాయకత్వం లేదా ఎమ్మెల్యే ఎంపీ మంత్రి నుంచి లేదా అధికారి నుంచి కూడా, బెదిరింపులు విమర్శలు రాలేదు. కొన్ని చదివి ఉండవచ్చు, చదవక పోయి కూడా ఉండవచ్చు.

తల్లి తండ్రి అందరు పిల్లలు బాగుండాలని కోరుతారు, మనము అంతే, అన్ని పార్టీలు మనవే, అన్ని బాగుండాలి, అందరు నాయకులు బాగుండాలి. రేపు ఎవరు ఏ పార్టీలో ఉంటారో కూడా, వారికే తెలీదు కదా.

మన రాతలకు, అలిగి విసుక్కుని, దూరముగా వెళ్ళిన నాయకులు, అధికారులు కూడా ఉన్నారు. మంచి తో పాటే చెడూ ఉంటుంది కదా. అది వారి వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. ఇక ఆ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో, ఊహించుకోండి.

అమర్యాదగా మనము రాస్తే, చెపితే, తొలగిస్తాము లేదా మర్యాద పదాలుగా మారుస్తాము, వారి కోరిక సబబుగా ఉంటే. మన ఉద్దేశ్యం వారిని అవమానించడము కాదు, మంచి వారి గా మార్చి, మంచి పనులు చేయించడం మాత్రమే.

పొలీసు శాఖ అధికారులకు కూడా విన్నపాలు పంపాము. మీరు రిక్వెస్ట్ కాటగిరీలో అవి చూడవచ్చు.

జగనన్న చంద్రన్న వీరన్న పవనన్న మోదీ, చిన్న పత్రికలను చిన్న విలేఖరులను, గౌరవిస్తారు ఆశీర్వదిస్తారు అనడానికి, ఇదే ఉదాహరణ. నాయకులు అంతా చల్ల గా ఉండాలి, వారికి మనము మంచి సూచనలు చెయ్యాలి.

మొదటి నుంచి మనది ఒకటే మాట, ఏ ప్రభుత్వములో అయినా, నాయకులది ఎప్పుడూ తప్పు కాదు, వారిని ఎన్నుకున్న తెలివితక్కువ ప్రజలదే తప్పు, అంటే మనదే తప్పు నాతో కలిపి. ఎందుకంటే ప్రజాస్వామ్యము లో, మనము ఓటు వేస్తేనే వారు గెలిచింది.

మనము మంచి నాయకులను ఎన్నుకుంటాము కదా, మనకు మంచి లక్షణాలు ఉంటే. మనము వర్గాలకు ధనానికి అవసరానికి లొంగి పోయే, దొంగలము అయినప్పుడు, మన నాయకులు మన ఆలోచనలను మాత్రమే పాటిస్తారు కదా?

ఎందరో మహానుభావులు, అందరికీ శిరస్సు వంచి, వందనాలు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2218 General Articles and views 2,490,446; 104 తత్వాలు (Tatvaalu) and views 267,105
Dt : 04-Mar-2021, Upd Dt : 04-Mar-2021, Category : General
Views : 1004 ( + More Social Media views ), Id : 1004 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : world style , lokam tiru , interesting things , 1000 articles , thanks to all
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content