Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. బయట వాళ్ళ కు ఎంత మోసం ద్రోహం చేసి కన్నీళ్ళు తెప్పించారో మనకు తెలీదు. అది వారు చూసుకుంటారు, అది వారి వ్యాపారం.
వాళ్ళ వ్యాపారం నష్టం తో, నోట్ల రద్దు తో మనకు మిగతా జనానికి సంబంధం లేదు. ఉందీ అని వారు గట్టిగా ధైర్యంగా అంటే, అప్పుడు గత పదిహేను ఏళ్లుగా కొన్న ఆస్తులు, పొలాలు, అపార్ట్ మెంట్స్, కేబుల్ లేదా ఇతర వ్యాపారం లో కూడా, మనందరికీ పైసా నో పావలా నో, భాగం ఉండాలి కదా. ఇస్తారా?
లాభం లో భాగం ఇవ్వనప్పుడు, నష్టం లో భాగం ఎందుకు చెపుతావు ఇస్తావు అని జనము నిలదీసి అడగరా?
మా బాబాయి ల, అత్తల పిల్లల డబ్బులు, అందరివీ వాళ్ళ దగ్గర ఉన్నాయి లేదా ఉండే ఉంటాయి. వారూ మనలాగే మోసపోయి ఉంటారు. ఏదో ఒకటి స్థలమో ఫలమో అంటగట్టే ఉంటారు.
మన చుట్టాలు పిల్లలు కు, చెప్పండి చూపించండి, మోసం ను వివరించండి, దేవుని దృష్టిలో మంచి వైపు నిలబడండి.
అమాయకులైన మా తమ్ముడు, చెల్లెలు కు కూడా బాబాయి చేస్తున్న ద్రోహం చెప్పండి. ఐదు ఏళ్ళు పరాయి వాళ్ళ డబ్బు, సొంత అన్నదమ్ములు బిడ్డలు డబ్బు, దగ్గర పెట్టుకుని, వ్యాపారం చేసి, ఇప్పుడు వడ్డీ కష్టం అనడం, మోసం దగా వంచన.
అప్పుడే వెనక్కు ఇస్తే, వేరే చోట రూపాయ అన్నా వస్తుంది కదా. తాను పెట్టదు, ఇంకొకరి దగ్గర తీసుకోనివ్వదూ, అంటే ఇదే కదా. ఉన్న స్ధలాలను రేటు వచ్చిన దాకా అమ్మరు, మూడేళ్ల గా జరుగుతుంది అదే.
రామా ఏమిటి ఈ ఖర్మ. మారు మనసు నివ్వవా బాబాయి కి?
ఈరోజు పక్క ఊరు అమ్మాయి వెళ్లి అడిగితే, నేనూ బీదవాడి నమ్మా, మోసం చేయనమ్మా, అని ఒక నెల వడ్డీ ఇచ్చారు అంట.
బీదవారు నగర కేబుల్ వ్యాపారం నడుపుతారా? అపార్ట్మెంట్ లో ఉంటారా లేదా కలిగి ఉంటారా? రియల్ ఎస్టేట్ చేస్తారా?
మా తాత నాయనమ్మ కష్టపడి చమటోడ్చి ఇచ్చిన ఆస్తులు ఉన్నాయి. తెగనమ్మి వీళ్ళందరి కన్నీళ్ళు 2018 లో తీర్చాలి. కానీ జెమిని లో సీరియల్ లాగా, ఇంకా కొన్ని కొంపలు కూలిందాకా సాగుతూనే ఉంటుందా?
అమ్మ అయ్య అంటే, ఆ పిల్ల పొలం అమ్మనిదే డబ్బు చేతికి వస్తుందా? లేక అమ్మా అయ్య అని, మిగతా ఆస్తులు కూడా అమ్మిందాకా, అలా 2018 నుంచి చెప్పే పాత మాట అలాగే చెపుతారా?
భర్త లేకుండా ఇద్దరు పిల్లలు ను చదివించు కుంటుంది అని జాలి కరుణ దయ లేదా. మనకూ పిల్లలు, మనుమలు ఉన్నారు కదా.
బాబాయి ఇప్పుడు దేవుడు, ఎక్కడ ఉన్నా రో కూడా, కనపడరు చెప్పరు. ఎప్పుడూ వినే బాధ్యత లేని మాటలను విని, కన్నీళ్లు తో తలదించుకొని వచ్చింది, ఇంకో ఆస్తి అమ్మకానికి పెట్టాలేమో అని. దేవుడా.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,392,257; 104 తత్వాలు (Tatvaalu) and views 258,560 Dt : 04-Feb-2020, Upd Dt : 04-Feb-2020, Category : General
Views : 901
( + More Social Media views ), Id : 312 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
uncle babai money interest business issues Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments