గురు పౌర్ణమి రోజు వ్యాస, శంకర, బ్రహ్మం లాంటి వారి పూజ చేయాలి, ఇతరుల గురించి వాస్తవం - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1553 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1588 General Articles, 54 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

మనకు తెలిసిన జ్ఞానము అంతా, 4 వేదాల నుంచి వచ్చింది. తర్వాత ఆదిశంకరులు వంటి వారు, ఇంకొన్ని అదనముగా భాష్యాలు రచించారు. కానీ మూలము మారలేదు, త్రిమూర్తులనే కొలవమన్నారు.

గురు పౌర్ణమి రోజు వ్యాసుని, ఆదిశంకరుని, వాల్మీకి లాంటి వేద మునుల పూజ చేయాలి, స్మరించాలి. పోనీ మన తెలుగు గురువులు, తండ్రి లాంటి వారు, బ్రహ్మం గారు, రాఘవేంద్ర, వేమన గార్లను స్మరించాలి. వీరంతా, హైందవ దేవుళ్ళనే పూజ చేయమని చెప్పారు, వేదాలనే మూలముగా చెప్పారు.

ఇంకా ఓపిక ఉంటే, పరాయి భాష బాబాయిలను స్మరించవచ్చు, వారు హైందవ దేవతల గురించి ఏవైనా కధనాలు, అంటే కాలజ్ఞానం, వేమన శతకం లాంటి వి రాసి ఉంటే, నామాలు ధరించి ఉంటే, పుట్టు పూర్వోత్తరాలు ఉంటే.

అప్పుడు ఆ పరాయి భాష భక్తులకు కూడా, ఇచ్చిపుచ్చుకునే మర్యాద క్రింద, మన వేమన, బ్రహ్మం, రాఘవేంద్ర గారి ఫోటోలను ఇచ్చి, అందరికీ ఒకరే గురువు, రామ బ్రహ్మం, క్రిష్ణ బ్రహ్మం, లక్ష్మి బ్రహ్మం అని మా తాతలు పెట్టుకున్నారు, మీరు పెట్టుకోమని, వారిని ఒప్పించి వారి ఇంట్లో ఒక తెలుగు గురువు ఫోటో పెట్టిస్తే, వాళ్ళ ఊళ్ళో ఒక గుడి కట్టిస్తే, మన నమ్మకము కరెక్ట్. ఇక ఎవరమూ వాదించాల్సిన పని లేదు.

వారు మన తెలుగు గురువుల ఫోటో కూడా తీసుకోకుండా, మీ అంత పిచ్చివారము కాదు అబద్దాల మాటలు పుస్తకాలు మేము నమ్మము, మా స్థానిక గురువులు ఉన్నారు. మీ లాగ మేము మోసం చేసి వ్యాపారము చేయము, ఊరికి 4 మందిరాలు పరాయి వారికి కట్టము, మైనారిటీ మత గురువు కింద దేవాదాయ శాఖలో కలవము అంటే, మనము ఎంత ద్రోహము చేస్తూ, చేసుకుంటున్నామో తెలుస్తుంది కదా.

మన ముత్తాత తాత కు, ఓ తమ్ముడు ఉన్నాడు అని, దర్గాలో ఉన్నారు అని, ఇతర మత పేరు వాడుతారని, కానీ హైందవ పండుగలు చేసారు అని అంటే, నమ్ముతామా? నమ్మాలా? పోనీ గుడ్డి గా నమ్మితే, మన అసలు తాత ఫోటో, ఆ తమ్ముడు తాత కాళ్ళ ముందు చిన్నదిగా పెడతామా? ఎంత మూర్ఖత్వం? ఎంత బలహీన మనస్తత్వం? కలి మాయలో చిక్కామా? ఇంక ఎవరైనా మనల్ని తెలికగా మోసం చేయవచ్చు?

అంతే కానీ బాబాయి లేదా మావయ్య చరిత్రను ఎవరో రాసారు, వారే దత్త రూపం అన్నారు అన్న అబద్దాలు నమ్మవద్దు. ఇలా రుజువులు లేకుండా నమ్మబట్టే, మన పిల్లలు కూడా, మన మాటలు వినకుండా, సాక్ష్యం లేకుండా, మా ఇష్టం మాది అంటున్నారు, ప్రతి పనికి. చివరకు ఎటు చూసినా నష్టం మనకే, మూర్ఖులకు. ఎంత మంచి చెప్పినా, అనాధాశ్రమములో లేదా ఇంట్లో ఒంటరిగా, ముదుసలి తనము లో వదిలేసి, మాకు నీతి నియమాలు లేవు అంటున్నారు. ఎవరి మాటా వినం అంటున్నారు.

విష్ణువు రూపాలు అన్ని. మరలా రామునికి, క్రిష్ణునికి, దత్తునికి ఇంకో ప్రతి రూపాలు ఉండవు. రేపు మనము కూడా, ఇంకో దత్త రూపం అని ప్రచారం చేసుకుందామా?

అవసరాల కోసం లేదా తెలియక మాయమాటలతో మతం మారిన ఎందరో, తప్పు తెలుసుకుని, ఘర్ వాపస్ లాగా, హైందవ మతం లోకి వస్తున్నారు. మనము వేద మరియు తెలుగు గురువు ల వైపు మారడం, పిల్లలకు చెప్పడం చాలా తేలిక కదా? ముందు తండ్రి ని పూజించు, తర్వాతే ఋజువు తో బాబాయి ని పూజించు. లేదంటే తప్పు అర్ధం వస్తుంది సుమా.

*పరాయి భాష బాబాయి/ మామయ్య గురించి జ్ఞాన ప్రశ్నలు..*

1. వారు ఎప్పుడైనా కుంకుమ లేదా హైందవ అడ్డ నిలువు నామాలు పెట్టుకున్నారా?

2. వారు రామాయణం, భగవద్గీత, మహాభారతం వీటిపై ప్రవచనం చేసారా? ఏవైనా గ్రంధ రచన చేసారా? ఎవరో తీసిన సినిమా, రాసిన పుస్తకం ప్రమాణం కాదు.

కర్ణుడు కూడా గొప్పవాడుగా చూపవచ్చు. కానీ దుష్ట చతుష్టయం లో భాగమని మరువద్దు. క్రిష్ణునికి వ్యతిరేకి అని మరువద్దు.

3. వేదాలు, ఉపనిషత్తులు చదివారా? వ్యాఖ్యానం రాసారా? పద్యాలు కాలజ్ఞానం?

4. పురణేతిహాసాలు, వేద గ్రంధాలలో వారి ప్రస్తావన ఉన్నదా?

5. వారి వేషధారణ, అలాగే ఉన్న చోటు ఇతర మతాన్ని ఎందుకు పోలి ఉంది?

6. వారు అస్తమానం రామా/ క్రిష్ణా/ శివ/ విష్ణు/ దత్త అని తలచారా? మరి మీరు ఎందుకు ఇంకోటి తలుస్తున్నారు?

7. రోజుకు 5 సార్లు హిందూ దైవ పూజ చేసారా? లేక ఇంకోటి చేసారా?

8. ఇతర మతాలు ఎందుకు వారిని దేవుడిగా ఒప్పుకోరు?

9. ఇతర మత పెద్దలకు సంబందించిన గురువారానికి, వారిని ఎలా ముడిపెట్టి హిందువులు పూజిస్తున్నారు? ఏ శాస్త్రం ప్రకారం?

10. హిందూ దేవుళ్ళ అవతారాలు ప్రతిదీ లోక కల్యాణం కోసమే ఎత్తబడ్డాయి. కానీ వీరి వల్ల ఏ లోక కల్యాణం జరిగిందని, వారిని దేవుణ్ణి చేసి, హిందూ దేవుళ్ళ పక్కన పెట్టి మొక్కుతున్నారు?

11. హిందువులు వారిని దైవంగా చూడటానికి, ఆయన సనాతన హిందూ ధర్మానికి చేసిన మేలు ఏమిటి? సాక్ష్యం తో చెప్ప గలరా?

12. వారిని దేవుడిగా పూజించే వాళ్ళు, ఎందుకు లౌకికవాదులు అవుతున్నారు? కాల క్రమంలో మతం ఎందుకు మారుతున్నారు?

మన తండ్రి తాత గురించి ఎవరైనా ప్రశ్నిస్తే, ఖచ్చితమైన రుజువులు చూపుతాము. సజీవ గురువు సేవ, రోజూ భగవద్గీత చదివే, అరిషడ్వర్గాల సాధన చేసే మీలో ఎవరైనా, సాక్ష్యాలతో వీటికి ౠజువులు చూపించగలరు. అదీ పురాతన హిందూ గ్రంథ ఆధారంగా మాత్రమే. మీ రుజువులు పదిమందికి తెలియచేస్తాము.

రుజువులు లేకపోతే, ఇప్పుడైనా మూర్ఖత్వం వీడి, వాస్తవం లోకి రండి. దయచేసి మన పిల్లలను, హైందవ వేద రుజువులతో, బలవంతులను చెయ్యండి. పిల్లల మనసులు గట్టి సాక్ష్యం లేకుండా, బలహీనమై, దేనినైనా పిచ్చి మాటలను నమ్మగలిగితే, ఇక వారి భవిష్యత్తు అంతా శూన్యము పతనము.

మొన్న ఎవరో అంటున్నారు, మీరు ఎన్ని చెప్పినా, మేము ద్రుతరాష్ట్రునిలా, మా పతనము మా పిల్లల భవిష్యత్తు కాలరాయడం మానము, మమ్మల్ని ఎవరు బాగు చేయలేరు అని. మీ పిల్లల మీద మీకు అంత జాలి దయ ఉంటే, మీ ఇష్టం. మీరు నరుక్కునే కొమ్మను ఆపే శక్తి మాకు ఉండదు కదా అని నవ్వుకున్నాము. ఇది కలియుగం, వాస్తవానికి దూరం, మాయకు దగ్గర.

అసలు పరాయి భాష బాబాయి దాకా ఎందుకు, ఇంతకి మనము, మన ఇంట్లో వాళ్ళు, మన బంధువులు స్నేహితులలో, నాయకుల లో, పులి పాము ఆవు, స్వభావం ఎవరివి ఎవరో మనకు తెలుసా? రుజువులు ఉన్నాయా? ఇది తెలియకుండా, ఇంక ఇతరుల గోల మూర్ఖ పిచ్చి నమ్మకము, బలహీన పతనము, మనకెందుకు?

Vyasa, Shankara, Brahma etc. should be worshiped on Guru Purnami day, facts about others  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1588 General Articles, 54 Tatvaalu
Dt : 11-Jul-2022, Upd Dt : 11-Jul-2022, Category : General
Views : 186 ( + More Social Media views ), Id : 1459 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : vyasa , shankara , valmiki , raghavendra , vemana , brahmam , worship , guru , purnami , facts
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content