పార్టీల ఎంపీలు, బీజేపీ కేంద్ర రాష్ట్ర నాయకులు, ఐయేఎస్ అధికారులు - డిజిటల్ ఇండియా - Request - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1195 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1225 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

అన్ని పార్టీల ఎంపీలు మరియు బీజేపీ కేంద్ర రాష్ట్ర నాయకులు, నిజాయితీ దేశ ఉద్యోగ ప్రేమ గల ఐయేఎస్ అధికారులు కు, నమస్కరించి వ్రాయునది.

మీ అంత పెద్ద వారికి చెప్పే స్ధాయి, అనుభవం మాకు లేదు, అయినా ప్రయత్న లోపం ఉండకూడదు అని, భగవద్గీత చెప్పింది.

కానీ మన ప్రియతమ ప్రధాని మోదీ గారి, డిజిటల్ ఇండియా లో భాగంగా, అధికారుల పధకాల అమలు సమాచారం, సోషల్ మీడియా లో లేకపోయినా ఏళ్లుగా, మీరంతా చోద్యం చూస్తూ, మన గౌరవ ప్రధాని ని మరియు ముఖ్యమంత్రి ని అగౌరవపరుస్తున్నారు.

మేము కేంద్ర స్ధాయిలో కూడా ఈ సమాచారం, ప్రధానమంత్రి పోర్టల్ లో 2 సార్లు పెట్టాము, వివరాలు లోపల చూడవచ్చు, ఇద్దరు అధికారులు కు అప్పగించారు. తిరుగు జవాబు లేదు. మీరైనా, మా మాటలను, ఇంకా అందముగా అమర్చి, ప్రధానమంత్రి గారికి చేర్చి, డిజిటల్ ఇండియా సమాచారం, అన్ని రాష్ట్రాల్లో అమలు జరిగేలా చూస్తారని ఈ విన్నపం. Link.

టాక్స్ లు కట్టే ప్రజల జీతాలు సౌకర్యాలు అనుభవిస్తూ వారిని, కృతజ్ఞతలు తో వారిని యజమానులు గా, ఎటూ చూడటం లేదు. కనీసం జీవం ఉన్న ప్రాణులు గా అయినా చూసి బదులు ఇస్తూ, కలెక్టర్ స్ధాయి నుంచి పంచాయతీ సెక్రటరీ స్ధాయి వరకు, మీరు చేసే పనులు పధకాలు ఆత్మాభిమానం తో, నిర్భాగ్యులైన ప్రజలకు, సోషల్ మీడియా లో తెలియజెప్పే ప్రయత్నం చేయండి, అని మనవి ఎన్నోసార్లు చేశాము.

జీతం తీసుకుంటూ, ప్రజలకు సమాచారం చెప్పలేని, కుసంస్కారం మనది కాదు కదా? జిల్లా ఎస్పీ లు అందరూ సమాచారం పెడుతున్నారు. కేవలం 4 జిల్లా ల కలెక్టర్ లు మాత్రమే, సోషల్ మీడియా వాడుతున్నారు.

ఒక సామాన్య వ్యక్తి ఫించన్ కోసం, స్ధానిక నాయకులు అధికారులు నిర్లక్ష్యం తో పలకకపోతే, కలెక్టర్ దాకా పోవాల్సివస్తుంది. అదీ మన ప్రజాస్వామ్య దౌర్భాగ్యం. రెవెన్యూ అధికారులు వాట్సప్ ఆపుకుంటున్నారు. కలెక్టర్ గారు గమ్ముగా చోద్యం చూస్తున్నారు.

* ఇరు సభల ఎంపీ గా, ఒక పార్టీ తరపున ఉన్నా దేశం కోసం, కొంత అయినా ఆ పార్లమెంటు స్ధానం ప్రజల కోసం, పార్టీ క్షేమం కోసం, మానవత్వం తో మనస్పూర్తిగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పధకాలు, సోషల్ మీడియా లో నిజాయితీగా పెడుతున్నారా లేదా, అని చూడవలసిన బాధ్యత మీకు లేదా? పార్లమెంటు లో ఇలా పెట్టమని, దేశ క్షేమం కోసం అడగలేరా? ఇప్పుడు ప్రధాని కి ఉత్తరం రాయలేరా?

* ఐయేఎస్ అధికారులు గా కేంద్రం మిమ్మల్ని నమ్మితే, మీరు ప్రతి జిల్లాలో, ఇలా జరగాలి అని తీర్మానం చేసుకోలేరా? ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి దృష్టికి తీసుకుని పోలేరా?

జిల్లా ప్రధమ పౌరుడే సోషల్ మీడియా వాడనూ అంటే, తన సిబ్బంది తో ఏమని చెప్పి, సమాచారం జనాలకు ఇప్పిస్తారు?

* బీజేపీ కి ఆంధ్రా లో ఒక్క సీటు లేకపోయినా, మీకు పదవులు ఇచ్చి, బీజేపీ సత్కరించింది. మీ వలన పార్టీ కి ఎటూ ఉపయోగం లేదు, ఏళ్లుగా. కనీసం ప్రధానమంత్రి కి కృతజ్ఞతతో, ప్రజలకు ఉపయోగపడే, డిజిటల్ ఇండియా అమలు చేయమని, ప్రధాని కోరి, దీనిని ముందుకు తీసుకుని పోలేరా? ఉత్తరం రాయలేరా?

దయచేసి కేంద్ర స్ధాయిలో, ఈ నిర్ణయం చేపిస్తే , ఈ విధంగా జిల్లా మరియు స్ధానిక అధికారులు కు, పదిసార్లు బడి పిల్లల కు చెప్పినట్లు గా, బాబ్బాబు రాయండి రాయండి అని చెప్పక్కర్లేదు గదా.

శివయ్య అష్టోత్తర నామావళి, ఎందుకు పెద్దలు నేర్పారో ఇప్పుడు అర్థం అవుతుంది. రాబోయే రోజుల్లో, అధికారులు నాయకులు కు కూడా బాధ్యత మరచి, 108 సార్లు చెపితేనే తిరిగితే నే , ఎక్కుతుందేమో కదులుతారేమో, అని మనతో చెప్పించారు అనుకుంట. మన్నించాలి. ధన్యవాదాలు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1225 General Articles, 47 Tatvaalu
Dt : 06-Dec-2020, Upd Dt : 06-Dec-2020, Category : Request
Views : 206 ( + More Social Media views ), Id : 842 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : mps , all parties , bjp , central , state , leaders , ias , officers , digital india , implementation schemes
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content