ఎమ్మెల్యే కరణం అధ్వర్యంలో, చీరాల అసెంబ్లీ లో, గ్రామ పట్టణ అధికారులు సోషల్ మీడియా? - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1163 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1192 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

చీరాల మున్సిపల్ కమిషనర్ గారు మరియు ఇతర చీరాల అసెంబ్లీ నియోజకవర్గ గ్రామ పట్టణ అధికారులు కు నమస్కరించి సవినయంగా చేయు విన్నపము,

మీరు కూడా దయచేసి, మన చీరాల ప్రాంత మున్సిపల్, అలాగే మీ వివిధ శాఖల సోషల్ మీడియా పేజీ ను, త్వరలోనే ప్రారంభించగలరు, కనీస సమాచారం పొందుపరచగలరు.

రోజూ కొంత సమాచారం, ప్రజలకు ఇవ్వగలరు. ఆల్రెడీ జరుగుతూ ఉంటే, లేదా కొత్త ది పెట్టిన తర్వాత, ఆ లింకు మాకు మరియు ఎమ్మెల్యే కరణం బాబాయి కి పంపగలరు.

మన ఎమ్మెల్యే కరణం గారి అధ్వర్యంలో, అసెంబ్లీ నియోజకవర్గం లో, ప్రజలతో నేరుగా సంబంధం ఉండే, ప్రతి గ్రామ పట్టణ అధికారులు అందరూ అంటే, పంచాయతీ సెక్రటరీ, ఎమ్మార్వో, ఎంపీడీవో, విద్య, ఆరోగ్య, రెవిన్యూ, మున్సిపల్ కమీషనర్, పోలీసు సీఐ లు తదితరులు, సోషల్ మీడియా వాడుతూ, రాష్ట్రం మొత్తానికి ఆదర్శంగా నిలవాలని మా ఆకాంక్ష.

మేము మంత్రులు, పార్టీ అధిష్ఠానం, అలాగే ప్రజలకు, మన అసెంబ్లీ నియోజకవర్గం గురించి గొప్పగా చెప్పే సదా అవకాశం కల్పించాలని, అలాగే కరణం బాబాయి కూడా, మీతో ఈ విషయం గురించి ముందుకు వెళ్ళడానికి ఉత్సాహ పరుస్తారని, చరిత్ర సృష్టిస్తారని భావిస్తున్నాము.

ఈ విషయంలో శ్రద్ధ చూపని ఎడల, జిల్లా మరియు రాష్ట్ర అధికారులు కు, ఈ విషయం తెలుపడానికి మార్పు కోసం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది, అని ప్రజలు కోరుతున్నారు.

ప్రజలకు ఉచితంగా సమాచారం అందించడం, మనందరి కర్తవ్యం. మా కోరికలో తప్పు ఉంటే, మీకు ఇబ్బందులు ఉంటే, మాకు అవగాహన పెంచగలరు.

చీరాల అధికారులు మరియు ఎమ్మెల్యే కరణం బాబాయి పేరు, చీరాల సోషల్ మీడియా విప్లవం గురించి, రాష్ట్ర ప్రజలకు, ముఖ్యమంత్రి జగనన్న కు గొప్పగా తెలుపుతూ, పొగిడే అవకాశం ఇవ్వమని ప్రార్ధన.

ఫేస్బుక్ ట్విట్టర్ ఉచితము. ఫేస్బుక్ లో పెట్టిందే ట్విట్టర్ లో పెడతారు, ఇబ్బంది లేదు. సిబ్బంది వాలంటీర్ లు ఉన్నారు, రోజుకు 15 నిమిషాలు పని.

కాలేజీ పిల్లలు ఫేస్బుక్ లో మాటలు ఫోటోలు, ఏళ్లుగా తేలికగా పెడుతున్నారు. మనసు ఉంటే మార్గాలు ఉంటాయి, అన్ని కనపడతాయి.

ఉగాది కి అంతా కొత్త గా, శ్రమ ఖర్చు లేని, మంచి సంకల్పం తో, కలసి ముందుకు సాగుదాం, ప్రజల సమాచార సేవలో తరిద్దాం. మరి కరణం గారు ఎంత ముందుకు తీసుకుని వెళతారో చూద్దాం.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1192 General Articles, 47 Tatvaalu
Dt : 08-Apr-2021, Upd Dt : 08-Apr-2021, Category : Politics
Views : 133 ( + More Social Media views ), Id : 1081 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : leadership , mla , karanam , balaram , chirala , assembly , village , town , officials , social media , movement
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content