Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* అంతరిక్ష నుంచి ఓటు
* జర్నలిస్టు ప్రశ్నలకు మధ్యలోనే ట్రంప్, వీడియో
* కమ్యూనికేషన్ తెలుగు అధికార భాష గా, ఫోటో 2
* బైడెన్ తరఫున ఒబామా - శుభవార్త - ట్రంప్
* ఫ్లోరిడా మీద ఇద్దరి గురి
* బాంక్ పరీక్షలో జవాబుల సున్నాలు రుద్దినట్లు
* 5 పేజీ/ కార్డులు (కార్డు ఏ, బి, సి, డి మరియు యి)
* నమూనా ప్రశ్నలు, జవాబు చెప్ప గలరా? దేశ, రాష్ట్ర, జిల్లా, కోర్ట్, స్కూల్, పన్నులు, నిర్ణయాలు
* చివరి టెలివిజన్ చర్చ, వీడియో
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. కాసేపు ఫ్రీ గా అమెరికా వెళ్లి, ఓ 2 నిమిషాలు, అమెరికా ఎన్నికల సిత్రాలు, బాలెట్ పేపర్లో ప్రశ్నలు చూద్దామా? బయట ఎలా ఉందో తెలుసుకుంటే కదా, మన బుర్ర కాస్త ఎదిగేది.
* అమెరికన్ మహిళా వ్యోమగామి కేట్ రూబిన్స్, అంతరిక్ష కేంద్రం నుంచి, తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
* అమెరికాలో ప్రఖ్యాత సీబీఎస్ నెట్ వర్క్ న్యూస్ ఛానెల్ లో ప్రసారమయ్యే, 60 మినిట్స్ ఇంటర్వ్యూ, చాలా పాపులర్. మహిళా జర్నలిస్టు లేస్లీ స్టాల్ పదునైన ప్రశ్నలు. కానీ ఆమె ప్రశ్నలకు ఇబ్బందిగా, మధ్యలోనే వచ్చేశారు ట్రంప్, వీడియో 1 చూడండి.
* అమెరికాలో కమ్యూనికేషన్ కోసం తెలుగు ను అధికార భాష గా గుర్తించారు. బాలట్ సమాచారంలో వాడుతున్నారు, ఫోటో 2 చూడండి.
* చిట్టచివరి టెలివిజన్ చర్చలో, నవంబర్ 3 న అమెరికా ఎన్నికలకు ముందు, జో బిడెన్ మరియు డోనాల్డ్ ట్రంప్, చివరిసారిగా హోరా హోరీ గా వాదులాడుకున్నారు, అభ్యర్థుల మైక్రోఫోన్ల మ్యూట్ బటన్ వాడారు. వీడియో 2 చూడండి.
* పాపం నిరాశవాది జో బైడెన్ తరఫున మాజీ ప్రెసిడెంట్ బారాక్ ఒబామా ఎన్నికల ప్రచారం. ఆహా.. ఇది శుభవార్త - ప్రెసిడెంట్ ట్రంప్ సంతోషం.
* ట్రంప్ మరియు బైడెన్ ఎవరికి వారు, గెలుపు మాదే అంటున్నారు. ఫ్లోరిడా మీద ఇద్దరి గురి, అక్కడ గెలిస్తే, వారే అధ్యక్షులు అవుతారు.
* అమెరికాలో ఓటు వేసిన బాధ్యత గల పౌరులకు, కింది 4 వ బొమ్మలో చూపబడిన లేదా అలాంటి బాడ్జీలు ఇస్తారు. గర్వముగా అందరికి చూపించి, వారికి ఓటు బాధ్యత గుర్తు చేయమని.
అమెరికా లో ఎన్నికల్లో మంచి విషయాలు తెలుసుకుందాం. బాంక్ పరీక్షలో ప్రశ్నలు జవాబుల సున్నాలు రుద్దినట్లు గా రుద్దాలి. ఉదాహరణకు కాలీఫోర్నియా రాష్ట్రం తీసుకుందాం. ఇప్పటికే చాలా మందికి, నమూనా బాలెట్ (3 వ బొమ్మలో) మరియు అసలు బాలెట్లు పోస్ట్ లో వచ్చాయి.
అందులో 5 పేజీలు/ కార్డులు (కార్డు ఏ, బి, సి, డి మరియు యి), అటు ఇటు 10 పేజీలు ఉంటాయి ఏ4 సైజులో. కనీసం పావుగంట పడుతుంది, అన్ని అర్థం చేసుకుని, ఓటు వేయాలంటే.
అధ్యక్షుడు గా రిపబ్లికన్, డెమోక్రటిక్, పీస్ అండ్ ఫ్రీడం, అమెరికన్ ఇండిపెండెంట్, గ్రీన్, లిబర్టియన్ అనే 6 పార్టీలు పాల్గొన్నా కూడా, ప్రధాన పోటీ, రిపబ్లికన్ ట్రంప్ మరియు డెమొక్రటిక్ బైడెన్ మధ్యలో మాత్రమే ఉంటుంది.
* కార్డు ఏ లో , అధ్యక్షుడు, యూఎస్ రిప్రజెంటేటివ్, అసెంబ్లీ మెంబర్, సుపీరియర్ కోర్టు జడ్జి, ఊళ్ళో స్కూల్ బోర్డు మెంబర్ ను, ఎన్నుకునే ఆప్షన్లు ఉంటాయి.
* కార్డు బీ లో, పట్టణ మేయర్, కౌంటీ వాటర్ డిస్ట్రిక్ డైరెక్టర్ లు, హెల్త్ కేర్ డిస్ట్రిక్ డైరెక్టర్ లు ను ఎన్నుకునే ఆప్షన్లు ఉంటాయి.
* కార్డు సీ లో, రాష్ట్రం కు సంబంధించిన పన్నులు లేదా నిర్ణయాల గురించి పౌరులకు ప్రశ్నలు ఉంటాయి. ఎక్కువ మంది ఎన్నుకున్న ఆప్షన్లు (Yes ఎస్/ No నో) ప్రకారం, తుది నిర్ణయం ఉంటుంది.
14 - స్టెమ్ సెల్ రీసెర్చ్ కి బాండ్లు పొడగింపు - ఎస్/ నో
15 - పబ్లిక్ స్కూల్స్, కమ్యూనిటీ కాలేజీలు, లోకల్ గవర్నమెంట్ సర్వీసులు కు ఫండ్ రిసోర్స్ పెంచడం, కమర్షియల్ ఇండస్ట్రియల్ ప్రాపర్టీస్ టాక్స్ లు పెంచి - ఎస్/ నో
16 - పబ్లిక్ ఎంప్లాయిమెంట్ , ఎడ్యుకేషన్, కాంట్రాక్టు డెసిషన్, లో డైవర్సిటీని ఒక కారణంగా చేయడం - ఎస్/ నో
17 - జైలు జీవితం పూర్తి అయిన వారికి, ఓటింగ్ హక్కు పునరుద్ధరణ - ఎస్/ నో
18 - 17 ఏళ్ళు వచ్చిన వారికి ప్రైమరీ మరియు స్పెషల్ ఎన్నికల్లో ఓటు హక్కు, వారికి గనుక 18 ఏళ్ళు వచ్చేటట్టుగా ఉంటే వచ్చే జనరల్ ఎలక్షన్ కి - ఎస్/ నో
19 - కొన్ని ప్రాపర్టీ టాక్స్ రూల్స్ మార్పులు - 55 దాటిన వికలాంగులు లేదా మంటలు/ భూకంప బాధితులు టాక్స్, కొత్త ఇంటి ప్రకారం ఉండాలి. కుటుంబ ఆస్తుల బదిలీ పన్నులు. ఫైర్ ప్రొటెక్షన్ ఫండ్ - ఎస్/ నో
20 - కొన్ని నేరాలు తప్పులు కు నాన్ వైలెంట్ గా ఉంది ఇప్పుడు, వారికి పెరోల్ రిస్ట్రిక్షన్. - ఎస్/ నో
* కార్డు డీ లో,
21 - లోకల్ గవర్నమెంట్ కు, 15 ఏళ్ళు పై బడ్డ ఇళ్ళు యొక్క రెంట్ కంట్రోల్ పై అధారిటీ - ఎస్/ నో
22 - యాప్ ల తో నడిచే ప్రయాణం మరియు డెలివరీ కంపెనీలు, కొంతమంది డ్రైవర్ లకు ఎంప్లాయి బెనిఫిట్ లు లేకుండా ఎగ్జెంమ్ట్ - ఎస్ / నో
23. రాష్ట్ర రిక్వైర్మెంట్స్, కిడ్నీ డయాలసిస్ క్లినిక్ కు ఉండాలి. ఆన్సైట్ మెడికల్ ఫ్రొఫెషనల్ ఉండాలి. - ఎస్/ నో
24. కంన్సూమర్ ప్రైవసీ లా చేర్పులు. వ్యాపారులు, వ్యక్తిగత సమాచారం షేర్ చేయకుండా నిరోధం - ఎస్/ నో
25. మనీ బెయిల్ ని రిప్లేస్ చేసిన సిస్టమ్ బేస్డ్ ఆన్ పబ్లిక్ సేఫ్టీ మరియు ఫ్లైట్ రిస్క్ మీద రిఫరెండమ్ - ఎస్/ నో
జిల్లా కు చెందిన ప్రశ్నలు
V (వి) - ఒక ఆర్డినెన్స్ అప్రూవ్ అవడం కు పొడిగింపు 6/30/2033 వరకు, 6.5% టాక్స్ రేటు పెంచకుండా కొన్ని అన్ ఇంకార్పొరేటెడ్ ఏరియా . . . - ఎస్/ నో
W (డబ్ల్యూ) - సగం శాతం పన్ను పెంపు పదేళ్లు కు, జిల్లా కు అత్యవసరం అయిన సర్వీసులు అందచేయడానికి - ఎస్/ నో
* కార్డు యి లో, పట్టణం కు చెందిన ప్రశ్నలు
WW (డబ్ల్యూ డబ్ల్యూ) - మన ఊళ్ళో తప్పనిసరి సర్వీసులు రక్షణ కు , యుటిలిటీ అంటే గాస్ కరెంటు వీడియో ఫోన్ వాడకం దారులపై 5% పన్ను 8 ఏళ్ల కు - ఎస్/ నో
XX (ఎక్స్ ఎక్స్) - ఈ ప్రాంత భూకంప రక్షణకై స్ధానిక ఆసుపత్రి బాగుకై బాండ్లు కు - ఎస్/ నో
4 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1804 General Articles and views 1,395,916; 94 తత్వాలు (Tatvaalu) and views 184,893 Dt : 26-Oct-2020, Upd Dt : 26-Oct-2020, Category : America
Views : 690
( + More Social Media views ), Id : 776 , Country : USA
Tags :
usa ,
presidential election ,
trump ,
biden ,
space vote ,
telugu ,
sample ballot questions ,
final tv debate అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments