Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. *ఏవండీ, మీ మాటలు చూస్తుంటే మతి పోతుంది, నమ్మలేక పోతున్నా (ముందు కధనం చూడండి). కానీ నా ముందు ప్రత్యక్ష సాక్ష్యం ఉంది. పని లేకపోతే 10 నిమిషాలు కూడా పలకని ఈ రోజుల్లో, ఇతరుల ఖర్చు భరించి, సమయం కేటాయించి, వారికి సేవ చేస్తాం, ఆరోగ్యం నిలుపుతాము సొంత అమ్మ/ నాన్న లాగా, కనీసం మాట అయినా అందరిముందు అనడం, అసలు నా గుండె తట్టుకోలేక పోతుంది. మరి మీకు 3 ఏళ్ళు పైగా ఆదాయం లేకపోతే, ఎవరన్నా సహాయము గా వచ్చారా? అసలు వీరికి ఎందుకు చెయ్యాలి? తనకు మాలిన ధర్మం, మొదలు చెడ్డ బేరం అంటారు కదా?*
జవాబు - తప్పు, అరిషడ్వర్గాల బానిసలు అనే లాగా, మనము అలా అనకూడదు. అదే 75 శాతం మంది మోహ ధనానికి, 25 మంది సమతా గుణానికీ తేడా.
మనము చేసే ప్రతి పనిలో, రేపు మనకు ఇలాగే జరిగితే, అని అనుకుంటే? ఎవరమూ తప్పు చేయము.
అరే వారిల్లు, చెత్త చెదారముతో ఖాళీ గా ఉంది, మనము బాగు చేపిద్దాము. రేపు వారి లాగా మన ఇల్లు పాడుబడుతుంది, పిల్లలు పెరిగి పెద్ద అయ్యి దూరమయ్యాక, ఇతరులు సాయం చెయ్యాలి అని అనుకుంటే?
75 మంది కి చివర అన్ని మరియు అందరినీ పోగొట్టుకున్నాక, అసలు తత్వం అర్ధం అవుతుంది. పోగొట్టుకోవడం అంటే, పై కి పోవడం కాదు, సొంత పిల్లలే చ్చీ కొట్టి దూరముగా పోతారు, వీరిని అనాధలు గా ఒంటరిని చేసి.
అప్పుడు తలకెక్కిన ఆరాటం అహంకారం, పూర్తిగా దిగుతుంది. కానీ ఆనాడు ఉపయోగము లేదు, అన్ని చచ్చుబడి ఉంటాయి. మనసు నిలబడదు. ఎవరూ గోడు వినరు, నమ్మరు. ధనముతో వీరు మనశ్శాంతిని పొందలేరు, అనుభవ గుణ పాఠాలు తప్పక వస్తాయి.
అందుకే చివరకు, మాలాంటి వారి దగ్గరకే వస్తారు, మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది అని? చేతులు కాలక ముందు, పరిష్కారం ఉంది, కానీ వినరు. చేతులు కాలాక, మనము కూడా ఏమీ చేయలేము.
క్రిష్ణుడు ముందు వెళ్ళి, కౌరవులకు బతిమాలి చెప్పాడు. ఇది తప్పు, అధర్మ మార్గం అని. కానీ గేళి చేసారు, తిట్టారు, కట్టబోయారు. చివరలో, అన్నీ పోయాక, చచ్చేటప్పుడు, తప్పుడు వారైన కర్ణుడు, భీష్ముడు, దుశ్శాసనుడు, దుర్యోధనుడు అందరిదీ ఒకటే మాట - ఇదంతా తొండి, అన్యాయం అన్నారు.
మీరు ఇన్నాళ్ళు చేసిన తొండి పాపాల ముందు, ఇది ఎంత? అయినా ధర్మం గురించి మీరు అడగకూడదు, మీకు ఆ అర్హత ఏనాడో పోయింది, ఆనాడు కన్ను మిన్ను కానకుండా తలెగరేసారు, అని క్రిష్ణయ్య గతము గుర్తు చేసారు.
మన అందరి బతుకులు అంతే. మనము చేసిన మంచి/ చెడు సేవయే, మరలా మనకు 10 ఇంతలై వెనక్కు వస్తుంది. ఇదే జీవిత రహస్యం.
కపట నటన అవసర అవకాశవాదికి, గుణవంతుడైన సజీవ గురు సేవకుడి కి తేడా అదే. ఇచ్చే వాడు పై వాడు, ఎప్పుడు తీసేయాలో తెలిసిన వాడు, ఆయనే. మనము నిమిత్త మాత్రులము అని తెలిస్తే, సాక్షీభూతులుగా నిలిస్తే, ఈ గొడవలు మోసాలు కుట్రలు అహంకారాలు ఆర్భాటాలు అప్పులు తిప్పలు మనకు ఉండవు. మన మనశ్శాంతి, మానసిక బలం, దైవం అండ పెరుగుతాయి, ఏనాటికీ తరగవు.
ధనము ఉచితముగా ఎటూ పంచలేరు, భవిష్యత్ అవసరం లేనిదే. గట్టిగా తనకు 10 ఇళ్ళు ఉన్నాయి, 10 మంది బినామీలు ఉన్నారు అని కూడా చెప్పలేరు. అన్ని, అవి ఎందుకు ఉన్నాయో, వాటితో తనకు ఏమి ఉపయోగమో కూడా తనకు తెలీదు. ధనము ఆస్తులు అమితముగా పెరిగే కొద్ది, అహంకారము లోభత్వము ఎక్కువ అవుతుంది. ఇతరుల పై తన పై కూడా నమ్మకము తగ్గుతుంది, మనశ్శాంతి ఉండదు. తనను తానే మూలాలతో సహా మరచిపోతారు.
అసలు ఇల్లు లేని వాడు 10 మంది తో మాట్లాడుతాడు. 1 ఇల్లు ఉన్నవాడు 6 గురి తో మాట్లాడుతాడు. 2 ఇల్లు లు ఉన్నవాడు, 4 తోనే మాట్లాడుతాడు. అప్పులు అడుగుతారు, ఉచితముగా ఇమ్మంటారని భయం. అందుకే ఎప్పుడూ, మా ఇంట్లో వారందరూ చాలా బిజీ అండీ, స్వయం గోతుల తీత తో అంటారు. వాళ్ళ సొంత పిల్లలు భాగస్వామితోనే అవసరం ఉంటే తప్ప మాట్లాడరు. ఇతరులతో మనసు విప్పి ఎటూ మాట్లాడలేరు.
అదే జ్ఞానము, ప్రేమ, సేవ, త్యాగం, అభిమానము, క్రుతజ్ఞతలు, మనశ్శాంతి, ఆధ్యాత్మికత, జాగ్రత్తలు, ఇతరుల క్షేమం కోరడం అనే సుగుణాల పనులు, పుంఖాను పుంఖాలు గా మదిలో నుంచి వస్తూనే ఉంటుంది. ఎంత మంది చేతులు పట్టి తాగినా, మన దగ్గర ఆగదు, వెలితి ఉండదు. పాటలు ఎన్ని పాడినా గొంతు లో నుంచి వస్తూనే ఉంటాయి. ఎంత మంది నుంచి ఎన్ని రకాల సమస్యలు విన్నా, ఆ సమస్యలకు మూలం అలాగే పరిష్కారం ఒకటే, అది మనకు స్పష్టం గా అదుపులో ఉన్నది, అది వారికి అస్పష్టం గా అదుపులో లేనిది, అదే అరిషడ్వర్గాల బానిసత్వం.
ధనము దోచుకోవాలని దాచుకోవాలని ఆత్రం ఎక్కువై, సహజ ఆనందాన్ని వదిలేసి, చుట్టుపక్కల మనుషులను, నమ్మకమైన మనుషులను వదిలేసి, క్రుత్రిమ ఆనందము పై ఆధారపడి, చివరికి సహజ ప్రాణ వాయువు కూడా పీల్చలేక, క్రుత్రిమ ఆక్సిజన్ మాస్క్ లతో, ఆ ధనము అంతా వ్రుధాగా ఖర్చు పెడతారు, లేదా పరులు వెన్నుపోటు తో దోచుకుంటారు, లేదా పుత్రులు తాగి తందనాలాడి తగలేస్తారు. అంతే గానీ, మంచి కోసం మంచి మనుషులకోసం వాడరు.
మన కష్టాలు మనవి, దానికి ఇతరులను నిందించకూడదు. ఎవరి పాపం బాధ వారిది. మనకు 50 వేల రూపాయల కష్టాలు ఉంటే, మన కన్నా చిన్న వారికి, 5 వేల రూపాయల కష్టాలు ఉంటాయి. అవి మనము తీర్చగలం, స్థిర గుణం పరోపకారం, గలవారికి మాత్రమే.
కానీ అందరికి వచ్చే సమస్య ధనం కన్నా, మానసిక సమస్య, భయం, దూరాలోచన, బలహీనం, దీనికి మందు ఎక్కడా లేదు. వారికి ధైర్యం, ధనము ధనవంతులు ఇవ్వలేరు.
కేవలము అరిషడ్వర్గాలను జయించ ప్రయత్నం చేసే వారు మాత్రమే, ధైర్యం నమ్మకం ఇవ్వగలరు. అది మనము ఇవ్వగలము. ఆ ధైర్యమే అమ్మ ను, ఈ రోజు వరకు ఇంకా, ఆరోగ్యముగా ఉంచ గలిగింది. అదే వైద్యం జాగ్రత్తలు ఎవరికైనా ఇవ్వగలము, మనకు అనుభవము పెరుగుతుందే కానీ, తరగదు.
మనల్ని నమ్మని వారు ఎటూ రారు, నమ్మిన వారు ఎటూ దూరముగా పోరు. చేయూతనివ్వడం వరకే మనపని. అందుకోవడం, విసిరేయడం వారిపని.
ఇతరుల కోసం సమయం ధనం వెచ్చించడం 20 ఏళ్ళు గా జరుగుతున్నదే, ఇంకా జరిగేదే. ఇప్పుడు కొత్త కాదు, నేడు ఆగిపోదు.
క్రిష్ణుడు చెప్పిన చేసిన, భగవద్గీత సారాన్ని, మనము 20 ఏళ్ళు గా అమలు చేస్తున్నాము. ఈ శరీరము కదిలిందాకా సడలినదాకా చేద్దాము, ఆ తర్వాత దైవాధీనము.
We bear time cost for others, we serve, we improve their health - why should we do it? is it virtue?
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1766 General Articles and views 1,289,276; 90 తత్వాలు (Tatvaalu) and views 176,161 Dt : 22-Aug-2022, Upd Dt : 22-Aug-2022, Category : General
Views : 205
( + More Social Media views ), Id : 1502 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
bear ,
time ,
cost ,
others ,
serve ,
improve ,
health ,
virtue ,
parents ,
older Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments