APLatestNews.com top Banner

Social Media links
ఎమ్మెల్యే నెలకు 4 రోజులు వస్తే తప్పు ఏమిటి? టీడీపీ పెళ్లి, వైసీపీ కాపురం కరక్టే నా? ఎవరిది నీతి? - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

భర్త చాతకాని వాడైనా, ఇంటి పట్టు న ఎదురు గా, కనపడుతుంటే ఉంటే చాలు అనుకుంటుంది సంసార పక్ష భార్య. మన ఇంటి ఆడపిల్ల అయినా, అంతే ఆలోచన చేస్తాం. మరి నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా అంతే కదా, నెగ్గిన అస్సెంబ్లీ స్థానములో దగ్గరగా ఉండాలి, ఆ మాట అడగడము వెనక ఇంకా పరమార్ధము ఉంది.

ఉదాహరణకు రామయ్య ఆఫీసు కు రోజూ పోడు, లేటుగా వెళతాడు, వాళ్ళ అబ్బాయి కి అక్కడే ఉద్యోగం కావాలి, అనుకుందాం. ఇంక అతని పై అధికారులు ను గట్టిగా, మన ఆఫీసు లో అన్యాయం జరుగుతుంది, నీతి లేదు, ఈ సదుపాయాలు కలుగజేయండి అని నిలదీయగలడా?

అడిగితే వాళ్ళ మేనేజర్ ఏమంటారు, ముందు నువ్వు ఆఫీసు కి రోజూ రా, కరెక్టు టైంకి రా, లేదంటే తీసేస్తాం అంటారు. నీ కొడుకు కు ఉద్యోగం ఇవ్వము అంటారు. నువ్వు నీతిగా ఉండి, మా నీతి గురించి మాట్లాడు అంటారు, అంతే నా? అంటే, ఏవిషయమైనా గట్టిగా అడిగే నైతికత కోల్పోతారు.

అదేవిధంగా ఊరికి రావాల్సిన ఫిషింగ్ హార్బర్, చేనేత పార్కు ఇవ్వమని, ఎందుకు లేటవుతుంది, అని గట్టిగా నిలదీయగలరా? ఇతర అభివృద్ధి కార్యక్రమాలు అడగగలరా? అడిగితే మంత్రి గారు ఏమంటారు, ముందు ఊళ్ళో జనం తో ఉండు. నీ కొడుకు కి పదవి రాదు, పుత్రుడు కి ప్రభుత్వ లేదా స్ధానిక విషయాలలో జోక్యం వద్దు అని చెప్పు. మాజీ ఎమ్మెల్యే ను ప్రోత్సాహం చేస్తాము అంటారు. ఇంక కుక్కిన పేను తో సమానము గదా.

ఇంక ఆ గెలిచిన ఎమ్మెల్యే తో, ఊరికి ఊరి జనాలకు ఉపయోగం ఉంటుందా? తన కుటుంబ మరియు వర్గ స్వార్థం తప్ప, ప్రజా సంక్షేమం ఉంటుందా? కాబట్టి ఊళ్ళో ఉండరు, అన్నది చిన్న మాట, సాత్వికంగా అడగడం. కానీ దాని వెనక ఇంత పెద్ద కధ ఉంటుంది. ఒక మెతుకు చాలు కదా, ఉడికిందా అన్నం అనడానికి.

ఇక నీతి విషయం కు వద్దాం. నాయకులు తప్పు తో పోలిస్తే, ప్రజల తప్పు ఇంకా ఎక్కువ శాతము. నాయకులు వచ్చే ది ప్రజల నుంచే, ప్రజల ఆలోచన నుంచే, ఆకాశము నుంచి ఊడిపడరు.

ఒక ఊరితో పెళ్లి, ఇంకో ఊరితో కాపురం లాగనే, ఈ పార్టీ తో గెలిచి ఆ పార్టీ తో తిరగడం కూడా, నీతిలేని ఊసరవెల్లి పనే. అందులో కోవర్ట్ అనేది మరీ ఘోరము.

అందుకే జగన్ గారు చెప్పారు, రాజీనామా చేసి, మా పార్టీలో కి రావాలని. ఆయన చెప్పకపోయినా, ఎలాంటి వాడికి టిక్కెట్ ఇస్తున్నాం అని చంద్రన్న కు, అనుభవం లేదా? అది ఇంకో తప్పు. కావాలని పంపితే? చంద్రన్న ను మోసం చేయడం లేదా ప్రజలను వంచించడం, ఇంకో తప్పు.

రాజీనామా లేకుండా, మంత్రి గారు, తమతో రమ్మనడం, ఇంకో తప్పు. ఇన్ని విధాలుగా మనసు మారే వ్యక్తి, ప్రజలకు అండగా ఉంటారా, తన కుటుంబ మరియు వర్గ స్వార్థం తప్ప?

ఎన్నికల కు ముందు మారడం లేదా రాజీనామా చేసి మారడం, కనీసం తప్పు లో కొంచెం ఒప్పు, ఈరోజుల్లో కనీస మంచి. గెలిచినాక మారడం, పార్టీ కి, ప్రజలకు, తనకు, నమ్మక ద్రోహం.

ఇంత చేసినా నాయకులు ది తప్పు కాదు అంటాను. ఎందుకంటే, ప్రజలు కూడా అలాగే ఉన్నారు. యధా ప్రజా, తథా రాజా. పావు శాతం ప్రజలు, అసలు ఓటు వేయరు. వీరికి ప్రభుత్వ పధకాలను ఇవ్వకూడదంటారు చాలామంది, అంటే రేషన్, కన్సెషన్, ఫించన్ లు.

మిగతా వారు తమ వర్గ, కుల, మత, అవసర సమీకరణాలు చూసి, ఓటేస్తారు. ఇంకొంతమంది ధనం, మందు, బిర్యానీ కే లాంటి చిన్న వాటికే లొంగుతారు, కూతురు లాంటి ఓటు అమ్ముకుంటారు.

ఒక మంచి మనిషి ఎన్నికల లో నిలబడితే, డిపాజిట్ కూడా రాకుండా ఓడిస్తాం, మనకు నీతి ఉందా? ఎందుకంటే అతని మీద, కేసులు లేవు, బాంక్ అప్పులు లేవు, దొంగ వ్యాపారాలు లేవు. ముందు మన ఆలోచన మారాలి. బాధ్యత గా మంచి వారికి ఓటేయాలి.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 797 General Articles, 46 Tatvaalu
Dt : 29-Jul-2020, Upd Dt : 29-Jul-2020, Category : Politics
Views : 126 ( + More Social Media views ), Id : 620 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : chirala , mla , karanam , guest visit , 4 days , pelli , tdp , kapuram , ycp , morality
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content