Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.
Who are the great and noble ones? God or human? Spacious houses for the trustees, and tiny rooms for God family? ఎవరు ఉన్నతులు, గొప్పవారు చెప్పండి? దేవుడా, జీవుడా? ధర్మకర్తల కు విశాలమైన ఇళ్ళు, దేవతల కుటుంబానికి బుల్లి బుల్లి టిక్కీలు?
*గురువు గారు, మీరు ఎప్పుడైనా మీ ఊరి గుడికి వెళ్ళినప్పుడు, 4/ 6/ 8/ 10/ 12 మంది దేవతల విగ్రహాల ను అంటే ప్రాణప్రతిష్ట చేసిన దేవతలను, దేవత కుటుంబానికి ఒక గది తలుపులతో, విశాలం గా ఏసీలతో పాలరాతితో ధర్మ కర్తల ఇంటి కంటే గొప్పగా లేకుండా, అమర్యాదగా ఒకే హాలు లో పెట్టి లేదా బంధించి లేదా అవమానిస్తూ, తమ బంధువులు ఉద్యోగులు పని వారు కన్నా హీనంగా చూస్తూ, వ్యాపారం చేస్తున్న, రాజకీయ వ్యాపార ధర్మకర్తలు ను, తాము మాత్రం ఎకరాల సౌకర్యాల ఏసీ గదుల పేద్ద పేద్ద ఇంట్లో అంటే రాజ మహాల్ లో, 1-4 గురు పని వారితో, కేవలం 4 గురు సొంత జీవులతో ఉంటే చూసారా? ఎవరు అధికం చెప్పండి? దేవుడా, జీవుడా?*
దేవాలయములో ఉన్నది కేవలం రాయి, దానికన్నా మేమే గొప్ప అని నిరూపించింది ఎవరు? అది రాయి కాదు పరమాత్మ అని ధర్మకర్తలు అనుకుంటే, దైవానికి జనానికి వారధులు ఆ గుడి పూజారులు కూడా భావిస్తే, నీతి నిజాయితీ సంస్కారం ధైర్యం బాధ్యత దైవం పై ప్రేమ తో ఆ పెద్దలకు గుర్తు చేస్తే, జ్ఞానబోధ కలిగిస్తే, ఆయన తన అతి పెద్ద విస్తీర్ణ సౌకర్యాల సుందర మహాల్ ను గుడి గా మార్చి, చెంపలు వేసుకుని, పరమాత్మ సేవకుడిని అని తనను తాను తెలుసుకుని, తాను ఆ నేటి గుడి హాల్ లో ఉండడా?
పూజారులు ఉద్యోగముగా మొక్కుతున్నది ముక్తినిచ్చే దేవుడికా, జీతమిచ్చే భుక్తినిచ్చే ధర్మకర్త జీవుడికా? జనం గౌరవిస్తున్నది మొక్కుతున్నది ఎవరికి? పలుకుబడి గల ధర్మకర్త కా, నిలువ తలుపులున్న గది కూడా లేని దేవుడికా? ఎవరంటే భయం గౌరవం వీరికి?
ఇక్కడ నివాసానికి గదులు లేవు, చోటు లేదు. మీరు సంసారం తో కలసి ఉంటాము అంటే, పూజారి ఉద్యోగం తీసేస్తాము అనే ధర్మకర్తలు ఉన్నారు అని మీకు తెలుసా? పెళ్ళి చేసుకుని, సంసారం చేయలేని బతుకులు ఉన్నాయి అని తెలుసా? దానికి భయపడి, ఒంటరిగా ఉంటూ పూజలు చేస్తున్న పూజారులు లేదా మామూలు ఇతర ఉద్యోగులు సాఫ్ట్వేర్ తో కలిపి ఉన్నారు అని తెలుసా?
కనీసం గుడి తరపున, ప్రసాదం వండి పెట్టలేని పరిస్తితులు ఉన్నాయి. భక్తులు తెచ్చిన ప్రసాదాన్నే పంచి, మమ అనిపిస్తున్నారు. భక్తులు ధనం విడిగా బంతి భోజనానికి విరాళం ఇస్తేనే, పదిమందికి భోజనశాల భోజనం. లేదంటే రాబడి లేదు, గుడి తరపున ప్రసాదం లేదు అని కూడా నేరుగా చెపుతున్నారు. అప్పుడు ఎందుకు ఇన్ని గుడుల నిర్వహణ సొంత ధనం తో చేయలేనప్పుడు, దైవ కార్యం మీద ప్రేమ లేనప్పుడు? కేవలం వ్యాపారానికి అవసరానికి అవకాశానికా?
ఇక జనం సంగతి చెప్పక్కరలేదు, వారం నుంచి తిండి లేనివారిగా, లైన్ కు అడ్డం పడి అయినా, తాను తిన్నంత తిని, ఇంటి దగ్గర వారికి లేదా సాయంత్రం కు కూడా బాక్స్ లు కట్టుకుని వెళుతున్నారు, గుడికి ఉత్తి చేతులతో ఊపుకుంటూ వస్తూ. కాబట్టి వ్రుత్తి వేరు, గుణం వేరు.
ఒకవేళ ఉత్తమ సంస్కార పుజారి ధర్మకర్తను ప్రశ్నిస్తే అడిగితే, తన ఉద్యోగం ఉంటుందా, విదేశాలలో అయితే వీసా ఉంటుందా? మరి ఇప్పుడు మేము వ్యాపారానికి ఉద్యోగానికి, వాడుకున్న అది రాయి మాత్రమే, అని నిరూపించింది ధర్మకర్తలు, పూజారులు, వారికి విరాళాలు ఇచ్చి ప్రోత్సాహం చేసే నిజభక్తులు కాదా?
అందుకే మేము ఎప్పుడూ, వారి విషయాలలో వేలు పెట్టము. కడుపు చించుకుంటే, కాళ్ళ మీద పడుతుంది. మనం దండం పెట్టుకుని, స్వామీ ఏమిటి మీకీ బాధ అని, మేము మిమ్మల్ని కాపాడాలో లేదా మీరు మమ్మల్ని కాపాడాలో తెలియడం లేదు, దిగులు పడవద్దు అని, ధైర్యం చెప్పివస్తున్నాము.
ఇదేనా వారు చదువుకున్న వేదాలు, ఉపనిషత్తులు, వేదాంతం, మాత్రుదేవోభవ, ఆచార్యదేవోభవ, సాంప్రదాయం? పండితులను గౌరవించడం ఇదేనా? శంకరులు, రామానుజులు చెప్పింది ఆచరించింది ఇదేనా?
పిల్లలకు బడిలో చదువు నేర్పితే, గుడి లో పెద్దలకు సంస్కారం భక్తి విలువలు నేర్పాలి? కనీసం నిండు బట్టలతో, సాంప్రదాయ దుస్తులతో, నుదుట కుంకుమతో, జుట్టు ముడివేసి రమ్మని చెప్పే అలాగే వచ్చే ధైర్యం ఎవరికైనా ఉందా?
అందుకు కదా భగవద్గీత చెప్పింది, గుణం అంటే సత్వ రజో తమో గుణ కర్మలు బట్టి, బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు శూద్రుడు అని పనిని బట్టి వర్గీకరణ చెప్పింది. ఆ విలువలు వారు విడిచేసారు, పెత్తనం చూపారు.
మరి అవి అన్ని, అంటే 4 వర్గాలను వదలి, అవి తప్పు అని చెప్పి, మనము 400 కులాలు రిజర్వేషన్లు పెట్టుకుని, వర్గాలు గా విడిపోయి, విలువలతో పతనం అయ్యి, మనం సాధించిన ఆధ్యాత్మిక ప్రగతి ఇదా? రాయితో, నమ్మకంతో, అమాయకత్వంతో, అవసర అవకాశంతో, మానసిక బలహీనతతో వ్యాపారమా?
స్మార్ట్ ఫోన్ వచ్చాక కూడా, జనం లో చైతన్యం లేదు, తమను తాము తెలుసుకోరు. నక్క పులి పాము గుణాల్తో, వారికే ఓటు వేస్తు, వీరి కుటుంబాలకే చిచ్చు పెట్టుకుంటున్నారు. ఇవి భరించలేక, ఇంకొంతమంది బలహీనులు ఉన్న ఇంటిని చక్కబెట్టుకోలేక, మతాలు మారి, దశమ భాగాలకు మరియు లవ్ జిహాద్లకు బలి అవుతున్నారు.
4 వర్గాలు తప్పు అని అంటున్న మూర్కులు, ఎందుకంటే వారికి గుణకర్మల విలువ తెలీదు, మరి 400 కులాలు మాత్రం ఒప్పు ఎలా అంటున్నారు? గుణం వదలి, రిజర్వేషన్ అని వారిని తక్కువ చేసి ఎందుకు ముద్ర వేస్తున్నారు? వ్యవస్తను ఎందుకు బ్రష్టుపట్టించారు?
డబ్బుకు లోకం దాసోహం లో ఎవరు పాత్ర కాదు? రాయి, ధర్మకర్త, పూజారి, నిజ భక్తులు అందరూ నటనాసార్వభౌములు కదా? వీరికి ప్రత్యేన ఆనంది అవార్డ్ లు ఇవ్వద్దా ప్రతి ఏడాది, ఉత్తమ అజ్ఞాని తనను తాను తెలుసుకోలేని వ్యక్తి అని?
వ్యాపారం అంటే నేరుగా ఒక్క గుడితోనే కాదు, గుడిని అడ్డం పెట్టుకుని, పిచ్చి భక్తుల నమ్మకాన్ని అడ్డుపెట్టుకుని, అధికారులతో నాయకులతో వ్యాపారులతో ప్రజలతో తమ వ్యాపారాలు ఆస్తులు పాపాలు పతనాలు 100 రెట్లు వ్రుద్ది చేసుకుంటున్నారు. ఇది కేవలం రాయి అనుకోబట్టేకదా? లేకపోతే, పరమాత్మ అనుకుంటే, అధర్మం గా ఇంత తక్కువ కాలం లో ఇంత అభివ్రుద్ది చెందుతారా?
దేవుడు కూడా, వారికి అవకాశం ఇస్తున్నారు. ఎందుకంటే మొదటి అంతస్తునుంచి పడితే, రజో తమో గుణాలకు, కేవలం దెబ్బలు మాత్రమే తగులుతాయి. ఈ ప్రాపంచిక వ్యామోహ దాసులను, అదే 40 వ అంతస్తుకు ఎక్కిస్తే, వారే సొంత వారితో చుట్టూ ఉన్నవారితో, కక్కుర్తిపోటు వెన్నుపోటు గుండెపోటు రోగపోటు తో పోతారు. వారిలో వారే పతనం అవుతారు, బల ధన మదముతో అని, వారి ఫలితాలను వారి చేతిలోనే పెట్టారు.
అది మనం అడిగితే, ధర్మకర్తలను అవమానించినట్లా? లేదా దేవుని అవమానించినట్లా? భక్తుని అవమానించినట్లా? జీవుని బాధ్యతలు గుర్తు చేసినట్లా? అది మానసిక బలహీనత కాదా? ప్రాపంచిక బ్రమల వ్యామోహం కాదా? అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం కాదా? ఇదేనా భగవద్గీత చెప్పింది, ఇదేనా ఆ పుస్తకం చదివి, గౌరవిస్తూ, ఆచరించడం, పిల్లలకు నేర్పడం అంటే?
మా ఊళ్ళో సినిమా హాలు వ్యాపారి, జనం రావడం లేదని, పిచ్చి అభిమానల తలనొప్పి భరించలేక, ఆ బోర్డ్ ను అలాగే ఆ సెటప్ ను తొలగించి, కళ్యాణ మందిరం గా మార్చుకుని, తన వ్యాపారం కొనసాగిస్తున్నారు. అంటే ఆయన, సినిమాను, హీరో హీరోయిన్లను అభిమానులను అవమానించినట్లా? అతను వ్యాపారి, కాబట్టి నీతి నియమం తో పని లేదు. తన అవసరం అవకాశం అంతే.
ఉత్తరప్రదేశ్ లో ఆల్రెడీ చాలా మందికి జ్ఞానోదయం అయ్యి, బాబాయి విగ్రహాన్ని తొలగించి, దత్తాత్రేయ లేదా ఇతర హైందవ గురువుల విగ్రహాలు పెట్టుకున్నారు. అది వారి ఇష్టం. మనము చెప్పినా వినరు కదా. అందుకే, మన చుట్టు తప్పు జరుగుతుంటే, మొదట్లోనే ఖండించాలి. మొక్కై వంగనిదే మానై వంగదు కదా?
మరి మనం ఏమి చెస్తున్నాము, కోట్లు ఇచ్చిన ముదుసలి పెద్దలను ఒంటరిగా అనాధలుగా ఆశ్రమంలో నిర్దయగా క్రుతజ్ఞత విశ్వసనీయత లేకుండా వదిలితే, ఆ పిల్లలను ఇది తప్పు అని ప్రశ్నించకుండా, ఆ ఆశ్రమం కు మీ వ్యాపార సేవ కొనసాగించి, ఇంకా ఎక్కువ ముదుసలి తల్లి దండ్రుల కొంపలు కూల్చమని కోట్లు ఇస్తున్నాము.
మా పిల్లలు/ భాగస్వామి తాగి తిని తిరిగితే మీరు చెప్పవద్దు అడగవద్దు, అలాగే మీ గురించి మేము చెప్పము, అని పతన సర్కిల్ లో బురద బతుకు బతుకుతున్నాము. పుండు ఒక చోట, మందు ఇంకో చోట, ఫలితం శూన్యం, వారికి వీరికి పాపం అధిక ఫలం, పాత్రత చూడనందుకు.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2304 General Articles and views 3,679,763; 104 తత్వాలు (Tatvaalu) and views 414,278
Dt : 15-Jul-2025, Upd Dt : 15-Jul-2025, Category : General
Views : 2624
( + More Social Media views ), Id : 2267
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
great ,
noble ,
God ,
human ,
priest ,
pujari ,
houses ,
trustees ,
tiny ,
rooms ,
God family
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments