Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. కుందేరు ఆక్రమణలు పై దృష్టి సారిస్తాం అన్న, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం గారు.
చెన్నై నుంచి చీరాల వచ్చిన డైయింగ్ యూనిట్ల వ్యర్ధాలతో, ప్రాంత తాగునీరు కలుషితం.
కుందేరు ఆధునికీకరణ కు, సిఎం ప్రత్యేక నిధులు.
కొత్త పేట అపార్టమెంట్ ల నుంచి, అలాగే ఇతర దోవల నుంచి, మురుగు కుందేరు లో కి పంపుతున్నారు.
దోమలు వాసన పెరిగి, వ్యాధులు కు మూలం అవుతుంది, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
కొత్త పేట మరియు కాలేజీ రోడ్డు దగ్గర, డీఎస్పీ కార్యాలయం రోడ్డు లో, చీరాల లో ఉన్న, అన్ని అక్రమ కట్టడాలు ను షాపులను కూడా, తొలగించి ప్రజలకు ఇబ్బందులు, మహిళలు నడిచేటప్పుడు అనవసర తలనొప్పులు, తొలగిస్తారని తగ్గిస్తారని, ప్రజలు ఎదురు చూస్తున్నారు.
దీనిపై ఎమ్మెల్యే కరణం గారు, మునిసిపల్ కమీషనర్, ఎంపీడీవో, పంచాయతీ సెక్రటరీ, ఎమ్మార్వో గార్లు మరియు ఇతర సంబంధిత అధికారులు, తగిన చర్యలు తీసుకుని ప్రజలకు ఆరోగ్యం ను కలిగించి, ప్రయాణం లో మరియు జనుల నడకలో, ఆక్రమణలు వలన కలుగుతున్న ఇబ్బందులు తొలగిస్తారని, ప్రజలు కోరుతున్నారు.
కుందేరు మరియు ఇతర ప్రాంత దురాక్రమణ లు గురించి, వాటిని బాగు చేయడం గురించి, ఎమ్మెల్యే బలరాం గారు మొదలు పెడితే, స్ధానికంగా పట్టు సాధించేందుకు బాగా ఉపయోగపడుతుంది.
ఎందుకంటే ప్రజలకు మహిళల కు అది ఉపయోగం. కుందేరు బాగు ఎవరూ ఇంతవరకు సరిగ్గ చూడలేదు. కనీసం ఇప్పుడు అయినా శుభ్రం చేయించి, ఆ చుట్టుపక్కల జనాలకు ఆరోగ్యం రక్షణ ఇవ్వవచ్చు. దుర్గంధం తగ్గించవచ్చు. రాత్రి పూట కూడా, ఆ బ్రిడ్జిపై సైకిల్ లేదా రిక్షా లో వెళ్ళాలి అంటే, జనాలకు భయం.
ప్రభుత్వ స్ధలం లో షాపు లు పెట్టి, పందిళ్ళు కట్టి, బెంచీలు వేసి అందరూ కూర్చుని ఉంటే, రోడ్డు పై లేదా పక్కన ఇళ్ళు దగ్గర అడ్డంగా బండ్లు పార్కు చేసి, పోసుకోలు కబుర్లు చెబుతుంటే, మహిళలు నడిచేటప్పుడు తలదించుకోవడం, వారి మాటలు నవ్వులకు ఏమి చేయలేక, గమ్ముగా వెళ్ళడం జరుగుతుంది.
అంతేగాక పంచాయతీ, మున్సిపల్ ఆదాయం కూడా పెరుగుతుంది, అక్రమ షాపులనుంచి పన్నులు వసూలు చేస్తే. మనం బీదవారి షాపు ల గురించి మాట్లాడటం లేదు. ఆస్తులు డాబాలు ఉండి కూడా, దురాక్రమణ చేసుకున్న వారి గురించి మాత్రమే.
ఇంటి ముందు మరియు ప్రభుత్వ స్ధలం లో ఉన్న, ప్రతి షాపు ను అధికారులు తనిఖీ చేసి, షాపు ముందు బోర్డు ఉంచాలి. బతుకు తెరువు కోసం బీదలకు ఇచ్చిన వ్యాపార లైసెన్సు మరియు ప్రభుత్వ స్ధలం అని.
ధనం ఆస్తి ఉన్నవారు అయితే షాపు యజమాని, వెంటనే వాటిని తొలగించడం లేక ఇంట్లో నే సొంత స్ధలం లోపలే పెట్టించడం చేయాలి, అని ప్రజల విన్నపము.
ఇప్పుడు అయినా అలసత్వం వహించక, ఎమ్మెల్యే కరణం గారి నాయకత్వం లో , పంచాయతీ మున్సిపల్ అధికారులు, వీటి గురించి చర్యలు తీసుకుంటారని ప్రజలు ఆశిస్తున్నారు.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2094 General Articles and views 1,837,493; 104 తత్వాలు (Tatvaalu) and views 221,602 Dt : 07-Sep-2020, Upd Dt : 07-Sep-2020, Category : Politics
Views : 666
( + More Social Media views ), Id : 682 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
kunderu ,
chirala ,
river ,
land grabbing ,
mla ,
karan balaram Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments