ప్రచారం యావ తగ్గించి, ప్రవాసుల/స్థానికుల కు ప్రాధాన్యత ఇచ్చి, ఆదాయం పెంచాలి టిటీడీ ఛైర్మన్ గారు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2094 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2129 General Articles and views 1,921,015; 104 తత్వాలు (Tatvaalu) and views 229,545.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

మన కలియుగ తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరుడు, తానే ఏడుకొండలు దిగివచ్చి, అమెరికాలో పర్యటిస్తూ, ఎంతో దూరాన భూగోళానికి ఆవలి వైపు పశ్చిమాన ఉన్న ప్రవాసులకు కూడా, ఉచిత దర్శన భాగ్యం కలిగించే ప్రయత్నము చేస్తున్నారు, తిరుమల వేద పండితుల ఆశీర్వచనాలతో అని మనకు తెలుసు.

కళ్యాణోత్స క్రతువులో భాగంగా పుణ్యహవచనం, విశ్వక్సేన ఆరాధన, అంకురార్పణ, మహా సంకల్పం, కన్యాదానం, మాంగల్యధారణ, వారణ మాయిరం, హారతితో అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నారు. అమెరికా సమ్యుక్త రాష్ట్రాలలో, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు ప్రవాస భాతతీయులు హాజరయ్యి శ్రీవారి దీవెనలు పొందారు.

టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీవారి కల్యాణోత్సవం, జూన్ 28, అమెరికాలోని సెయింట్ లూయిస్ నగరంలో ఉన్న ది హిందూ టెంపుల్‌ ఆఫ్ సెయింట్ లూయిస్ లో జరిగింది. అలాగే డల్లాస్, సియాటెల్, శాన్ ఫ్రాన్సిస్కో బే-ఏరియా లాంటి ఇతర ప్రాంతాలలో కూడా కల్యాణ వేడుకలు జరిగాయి.

ఇంతవరకు బాగానే ఉంది, ఇప్పుడు అసలు విషయానికి వద్దాము. మన ఇంట్లో మన అబ్బాయి/ అమ్మాయి వివాహము జరుగుతుంది అనుకోండి. మనము ఎక్కడ ఉంటాము? పెళ్ళి మండపము లో మొత్తము 2 గంటల వివాహ సమయములో, స్టేజీ పైన, వధూ వరులకు దగ్గర గా, ఫోటోల/ ప్రచారం కోసమో, ఇంకో దాని కోసమో కూర్చుని ఉంటామా, అందరికీ మేము కనపడాలి అని?

మనము, సాధారణముగా స్టేజీ పైన ఉండము, కింద ఉండి అన్ని సౌకర్యాలు అందరికి అందుతున్నాయా లేదా, ఎలా జరుగుతుంది అని పర్యవేక్షిస్తాము. పెళ్ళి మధ్యలో కాళ్ళు కడగమనో, గుడ్డలు ఇవ్వమనో, ఓ 2 ఫోటోలకు రమ్మని పిలిస్తే మాత్రమే స్టేజీ మీదకు వెళతాము.

మనము స్టేజీ మీద ఉన్నా లేకపోయినా, పెళ్ళి లో అందరికీ తెలుసు, అది మన ఇంటి పెళ్ళి అని, మనమే పిల్ల/ పిల్లాడి పెద్దలము, జరిపించేది మనము అని. అవతల వైపు వారు కూడా, మా వియ్యంకులు అని మనల్ని పరిచయం చేస్తారు. అంటే సాధారణముగా, ఏక్కడైనా జరిగేది ఈ మంచి పద్దతి.

ఇప్పుడు అదే, పెద్ద గా, టిటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారు కూడా, అమెరికా వచ్చారు. మరి ఇప్పుడు ఆయన ఏమి చేయాలి? కార్యక్రమ పెద్దగా, స్టేజీ కింద ఉండి, పర్యవేక్షణ మాత్రమే చెయ్యాలి.

అక్కడి స్థానికులను ప్రోత్సహించి, ఎక్కువ వితరణ స్వామి వారికి ఇచ్చినవారికి, ప్రధాన దంపతులు గా ముందు కూర్చోబెట్టి, మన టీటీడీ ఆదాయం మరింత పెంచాలి. అలాగే అక్కడ లేదా ఎక్కడైనా స్థానికుల కోసమే, స్వామి వారు వచ్చింది, అని నమ్మకము చేతలలో కల్గించాలి.

అది అమెరికా అయినా, తిరుపతి అయినా లేదా ఇండియాలో ఏ నగరము లో అయినా, ఇదే పద్దతి పాటించాలి. అంతే గానీ, ప్రతి పూజలో మనమే ముందు కూర్చుని, మనమే ప్రధాన దంపతులుగా కనపడుతూ, అధికార దుర్వినియోగం చేయకూడదు.

దాని వలన పుణ్యం రాకపోగా, పాపము వస్తుంది. దాని ప్రభావము, మనకు ఆ పదవి ఇచ్చిన జగనన్న మీద కూడా పడుతుంది.

అందుకే రాజకీయ నాయకులను, ఇక నుంచి అయినా తితిదే చైర్మన్లు మరియు సభ్యులు గా చేయకూడదు అనేది. వారికి స్వార్ధ, ప్రచార యావ తప్ప, నిస్వార్ధ దైవ సేవ చేద్దాము అన్న ఆలోచన రాదు, చుట్టుపక్కల వారు కూడా చెప్పరు. మన ఉద్యోగాలు పోతాయని వారి భయం.

ఇంతకుముందు చైర్మన్లు ఇలా చేసినా కూడా, మనము కొత్త వరవడి ఏర్పాటు చేసి, ఆ పాత పద్దతి మార్పించాలి, మన నిబద్దతను తెలుపాలి కదా.

అరిషడ్వర్గాలను జయించిన, దేవుడు అంటే భయం భక్తి ఉన్న, రోజూ నోటితో వేద శ్లోకాలు చదువుతూ దైవ పూజ చేసే నిజమైన హైందవ భక్తులనే, పదవులలో మరియు అధికారుల్లో నియమించాలి అని భక్త సమూహము కోరుతున్నది.

TTD Chairman should reduce campaign and increase revenue by giving priority to expatriates locals  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2129 General Articles and views 1,921,015; 104 తత్వాలు (Tatvaalu) and views 229,545
Dt : 30-Jun-2022, Upd Dt : 30-Jun-2022, Category : General
Views : 496 ( + More Social Media views ), Id : 1447 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : ttd , chairman , campaign , tour , revenue , expatriates , locals , nri , usa , srinivasa , kalyanam
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content