Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
పిల్లలకు ఇంత మంచి మాటలు చెప్పే తల్లి దండ్రులు ఉన్నారా? కనీసం నేటి సినిమాలలో కూడా ఈ మంచి మాటలు పాటలు లేవు. ధనాన్ని ఆస్తులను లాక్కోవచ్చు గాని, విద్య ను ఎవరూ దొంగిలించలేరు. జ్ఞానం ఇచ్చేది చదువే. లేదంటే తీయటి మాటలతో గోతులు తీస్తారు సుమా అని. అల్లరి వద్దు, ఎప్పుడూ ఆటలు వద్దు, ఏడువ రాదు అజాగ్రత్త గా ఉండ రాదు, వీరుని వలే పోరాడాలి అని. బ్రతుకంతా ఒంటరిగా పోరాడాలి, ఎన్ని కష్టాలు కన్నీళ్ళు వచ్చినా, నువ్వు తలవంచకూడదు అని?
తేనెల తెలుగు తో సమానమైనది లేదు అని, దానిని బతికించాలి అని. వెలుగుని చూసి చీకటి పారిపోతుంది అని, అందరూ కలసి ఆనందముతో సాగాలి అని. నాది నాది అనకూడదు, మనది అనాలని చెపుతున్నామా? నాటకాలు ఎన్నో రోజులు సాగవని, వంచన చేసి సంపాదన వద్దు అని, మంచి ని పెంచే ప్రేమను పంచే బతుకే ముద్దు అని చెపుతున్నామా? మరి లోకనికి పాపాన్ని మనమే పెంచుతూ, అయ్యో లోకం ఇలా పాడు అయ్యింది అంటున్నాము, అదే గోతిలో పడి విలవిలలాడుతూ కూడా.
1)
తియ్య తియ్యని తేనెల మాటలతో, తీస్తారు సుమా గోతులు, నమ్మవద్దు
తెలియని చీకటి తొలగించి, వెలుగిచ్చేది చదువే సుమా, మానవద్దు ||తియ్య తియ్యని||
దొంగల చేతికి దొరకనిది, దానము చేసిన తరగనిదీ 2
పదుగురిలోన పరువుని పెంచి, పే..రు తెచ్చే.. పెన్నిదది
పాఠాలన్నీ చదివేస్తాను, ఫష్టుగ నేను పాస్ అవుతా, శభాష్ ||తియ్య తియ్యని||
అల్లరి చేయుట చెల్లనిది, ఎల్లప్పుడాడుట కూడనిది 2
ఏడువరాదు ఏమరరాదు, వీరునివలె నే నిలవాలి
బెదరను నేను అదరను నేను, ఏది ఎదురైనా ఎదిరిస్తా, శభాష్ ||తియ్య తియ్యని||
బ్రతుకను బాటను కడదాక, నడచియే పోవలే వంటరిగా 2
ఇడుములు రాని పిడుగులు పడని,నీ.. అడుగులు తడబడునా
పిడిగులు పడినా జడవను నేను, వడి వడిగా నే అడుగులు వేస్తా, శభాష్ ||తియ్య తియ్యని||
2)
ఈ నిజం తెలుసుకో, తెలివిగా నడుచుకో 2
తెలుగుజాతి భావి కాంతి బాలలే సుమా
తేనెలా. తేటరా. ముద్దులా మూటరా.
తెలుగు మాటతో. సమాన మే.ది లేదురా ||ఈ నిజం తెలుసుకో||
చీకటి బూచి, వేకువ చూసి, పరుగులు తీసిందీ.
మీ కలలన్నీ నిజమౌతాయని, రుజువును చేసిందీ 2
ఆకలిలేని, శోకములేని, లోకము కావాలి..
అందరు కలసి, ఆనందంతో, ముందుకు పోవాలి 2||ఈ నిజం తెలుసుకో||
మతముల కోసం, సతమతమైతే, గతియిక ఏముంది?
సమ్మత మన్నది, మనలో వుంటే, శాంతి సుఖముంది 2
నాదను భావం, వుందా నరుడే, వానరుడౌతాడు..
సోదరబావం, కుదిరిననాడే, మానవుడౌవుతాడు 2 ||ఈ నిజం తెలుసుకో||
మాటలతోటి, బూటకమాడి, దాటుకుపోలేరు
నాటకమున, ఏనాటికి అయినా, తెరదిగి యే తీరు 2
వంచన చేసి, సంపాదించేది, అంతా దండుగరా ..
మంచిని పెంచి, ప్రేమను పంచె, బ్రతుకే పండుగరా 2 ||ఈ నిజం తెలుసుకో||
తేనెలా. తేటరా. ముద్దుల మూటరా.
తెలుగు మాటతో. సమాన మే.ది లేదురా , ఈ నిజం తెలుసుకో తేలివిగా నడుచుకో
ఖైదీ కన్నయ్య బి.విఠలాచార్య దర్శకత్వంలో, కాంతారావు, రాజసులోచన, రాజనాల ముఖ్యతారాగణంగా 1962లో విడుదలైన తెలుగు చలనచిత్రం
Tiya tiyani tenela maatalato ee nijam telusukoa - Khaidi Kannayya kantarao rajasulochana 1962
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2218 General Articles and views 2,490,493; 104 తత్వాలు (Tatvaalu) and views 267,108
Dt : 12-May-2022, Upd Dt : 12-May-2022, Category : Songs
Views : 987
( + More Social Media views ), Id : 1386
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
tiya ,
tiyani ,
tenela ,
maatalato ,
nijam ,
telusuko ,
khaidi ,
kannayya ,
kantarao ,
rajasulochana
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments