60 ఏళ్ళ పై పేరెంట్స్ కు, చిన్నప్పుడు చేసిన సేవలలో, కొన్ని అయినా వారికి చేశామా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1491 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1526 General Articles, 51 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

మన అమ్మ నాన్న కు 60 ఏళ్ళు దాటిన తర్వాత, మనకు వారు చిన్నప్పుడు చేసిన సేవలలో కొన్ని అయినా, కృతజ్ఞతలు తో దగ్గర ఉంచుకుని, వెనక్కు మరలా తిరిగి, వారికి చేశామా, మన సౌకర్యాలు అన్ని కల్పించి?

ఎన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు లేదా ఎన్ని సార్లు అలా చేయగలిగారు? మీ మనసు ను మీ ఆత్మను, మీరే ప్రశ్నించుకోండి. ఆనాడు అమ్మా నాన్నకు సమయం లేకపోయినా, మన కోసం సమయము కల్పించుకున్నారు, ధన మోహ ఆశ తగ్గించుకుని.

మరి మనము నేడు? మన పిల్లల్ని కూడా, వారి నెత్తిన వేసి, చేతులు దులుపు కుంటున్నాము , కొంత కాలము లేదా ఏళ్ళు, మనల్ని కన్న పాపానికి, అంతేనా?

అలా చేయని వారిని, కృతఘ్నులు విశ్వాసము లేని వారి గా భావించి, ఏ ఉత్తమ సాత్విక జీవిత భాగస్వామి కూడా, చచ్చినా నమ్మరు. ఎందుకంటే తాము కూడా భవిష్యత్తు లో లెగవలేనప్పుడు పనికిరాని అప్పుడు, వారిని కూడా నిర్దాక్షిణముగా వదులుతారు లేదా ఇంకొకరితో వెళతారు కాబట్టి, అది పేరెంట్స్ దగ్గర వంద శాతం నిరూపణ అయ్యింది కాబట్టి. కళ్లు ఎదురు గా ఎన్నో చూస్తున్నాము కదా?

దేవుడు ఎటూ క్షమించరు వదలరు, ఎన్ని నటన పూజలు చేసినా, పాప ఫలితము ఇస్తారు ఎటూ, సమయం వచ్చినప్పుడు. చూడండి కొన్ని గుర్తు తెచ్చుకోండి,

1.మాతృ పితృ దేవో భవ అన్నది, చేతలలో ఏనాడైనా మనస్పూర్తిగా చూపామా? ముఖ్యంగా ముదుసలి వయస్సు లో లేకపోతే ముందే రోగము తో ఉన్నప్పుడు? కనీసం అదేమిటో తెలీకపోయినా, పేరెంట్స్ కాళ్ళు కడిగి ఆకులు పూలతో అయినా పూజించి, నెత్తిన ఆ నీళ్ళు చల్లు కున్నామా?

2. అమ్మ/ నాన్న కాళ్ళు కు సాక్స్ వేసి, మంచి బూట్లు తొడిగామా? కాళ్ళు, పొట్ట వంగకపోవచ్చు కొంతమంది కి.

3. ప్రేమతో చేయి పట్టుకుని, రోజూ కబుర్లు చెపుతూ నవ్విస్తూ, ఆరోగ్యం కోసం మైలు నడిపించామా?

4. నెలకో సారి లేదా అవసరం బట్టి, మంచి డాక్టరు దగ్గర కు తీసుకుని వెళ్లి, ఎంతసేపు ఎన్ని గంటలు అయినా ఓపిక గా తోడుగా ఉన్నారా? ఉత్తమ వైద్యం అందించామా?

రోగ భయం తగ్గించామా? సొంత ఆకుల రస వైద్యం చేసామా?

మందులు తెస్తూ, రోజూ సమయానికి వేసుకున్నారో లేదో చూశారా, ఇస్తున్నామా?

5. శని ఆది వారం తప్పనిసరి సరిగా, బయట ప్రపంచంలో తిప్పారా, మీతో పాటుగా? కూరగాయలు, దేవాలయం, ఇతర ప్రదేశాలు రాష్త్రాలు జిల్లాలు దేశాలు తిప్పామా? . . .

6. రోగం తో మంచంపై నుంచి లేవకపోతే, అన్ని ఎత్తి పోసామా? మంచం మరియు నేల శుభ్రం చేశామా? రాత్రి అంతా జాగారం చేశామా, పొద్దున్నే మరలా 5 కి లెగిచామా? రాత్రి అంతా బాత్రూం కు తిప్పామా? ధైర్యం చెప్పామా, చేత్తో నిమురుతూ?

7. అంట్లు కడిగి, ఇల్లు చిమ్మి, కూరలు కోసి, ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చేశామా?

8. అమ్మ/ నాన్న కుర్రవారు గా కనపడటానికి, మన చేత్తో, తెల్ల జుట్టు కు నల్ల రంగు వేసి, చేతి మరియు కాలి గోళ్ళు పెరిగి ఇబ్బంది అయినప్పుడు తీసామా? ధనం ఉన్నా, మనము చేస్తే అదొక త్రుప్తి ఇద్దరుకు.

9. రోజూ ఒక తెలుగు పాత సినిమా, టీవీ యూట్యూబ్ లో అయినా, చూపిస్తూ, అర్ధము కాని లేదా వినపడని మాటలు చెప్పామా? గుర్తించని నటుల పేర్లు చెప్పామా?

10. గతము తలచుకుని బాధపడుతూ ఉంటే, ఓపికగా బుజ్జగిస్తూ ఆప్యాయముగా ప్రేమతో, గతాన్ని సవరించే విధముగా మనసు కుదుట పడే విధము గా, మంచి మాటలతో నచ్చచెప్పామా?

11. చుట్టాలను బంధువులను స్నేహితులను, వీడియోలో అయినా, చూపించి మాట్లాడించామా అప్పుడప్పుడు?

12. అన్నింటి కన్నా ముఖ్యమైనది, మా ఎదాన పడ్డావు బరువు అయ్యావు, మీ వలన మాకు ధనం ఉద్యోగం ఆస్తి ఆదాయం పోయింది, అని రోజూ ఇంట్లో వాళ్ళు లేదా బయట వారు, తిట్టకుండా తన్నకుండా సతాయించకుండా ఉంచగలిగామా? ఎందుకంటే, మనసు చివుక్కు మంటే బాధతో ఉంటే, ఎక్కువ కాలం బతక లేరు కదా.

ఇవన్నీ మనము చేయలేక పోయినా గతము లో, పశ్చాత్తాపము గా, సిగ్గు పడి, ఇవి చేసే వారినైనా ప్రోత్సహిస్తున్నామా? వారికి సాయపడుతున్నామా? ఇతర మరియు ఇతరుల పెద్దలను బాగున్నారా ఎలావున్నారు అని పలకరిస్తున్నామా? వారి కైనా, సేవ చేస్తున్నామా?

మానవసేవయే మాధవ సేవ, అని మనకు ఎప్పుడు తెలుస్తుంది? మనము కూడా, అనాధగా అనాధాశ్రమములో చేరినప్పుడు ఏనా?

75 ఏళ్ళ వాళ్ళను కూడా, అదీ ఎక్కువ ఖర్చు అయ్యే విదేశాల్లో కూడా ఉత్తమ వైద్యం అందిస్తూ, ప్రభుత్వ ఉద్యోగం కూడా రాజీనామా చేసి, దగ్గర ఉంచుకుని చూస్తున్న వారు, ఎంతో మంది ఉన్నారు అని తెలుసా?

ఇంకొకరు, నడవ లేని తల్లి ని చేతులపై ఎత్తుకుని తిప్పుతూ, అన్ని చేసి, నోట్లో అన్నము కూడా పెట్టే వారు ఉన్నారు అని తెలుసా?

తల్లి దండ్రులను దగ్గర ఉంచుకుని చూడని వారు, క్రుతజ్ఞతలు లేని వారు, భూమికి దేశానికి బరువు తప్ప, కనీసం తమ జీవిత భాగస్వామికి పిల్లలకు కూడా, న్యాయము చేయలేరు సంస్కారము నేర్పలేరు, అని ఎన్నో సార్లు రుజువు అయ్యింది అని తెలుసా?  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1526 General Articles, 51 Tatvaalu
Dt : 04-Feb-2021, Upd Dt : 04-Feb-2021, Category : General
Views : 489 ( + More Social Media views ), Id : 953 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : older parents , 60 age , services , rendered , child , repay to them
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content