గౌరవ ఒంగోలు మున్సిపల్ కమిషనర్ గారికి - సోషల్ మీడియా, పై అధికారుల వివరాలు - Request - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,865,454; 104 తత్వాలు (Tatvaalu) and views 224,889.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

గౌరవ ఒంగోలు మున్సిపల్ కమిషనర్ గారికి నమస్కరించి వ్రాయునది,

విషయము - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో, మీకు నిర్ణయాత్మక ఉత్సాహభరిత ప్రజా బాధ్యత గురించి, తగిన సూచనలు సలహాలు ట్రైనింగ్ ఇవ్వగలిగే, మీ పై రాష్ట్ర అధికారుల పేర్లు మరియు నంబర్లు, కనీసం ఇద్దరు, కొరకై విన్నపము. దీనిని వారికి కూడా, మీరు స్వయంగా పంపగలరు.

డియర్ సర్/ మేడం

గత సంవత్సరం మీరు ఒంగోలు నగరానికి, అధికారులు గా వచ్చారు. ఎన్నో కొత్త మార్పులు తో, సమగ్ర నగర కార్పొరేషన్ అభివృద్ధి సమాచారం, ప్రతి రోజూ ప్రజల అరచేతి లో ఉంటుంది అని ఆశించాము ఆనందపడ్డాము.

మనకు ఎలా చేయాలో మంచి పని అలాగే ఎలా ప్రజలను మెప్పించాలో అవగాహన లేనప్పుడు, తోటి గుంటూరు మరియు తిరుపతి కార్పొరేషన్ కమీషనర్ అధికారులు నుంచి సలహాలు సహాయము స్వీకరించవచ్చు. వారి సోషల్ మీడియా ను చూడవచ్చు, మన ఆఫీసు నుంచే.

కానీ మీరు ఎటువంటి ప్రయత్నాలు కూడా, చేసినట్టు కనపడుటలేదు. మేము సోషల్ మీడియా సమాచారం కోసం ఇతర ప్రకాశం జిల్లా అధికారులు ను అభ్యర్థి స్తూ, మీకూ అవే సందేశాలను సంవత్సరం గా పంపాము, అవే మార్పులు మీ శాఖా కార్పొరేషన్ లో తెస్తారు, అన్న మంచి ఉద్దేశ్యం తో. link.

మా నగర మరియు జిల్లా ప్రజల మీద సానుభూతి, దయ, బాధ్యత, కృతజ్ఞతలు తో సోషల్ మీడియా లో కరోనా గురించి జాగ్రత్తలు, నగర అభివృద్ధి గురించి కొత్త ఆలోచనలు, జరుగుతున్న పనులు గురించి వివరణలు, నగర మేయర్ ఎన్నికల ఫలితాలు, గెలుపు మెజారిటీ అభ్యర్థులు వివరాలు, కొత్త ప్రజా మేయర్ మరియు కార్పొరేటర్లు కు శుభాకాంక్షలు, కార్పొరేటర్ల ప్రశ్నలు అధికారుల జవాబులు, పారిశుధ్య ఏర్పాట్లు, మంచి నీటి సౌకర్యాలు, లాంటివి ఏ ఒకటి కూడా, నగర ఫేస్బుక్ పేజీలో లేవు గత సంవత్సరం గా.

ఈ వారంలో మేము అడిగిన సమాచారం కు, జవాబు లేదు. దయచేసి ఇప్పుడు అయినా, నగర ప్రజల యందు జాలి తలచి, సోషల్ సమాచారం మొదలు పెట్టగలరు. ఇతర ఇబ్బందులు ఏమైనా ఉంటే, పై శాఖా అధికారులు కు విన్నవించి, తగిన సహాయం పొందగలరు.

తమ పన్నులు తో, మనకు జీతాలు సౌకర్యాలు ఇచ్చే ప్రజలను, ప్రజా సేవకులమైన మనము, పేపర్లు ధనముతో కొని మా వార్తలు చూడండి అని చెప్పడం, అనాగరిక పాత పద్దతి. కరోనా తో పేపరు అన్నా భయపడుతున్నారు ఇప్పుడు.

సోషల్ మీడియా లో ప్రతి విషయం, నగర ప్రజల అరచేతిలో ఉంచడం, నేటి ఆధునిక టెక్నాలజీ యుగంలో, కొత్త మర్యాద రాచ పద్దతి.

తిరుపతి అలాగే గుంటూరు, ఇతర కార్పొరేషన్ లు ఏళ్లుగా చేస్తున్నారు ఇస్తున్నారు సోషల్ సమాచారం, తమ ప్రియ ప్రజల కోసం. కలెక్టర్ లు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంతోమంది ఇవి చేస్తున్నారు. మేము ఎక్కడ కూడా లేని, వింత విన్నపము చేయలేదు.

మీకూ అలాంటి వి చెప్పి నేర్పాలి, ప్రజలతో మీడియా తో ఎలా మెలగాలో, బాధ్యత గా జవాబు లు ఎలా చెప్పాలో, రాష్ట్ర అధికారులు తగిన సలహాలు సూచనలు ఇచ్చి, ఆ తర్వాత నే ఏ కార్పొరేషన్ కు అయినా పంపాలి.

కాబట్టి వారిని కోరడానికి అడగడానికి విన్నవించడానికి, ఇతర కార్పొరేషన్ లు అలాగే మున్సిపాలిటీస్ గురించి ఇలాగే చేయమని కోరడానికి, తగిన ఫోన్ నంబర్లు కై, మున్సిపల్ రాష్ట్ర శాఖ వెబ్సైట్ లో వెతికితే, కొంతమంది పెద్దల పేర్లు నంబర్లు కనపడ్డాయి.

కానీ చాలా వేరు వేరు డిపార్ట్మెంట్ లతో, అర్థం గాకుండా ఉంది సమాచారం, మీ పై అధికారులు ఎవరో అయోమయంగా ఉంది. అయినా కొంతమంది కి సమాచారం పంపాము.

అయినా కరెక్టు వారిని తెలుసుకోవడం మంచిది అని, మీరు ధైర్యంగా వృత్తి ధర్మం ను గౌరవించి తెలుపుతారని ఆశిస్తు, మీకు ఈ సందేశం పంపుతున్నాం. దయచేసి మీ పై అధికారుల పేర్లు మరియు నంబర్లు ఇవ్వగలరు, అని ప్రార్ధిస్తున్నాము.

మా ప్రకాశం అలాగే ఒంగోలు ప్రజలకు, రోజూవారి సోషల్ సమాచారం అందించే ప్రయత్నం లో భాగం గా, మీకు ఇబ్బంది కల్గించి ఉంటే, ఇందులో తప్పులు ఉంటే, సహృదయంతో మమ్ము మన్నించగలరు. ధన్యవాదాలు

కాపీలు

* కలెక్టర్ ప్రకాశం మరియు ఇతర అధికారులు,
* మంత్రులు బొత్స బాలినేని సురేష్, ఎంపీ మాగుంట
* జాయింట్ డైరెక్టర్, సెక్రటరి, ఓఎస్డీ, ప్రాపర్టీ టాక్స్ రాష్ట్ర మున్సిపల్ శాఖ
* ఇతర అధికారులు, నాయకులు, ప్రజలు  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,865,454; 104 తత్వాలు (Tatvaalu) and views 224,889
Dt : 08-Apr-2021, Upd Dt : 08-Apr-2021, Category : Request
Views : 792 ( + More Social Media views ), Id : 1080 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : ongole , corporation , municipal , commissioner , social media , updates , officials , state , collector , prakasam , botsa , balineni , magunta
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content