Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. అమెరికా ఎన్నికల ఫలితాలను ట్రంప్ అంగీకరించడము లేదు, కోర్టులో ప్రయత్నాలు, ట్విట్టర్ లో ఆవేశాలు తెలిసినవే. ఈ రోజు పార్లమెంట్ లో, ఎలక్టోరల్ కాలేజీ ఓటర్లు, 306-232 ఓట్ల తేడాతో గెలిచిన బైడెన్ ను, ఎన్నుకోవడానికి సమావేశము అయ్యారు, బుధవారం రోజున. అమెరికా కాంగ్రెస్స్ ఉభయ సభలు ప్రతినిధులతో సమావేశము జరుగుటుంటే, ట్రంప్ మద్దతు దారులు భారీ ఎత్తున రాజధాని వాషింగ్టన్ కు తరలి వచ్చారు.
గడ్డకట్టే చలిలో కూడా నిరసనలు తెలియచేస్తూ, కాపిటల్ భవనాన్ని, అదుపులోకి తీసుకునే ప్రయత్నము చేసారు. ప్రతినిధులు అందరునూ, వేరు ద్వారము గుండా, తరలించారు. పోలీసులు జాగ్రత్త గా, పరిస్తితిని అదుపులోకి తెస్తున్నారు. డీసీ నగర మేయర్, రాత్రి కర్ఫూ విధించారు.
ట్రంప్ వ్యవహార శైలిపై, సొంత రిపబ్లికన్ పార్టీలోనే, వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
అధ్యక్ష ఎన్నికల్లో అవినీతి, అక్రమాలు, మోసం జరిగాయని రాష్ట్రాలకు తెలుసు. తమ ఓట్లను సరిదిద్దాలని అవి భావిస్తున్నాయి. పెన్స్ చేయాల్సిందలా, ఆ ఓట్లను వెనక్కి పంపడమే. అలా చేస్తే మనదే విజయం. మైక్.. ఈ పని నువ్వు చేయాలి. అత్యంత తెగువ చూపాల్సిన సమయమిది - అని ట్రంప్ ట్వీట్ చేశారు. అధ్యక్షుడి సూచనను, వైస్ ప్రెసిడెంట్ పెన్స్ తిరస్కరించారని తెలుస్తుంది. పెన్స్ కూడా, ఆందోళన దారులను భవనం బయటకు వెళ్ళమని కోరారు.
కొత్తగా ఎలెక్ట్ అయిన బైడెన్ టీవీలో జాతిని ఉద్దేశించి ప్రసంగించారు - ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి, మనకు ప్రజా తీర్పు అనుకూలముగా రాలేదని, ఇలా చేయడం పద్దతి గాదు అని చెప్పారు. వెంటనే, ట్రంప్, తన అనుచరులను వెనక్కి శాంతియుతముగా వెళ్ళాలని చెప్పాలని కోరారు.
రిపబ్లికన్ మాజీ అధ్యక్షులు బుష్ కూడా, ఈ ముట్టడిని ఖండించారు.
మద్దతు దారులు భవనమంతా కలియతిరుగుతూ, అక్కడి కుర్చీలలో కుర్చుంటూ, నేలపై పడుకుంటూ, తమ నిరసనలు తెలియచేస్తున్నారు.
కాల్పులు కూడా జరిగినాయని వార్తలు. ఇది ఎక్కడికి దారి తీస్తుందో అని ప్రజాస్వామ్య వాదులు భయపడుతున్నారు.
ట్రంప్ కూడా శాంతియుతము గా ఉండాలని, పోలీసు అధికారులకు సహకరించాలని గౌరవించాలని, అభిమానులను కోరారు.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1979 General Articles and views 1,677,310; 102 తత్వాలు (Tatvaalu) and views 207,679 Dt : 06-Jan-2021, Upd Dt : 06-Jan-2021, Category : America
Views : 674
( + More Social Media views ), Id : 911 , Country : USA
Tags :
trump ,
supporters ,
storm ,
us ,
parliament ,
capital building ,
biden ,
respect ,
democracy కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments