APLatestNews.com top Banner

Social Media links
బాబాయి ధన మోహం నుంచి బయటకు రా, వాస్తవం గ్రహించు, అరుపులు తో ఉపయోగం? - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 936 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

ఇప్పుడే బాబాయి తో ఫోన్ లో అరుపులు అయింది. అసలు విషయం తప్ప, వడ్డీ ఎగకొట్టే సాకుతో, అనవసర విషయాలు మాట్లాడారు.

1. ఏంటి మెంటల్ గా వాట్సప్ లో మాట్లాడుతూ ఉన్నావు. బిడ్డలు కు ఏదో అవుతుంది అంటావు దేవుడివా? అంతా ప్రభువే చూసుకుంటారు.

అదే మాట తిప్పి మెంటల్ అని నేను అనగలను, కానీ సంస్కారం, బంధుత్వం, పెద్ద తనం తో నేను ఆ మాట అనను.

ఒకరు అంటే ఏమి కాదు, మనం చేసిన మోసాలు ద్రోహాలు మనల్ని రోడ్డు కు ఈడుస్తాయి. నేను చెప్పినది వేరే వారి ఉదాహరణ.

జనం ని మోసం చేసిన వారిని ఏ దేవుడు వదలడు, ఆ ప్రభువైనా ఈశ్వరుడు అయినా. బాబాయి కి అంత ఆవేశం , అమర్యాద మాటలు కూడదు.

2. మధ్యవర్తి లు, జీతగాళ్ళు పనివారు తో ఎందుకు? నేను నీ కెప్పుడు అయినా ఫోన్ చేసానా?

వారు మన దేవుళ్ళు, వారు లెక్కలు వేస్తేనే మనం బతుకుతుంది. వారు పనివారు కాదు, మనల్ని బతికిస్తున్న పుణ్యాత్ములు.

పోయిన సారి 3 అడిగితే, గీపెట్టి రెండు ఇచ్చావు చివర రోజున. ఇంతవరకు, ఇంత అసలు ఉంది అని, ఇంత వడ్డీ అని, కాగితం తిప్పి రాసి పంపావా? నేను ఇంకో పదేళ్లు కు ఊరు వస్తే, అప్పుడు దాకా గమ్ముగా ఉంటావా?

బిడ్డలు అని మాట్లాడుతూ ఉన్నావు. మరి 3 ఎందుకు ఇవ్వలేదు అప్పుడు. నువ్వు కష్టాలు లో ఉంటే, ఆనాడు పిన్ని కానీ నువ్వు కానీ, ఇలా జరుగుతుంది అని ఒక చుట్టముగా చెప్పారా?

బిడ్డ అనుకుంటే, 15 ఏళ్లుగా, రూపాయ లేదా రూపాయిన్నర ఇస్తారా, మిగతా వారికి 2 ఇస్తూ.


పక్క పల్లెటూరు వాళ్ళు, మమ్మల్ని అడిగి మీ దగ్గర పెట్టారు ధనము, మోసం చేయరు, వడ్డీ లు తినరు, వెంటనే ఇస్తారు అని.

ఈ రెండేళ్లుగా ఎన్ని సార్లు మీ చుట్టూ తిరిగారో, అందరికీ తెలుసు. మాకే వడ్డీ ఎగకొట్టడానికి చూస్తున్నారు అంటే, ఇంక వారిని ఎంత అవమానించి ఉంటారో, అర్థం చేసుకుంటాను.

కోట్లు ఉండి, కేబుల్ వ్యాపారం చేసే మీరు, పొలం అమ్మడం గొప్పకాదు. ఏమీ లేకుండా, వాళ్ళు పొలం అమ్మ చూపడము గొప్ప బాధాకరం, దానికి కారణము మీ ధన వ్యాపార మోహం.

జనం ఎలా పోయినా పర్లేదు, మనకు రేటు వచ్చినప్పుడు అమ్ముదామని, రెండేళ్లుగా ఆపడం.

మీకు బయట బిడ్డలు మీద ప్రేమ ఉంటే, వడ్డీ తో కలిపి అంతా తిరగ రాయండి లేదా ఇచ్చేయండి. ఇది మీరు అప్పుడు ఫిబ్రవరి లో చెప్పిన, 2018 జులై లో కాదు అడగడం, 2020 ఫిబ్రవరి. అంటే మీరు ఎంత ప్రేమగా, బాధ్యత గా ఉన్నారో చూడండి.

బిడ్డలు మీద ప్రేమ, నిజంగా ఉంటే, ఊళ్ళో బాబాయి బిడ్డలు మీద కూడా చూపించండి.

జనం కన్నీళ్ళు మనకు చేటు. బాబాయి డబ్బు మోహం లో నుంచి బయటకు రా. వాస్తవం గ్రహించు , అరుపులు తో ఉపయోగం లేదు. మీ ఇంటిముందు కొట్టు ముందు, మేమెప్పుడు అరవలేదు అరవము, ఆ ప్రభువే చూస్తాడు.



ఇప్పుడు నాకు కావలసింది, మొత్తం లెక్క చూసి ఈ రోజు కు వడ్డీ కట్టి, అందులో రెండు లకారాలు తీసివేయి, ఆరోజు కు.

ఇప్పుడు దాకా తిరగరాసి, ఆ కాగితాలు నాకు పంపు వాట్సాప్ లో. వడ్డీ లేని అసలు ధనము మాకొద్దు.

అది అన్న వదినల డబ్బు, బిడ్డ బంధుత్వం, వడ్డీ తో కలిపి ఇచ్చి చూపించు. ఎగకొట్టడం లో కాదు. ఇవ్వనూ వడ్డీ తో అంటావా, ఉంచుకో ఇంకో వ్యాపారం చేసుకోవచ్చు.

2018, 2019 కి నేను మనిషి ని పంపుతాను, రేపు 2 ఇవ్వు. మరలా జులై ఆగష్టు అని అబద్ధాలు చెప్పకు. ప్రభువు అబద్ధాలు ఆడే వారిని, క్షమించడు. 2018 లో ఇదే మాట చెప్పావు జులై లో సెటిల్ చేస్తాను అని.

ఈరోజు దాకా నీ దగ్గర ఉన్న డబ్బు కు, రూపాయి అయినా వడ్డీ కట్టాలి, మీకు కనికరం బంధుత్వం అభిమానం ఉంటే.

ఇవ్వనూ అంటే ఉంచుకో , ఆ మాట పిన్ని కి ఎప్పుడో చెప్పాను, అందుకే ఆమె కు కోపం. బాంకు ల వాళ్ళు కూడా ఇంత మోసం అబద్ధాలు చెప్పలేదు.


నువ్వు గానీ, పిన్ని గానీ, మంచి గా మర్యాద గా నచ్చ చెపితే, మరలా ఫోన్ లో మాట్లాడుదాం. లేదంటే మీ ఇష్టం. నేను పది మంది తో ఏమి చెప్పకున్నా, నా బాధ, ఇంక నన్ను తప్పు పట్టకూడదు.

వడ్డీ లు డబ్బు ఎగకొట్టాలి అని, గత మూడు ఏళ్లుగా అనుకుంటూ, జనం తో ఎవరు బీపీ తో మెంటల్ గా, మాట్లాడుతూ ఉన్నారో మన జిల్లా రాష్ట్ర జనము, చుట్టాలకు అందరికీ తెలుసు.

అరుపులు ఉండ కూడదు అనే , నేను మాట్లాడే మాటలు లో తప్పు ఉండకూడదు అని, ఈ మెసేజ్ పంపుతున్నాను. నా బాధ మా నాన్న అమ్మ డబ్బు వడ్డీ గురించి. అడగడం తప్పు అంటే పిన్ని గానీ, అత్త గానీ, ఇంకెవరు అయినా, నేను తలవంచుకుంటాను.

మీరు చల్లగా ఉండాలి మాకు అండగా ఉండాలి. వడ్డీ లేని డబ్బు, మీ దగ్గర ఉంచుకోవడం ఇన్ని రోజులు దొంగతనం ద్రోహం మోసం అవుతుంది.

బయట మాకు అంటే జనం కు వచ్చే వడ్డీ ని నోటికాడ తిండి ని మీరు లాక్కుని తిన్నట్లుగా భావించాలి. తర్వాత మీ ఇష్టం.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 964 General Articles, 46 Tatvaalu
Dt : 03-Feb-2020, Upd Dt : 03-Feb-2020, Category : General
Views : 241 ( + More Social Media views ), Id : 307 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : uncle babai money interest business issues
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content