వీడియో, ఫోటోలు తీయడం, ఎడిటింగ్, ప్రచారము నేర్చుకునే కొత్త వారి కోసం సూచనలు సలహాలు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2180 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2215 General Articles and views 2,476,138; 104 తత్వాలు (Tatvaalu) and views 265,989.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

డిజిటల్ ఎస్ ఎల్ ఆర్ మరియు కనీసం హెచ్డీ 1080 లేదా 4కే వీడియో కెమెరా ఉంటే బాగుంటుంది.

సమాజ సేవలో ఇదీ భాగమే. ఆ కార్యక్రమంలో ఒకరు కూడా మాకు తెలీదు. మేమూ వాళ్ళ కు తెలీదు. భగవంతుని సంకల్పం చేత మాత్రమే అక్కడ ఉన్నాము. ఈరోజు ఆ ఫోటో లు , వీడియో చూసుకుని వారెంత మురిసిపోతారు. మానవ సేవయే మాధవ సేవ లో ఇదీ ఒక భాగం. కొన్ని కార్యక్రమాలకు నిర్వాహకుల అనుమతి తీసుకోవాలి.

వీడియో లో జాగ్రత్తగా గమనించండి. ఎన్ని యాంగిల్స్ లో కెమెరా తిరుగుతూ అన్ని వైపులా చూపుతుందో.

ఇది తెలియని వారు లేదా తీసే జనము లేని వారు, ఒక చోట ట్రైపాడ్ మీద ఉంచేస్తారు. ఆ వీడియోలో జీవం ఉండదు. అంటే చప్పనైన మనిషి జీవితము లాగా, సినిమా, షికారు, ఆనందం, పరిసరాలు, పరిస్థితి లకు దూరంగా ఉంటుంది.

అన్ని వైపులకు వెళ్ళాలి, తిరుగుతూ ఉండాలి, జనముకు అడ్డుగా ఉండకూడదు. కాళ్ళు నడుము లు, ఒళ్ళు నెప్పులు వస్తాయి, తప్పదు. కానీ కర్తవ్యం, ప్రజల ఆనందం ముఖ్యం .అన్ని రకాలుగా జూమ్ చేస్తూ, దగ్గర నుంచి దూరం నుంచి ఫోటో లు, వీడియో లు తీయాలి. కొంతమంది మోహమాటం సిగ్గు భయం తో, స్థలము మొత్తం తిరగరు.

మరలా ఏ ఒక్కరి మీదో మన ఫోకస్ ఉండ కూడదు, పబ్లిక్ ఫంక్షన్ అయితే. కొన్ని సార్లు అపార్ధాలకు దారి తీస్తుంది, సాధారణ మహిళలు విషయంలో. అలా కాకుండా, స్టేజ్ మీద ఉన్న వారైతే ఇబ్బంది లేదు, అది కూడా గౌరవం గా ఉండాలి. అసభ్యకర పరిస్థితులు కనపడినా, తీయకూడదు, పొరపాటున తీసినా, దాన్ని తుడిపి వేయాలి.

ఇంట్లో లేదా మన వారికి తీసే వీడియో ఫోటోలు వేరు, పబ్లిక్ ఫంక్షన్ వేరు. అవి ఇంటర్నెట్ లో ఎవరెవరో చూస్తారు. జాగ్రత్తగా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని, గౌరవం గా తీయాలి చూపాలి. లేదంటే వారందరూ దగ్గర నుంచి, విమర్శలు ఎదుర్కోవాలి.

తర్వాత అతి ముఖ్యమైన భాగం, ఫొటో లేదా వీడియో ఎడిటింగ్. ఫోటోలు 400 తీస్తే అందులో, 100 మాత్రమే సరైన లైటింగ్ యాంగిల్ ఉంటాయి. వాటికి లోగో లు పెట్టి, కొంచెం కలర్ అడ్జస్ట్ మెంట్స్ చేయాలి, బయటకు పంపే ముందు.

అతి కష్టం అయినది వీడియో ఎడిటింగ్, వీడియో తీసే అలవాటు ఉన్న 100 మంది లో, కేవలం 15 మంది మాత్రమే ఎడిటింగ్ సరిగ్గా, హంగులు తో అధ్బుతంగా చేయగలరు.

4 గంటల కార్యక్రమం అయినా, ఎడిటింగ్ తర్వాత, 5 నుంచి 15 నిమిషాలు వ్యవధి దాటకూడదు. ఎవరూ అంతకంటే పెద్ద వీడియో లు చూడరు, మధ్యలోనే ఆపేస్తారు. ఎక్కడా అతుకు ముక్కలు గా, తొణికి వణికి నట్టు, పరుగులు తీస్తున్నట్టుగా, ఎక్కడో అర్ధము లేకుండా చూపిస్తున్నట్టు గా ఉండకూడదు. చిన్నగా కదలుతూ ఉండాలి, అప్పుడు అప్పుడు ఆగుతూ ఉండాలి అవసరాన్ని బట్టి.

మంచి ఫోటో లు, వీడియో సిద్ధం అయిన తర్వాత, అందరికీ అది తెలియాలి, కార్యక్రమము గురించి. దానికి కావాలసింది ప్రచారం, పదిమంది కి చేరాలి, గూగుల్ వెతుకులాటలో దొరకాలి. అందుకు తగ్గ సోషల్ మీడియా నెట్వర్క్ ఉండాలి.

మనకున్న వెబ్సైట్, ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలో, కనీసం నేరుగా పది వేల మందికి చేరుతుంది. ఇంక ఎవరైనా ఫార్వార్డ్ చేస్తే, అది అదనంగా ఇంకొంతమందికి చేరుతుంది.

కాబట్టి జాగ్రత్తగా ఫోటో, వీడియో తీయడం, అలాగే ఎడిటింగ్ చేయడం, ఆ కార్యక్రమం గురించి ప్రచారం చేయడం, బధ్యతగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి. అలా మనం ఇప్పుడు 800 పైగా ప్రదేశాలు లేదా కార్యక్రమాలు కు, ఫోటో లేదా వీడియో ఉచితంగా చేసాము పైసా తీసుకోకుండా, ఎన్నో గంటలు వెచ్చించి. ఇదే కదా మానవ మాధవ సేవ. మానవ నారాయణులందరికీ వందనము లు.

ఇప్పుడు ఆ వీడియో ఫోటోలు మరలా చూడండి, అంతా అర్థం అవుతుంది.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2215 General Articles and views 2,476,138; 104 తత్వాలు (Tatvaalu) and views 265,989
Dt : 16-Feb-2020, Upd Dt : 16-Feb-2020, Category : General
Views : 1192 ( + More Social Media views ), Id : 340 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : video , photo , taking , editing , publicity , suggestions , advice , new learners , telugu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content