Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.
బాధ్యత గల అధికారి, ప్రజల ఇళ్ళ వద్దకు వెళ్ళి, ఎలా వారి కష్టాలు తెలుసుకుంటున్నారో చూడండి.
ఈ రోజు లాక్ డౌన్ పరిస్థితులను సమీక్షించేందుకు, తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ ఏ.రమేష్ రెడ్డి ఐ.పి.యస్ గారు, తిరుమల స్థానిక బాలాజీ కాలనీ నందు పర్యటించి, అక్కడి పరిస్థితులను ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి పలు సూచనలు చేసారు.
ఈ సందర్భంగా జిల్లా యస్.పి గారు మాట్లాడుతూ, ఇప్పుడు పాటిస్తున్న లాక్ డౌన్ నిబంధనలను, రాబోయే రోజులకు కూడా, ప్రజలు పోలీసులు ఇతర శాఖల వారికి సహకరించి, కరోనా వ్యాప్తి నివారణకు, తమవంతు సహకారం అందించాలని, తిరుమల సురక్షితమైన ప్రాంతం కనుక, కొత్త వారు ఎవరైనా ప్రవేశిస్తే, సంబంధిత పోలీస్ వారికి సమాచారం అందించి సహకరించాలని, ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు, అధికారులకు తెలియజేస్తే వారు చర్యలు తీసుకుంటారని, మిక్కిలి అత్యవసరము ఉంటేనే, సరైన ఆధారాలతో అనుమతి పత్రంతో, బయటకు రావాలని సూచించారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా, అహర్నిశలు శ్రమిస్తున్న పోలీస్ సిబ్బంది, వైద్యరంగం, మున్సిపల్ పారిశుధ్య విభాగం వీరితో పాటు, ఎప్పటికపుడు వార్తలను సేకరించి ప్రజలకు చేరవేయడంలో, అనుక్షణం కర్తవ్యం కోసం శ్రమిస్తున్న, అలాగే ప్రజాసేవలో కూడా తనవంతు కృషి చేస్తున్న మీడియా మిత్రులకు, ఈ రోజు తిరుపతి అర్బన జిల్లా యస్.పి శ్రీ ఏ.రమేష్ రెడ్డి ఐ.పి.యస్ గారు, తిరుమల పత్రికా సోదరులకు శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజులు అందజేశారు.
అలాగే మీడియా మిత్రులు కూడా, అవసరాన్ని బట్టి తగు జాగ్రత్తలు తీసుకొని, వార్తల సేకరణకు బయటకు రావాలని, కరోనా మహమ్మారిని కట్టడి చేసే విషయంలో కూడా మీ వంతు సహకారం అందించాలని కోరారు.
ఈ సందర్భంగా ఈ టౌన్ సి.ఐ జగన్మోహన్ రెడ్డి, ఈఈ సి.ఐ చంద్రశేఖర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Photo/ Video/ Text Credit : Tirupati Police
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2277 General Articles and views 2,770,506; 104 తత్వాలు (Tatvaalu) and views 290,986
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments