ఈ రోజులలో సొంత బిడ్డలను నమ్మలేము, ఒక అబ్బాయి అమ్మాయి. స్పష్టం గా మొఖాన ఊసి చెప్పారు, మాతో ఉంచుకోము - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2180 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2215 General Articles and views 2,478,596; 104 తత్వాలు (Tatvaalu) and views 266,164.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

These days we cant trust our own children, we have a boy and a girl. clearly said on face by spitting, lets not keep you with us.

*ప్రశ్న/ స్పందన - ఏవండీ అయ్యో అంత మాట అనవద్దు దయచేసి, మీరు తప్ప సత్వ గుణం ని, ఓపికగా వెతికి పట్టుకునే వారు, అసలు దాని గురించి సాధన చేస్తూ 10 ఏళ్ళుగ స్తిరంగా ఉన్నవారుని, మేము జీవితము లో చూడలేదు. రేపు తెలియని 79 ఏళ్ళ అమ్మకోసం, జీవితాన్ని పెట్టిన వారు, సజీవ గురువు సేవ చేస్తున్న వారు ఎక్కడ ఉన్నారు? కంపెనీ వారు కూడా, మీకు అవకాశం ఇచ్చారు సత్వ గుణం వెతకమని. ఈ రోజులలో సొంత బిడ్డలను నమ్మలేము, మాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి. స్పష్టం గా మొఖాన ఊసి చెప్పారు, మిమ్మల్ని మాతో ఉంచుకోము.* ధనం ఇస్తాము మీ ఆస్తులు అమ్మి, పని మనుషులను పెడతాము లేదా ధనం కు కక్కుర్తి పడి చూసే సోదర సోదరీమణులకు అప్పచెపుతాము లేదా ఆశ్రమంలో పెడతాము అని.

ఆశ్రమాలలో లేదా ఎవరికి ఎంత ధనం ఇచ్చినా, సొంత తల్లి ని కూతురు గా మీరు చూసినట్లు గా, చేయి పట్టి తిప్పగలరా రోజూ మైలు, ఆయుర్వేదం తో ఆరోగ్యం కాపాడగలరా, కాళ్ళు వేళ్ళు తీయకుండా గుండెకు స్టంట్లు అవసరం రాకుండా, రోగాలతో ఆసుపత్రిల చుట్టూ తిరగకుండా, షుగర్ బీపీ నిండు బిళ్ళ నుంచి అర బిళ్ళకు తీసుకు రాగలరా? ఓపిక సహనం తో పక్కన పెట్టుకుని అన్నిటికీ తిప్పుతూ, రక్షణతో నిలబడతారా, ప్రభుత్వ ఉద్యోగం వదలి? అది సత్వ గుణం వారికే సాధ్యం.

అసలు అప్పు లేని పనికిమాలిన వారు ఉన్నారా నేడు, ఇవన్నీ చేస్తూ కూడా? ఏడాదికి వచ్చిన వారు కూడా, అప్పు చేసి భవంతి కొంటున్నారు. మీరు తాపీగా అద్దె ఇంట్లో ప్రశాంతముగా ఉంటున్నారు, తక్కువ ఇంటి పనితో, ఎక్కువ అమ్మ/ జనం సేవతో, అప్పు ఇచ్చిన బాంక్ వారి/ మనుషుల కాళ్ళకు మొక్కే దిక్కుమాలిన పరిస్తితి లేకుండా.

ఇన్నాళ్ళ మా ధన 2 నాల్కల కపట నటన బ్రమల వ్యామోహాల జీవితం, క్రుతజ్ఞతలు విశ్వసనీయత లేని పశు జీవితం, వ్యర్ధం అని అర్ధం అయ్యింది. ధన సేవలు దానాలు యాత్రలు పూజలు నిరుపయోగం అని అనుభవం అయ్యింది. మానవ సేవ మాధవ సేవ అన్నది ముఖ్యం.

ధర్మం ముఖ్యం బంధం కన్నా, అన్న భగవద్గీత సారాన్ని బట్టి, ఇప్పుడు అనుభవం అయ్యి, ఆ పాపాత్ములను పెంచగా మిగిలిన రూపాయి ఆస్తి కూడా ఇవ్వము అని పిల్లలకు చెప్పాము. రెక్కలు వచ్చాక ఆస్తులు పెరిగాక ఏమి అంటారు, మీ తొక్కలో ఆస్తి వద్దు, మీరు వద్దు అన్నారు.

వారు ఆస్తి అడిగినా మేము ఇవ్వము, వీరు రజో తమో గుణ దాసులు అని స్పష్టం గా, 10 ఏళ్ళు పైగా అర్ధం అయ్యింది. వారు ఒక నెలకు ఏడాదికి కపటం గా నటించి మారినా, నమ్మలేము. నమ్మితే వెన్నుపోటు గుండెపోటు తప్పదు.

20 ఏళ్ళ చెడు గుణం సహవాసం, 1 ఏడాదిలో మారుతుందా? మా వంశం/ సంతానం/ కుటుంబ కపటం మాకు తెలీదా? మా ముదుసలి తల్లి దండ్రులను అత్త మామలను కూడా దగ్గర ఉంచి మేము చూడలేదు అహంకారముతో. ఇప్పుడు మాకు ఫలితాలు వస్తున్నాయి, అది మేము చేతులారా చేసుకున్న ఖర్మ.

అందరికీ అబద్దాలు చెప్పుకుని దిక్కుమాలిన బతుకు బతుకుతున్నాము - మాకు ఓపిక ఉంది, ఒంటరిగా ఉంటాము, ధనం ఆస్తి ఫించన్లు ఉన్నాయి, మేము పిల్లలతో ఉండము, పనోళ్ళు కక్కుర్తి చుట్టాలు స్నేహితులు ఉన్నారు, మా ఊళ్ళోనే ఉంటాము అని, ఈ వయసులో కూడా మాకు నీచపు అబద్దాలు తప్పడం లేదు, ఇంక మాకు మోక్షం ఎప్పుడు వస్తుంది. అమ్మ లాగా సొంత గా నడవలేని స్తితిలో, చేయి పట్టుకుని నడిపించే, ధైర్యం చెప్పే, సత్వ గుణ తోడు మాకు కావాలి.

దయచేసి మాకోసం సత్వగుణ సంపన్నులను వెతకండి. ఒంగోలు లోనే కాదు, హైదరాబాద్ లో కూడా స్తలం ఉంది. వారికి ఇద్దాం. వారి నీడన, సత్వ గుణ సన్నిధిలో, చివరి రోజులు అమ్మ లాగా మనశ్శాంతిగా గడుపుదాము అని ఆశ, మన్నించాలి. దయచేసి సహాయం చెయ్యగలరు.

*జవాబు* - గురువు గారు, బలవంత పెట్టి లేదా ఆశ చూపి లేదా భయపెట్టి, మనము సేవలను అలాగే అండను పొందకూడదు. ధనం ఆస్తులు అధికారం పదవి అందం కోసం వచ్చినవారు, మధ్యలోనే వదిలేస్తారు. అదే గుణం కోసం వచ్చిన వారు, మనల్ని జీవితానతం దైవం దేవతలా చూస్తారు, అది సొంత పిల్లలు అయినా బయటవారు అయినా.

మీరు సత్వ గుణ బాటలో నడవటానికి 5 ఏళ్ళుగా ప్రయత్నం చేస్తున్నారు, కానీ స్తిరముగా లేదు, ఆమావాస్య పౌర్ణమి లాగా, చంచలముగా ఉన్నారు. మీ లాంటి వారు ఎందరో ఉన్నారు. మొన్న ఊరికి వచ్చెటప్పుడు, చాలా మంది అడిగారు, మేము ధనం మీ అకౌంట్ లో వేస్తాము, మీరు మంచి పనులకు ఖర్చు పెట్టండి అని.

మీరు ముందు పాపపు నీడ వదలి, మీ సత్వ గుణం ను, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లేదని నిరూపించనిదే, తీసుకోము అని చెప్పాము. వారి నీతి నియమాలతో, వారానికి 1 లేదా 2 రోజులు ఫోన్ చేస్తాము, అని కూడా ఇంత చిన్న విషయానికి మాట నిలబెట్టుకోలేని మానసిక బలహీనులు.

అన్ని సమస్యలకు పతనాలకు వెన్నుపోటులకు గుండెపోటులకు మూలం ధనం, మరువద్దు.

గతం వదిలేయండి, జరిగింది జరిగిపోయింది, వెనక్కు మార్చలేము. ఇప్పుడు మీ సొంత సాధన వైపు ద్రుష్టి పెట్టండి. ధనం తో సంబంధం లేని సత్వ గుణ సేవలు త్యాగాలు స్తిరముగా కొనసాగించండి, అందరికీ తెలియపర్చండి, మీ సోషల్ మీడియాలో పెట్టండి. మనము ఏ సేవ చేసినా, మన పేరు ఫోటో ఉండకూడదు.

ట్రస్ట్లు దాదాపుగా పన్నులు ఎగకొడటానికి, వారి సొంత అవసరాలు తీర్చుకోవడానికి, ప్రచార యావకు పెడుతున్నారు. ఆ ట్రస్ట్ లేదా గుడి ధర్మ కర్తలను అడగండీ, మీ ముదుసలి తల్లి దండ్రులు అత్త మామలకు సేవ చేసారా, రేపు మీ పిల్లల దగ్గర దేవతలు గా ముదుసలి తనములో ఉంటారా అని, సాక్ష్యాలని వెరిఫై చెయ్యండి. వారి మొఖములో స్పందన లేదా మౌనం, మీకు అర్ధం అవుతుంది, వారు ఎంత కపటం నటనతో మొక్కుబడిగా ప్రపంచ బ్రమలు లో చేస్తున్నారో.

మనసును నిగ్ర హించడం కష్టం, దానికి సాధన కావాలి, త్యాగాలు చెయ్యాలి. ఏళ్ళుగా, మానసికముగా శారీరకముగా సేవలు చేసి అలసి పోవాలి, అది చిన్న విషయం కాదు. ధన సేవకులకు, ఇలాంటివి వల్ల కాదు.

మొన్న చూసారు కదా, ఒక్కరమే అమ్మ ను పెట్టుని, నెలరోజులు ఒంటరిగా ఇల్లు బాగు చేసుకున్నాము.

దానికి ముందు, ఏళ్ళుగా, మనం అందరికీ, మా దగ్గరకు రాండి, మీకు సగం ధనం పెడతాము, రాను పోను ఖర్చులో, అలాగే ఉచితముగా మీకు వైద్యం చేస్తాము, సజీవ గురువు సేవ నేర్పిస్తాము, అని చెప్పింది గుర్తు ఉందా.

ఇప్పుడు నెలకు వచ్చి, మన ఊళ్ళో ఉంటే అందుబాటులో, ఒక్కరు కూడా వచ్చి 2 రోజులు ఉండి, ఆయుర్వేదం తీసుకోలేదు నేర్చుకోలేదు కనీసం, అమ్మ సేవ సంగతి పక్కన పెడితే.

అంటే అర్ధం ఏమిటి? తమ ఆరోగ్యం గురించి శ్రద్ద లేని వారు, ఇతరుల మంచి చూస్తారా? తమ ముదుసలి తల్లి దండ్రుల ను దగ్గర పెట్టుకోని చూడని వారు, మన తల్లి దండ్రులను 2 రోజులైనా సేవిస్తారా? రేపు వారి ముదుసలి తనములో, నమ్మకమైన రక్షణ దొరుకుతుందా?

మీకు గతములో చెప్పాము, మీరు 1+ ఏడాది సజీవ గురువు సేవ చేస్తే, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వదిలితే, మీకు ఉచితముగా మీ నుంచి ఏమీ తీసుకోకుండా, అమ్మకు చేసిన సేవలు మీకు చేస్తాము అని చెప్పింది మరువద్దు. అంతకన్నా పెద్ద సహాయం ఎవరూ చేయలేరు ఉచితముగా జీవిత చరమాంకములో, 10 ఏళ్ళ సాక్ష్యం తో.

కాబట్టి ఇంకా మీకు 5 నుంచి 10 ఏళ్ళ వయసు ఉంది బలంగా, సాధన మొదలు పెట్టి, మీ సత్వ గుణం ను చాటండి.

రజో తమో గుణాలు మనతో సర్దుకోలేరు, ఉదయం 5 కి లెగిచి వేపాకు తిని, కాకర అల్లం వెల్లుల్లి రసం తాగి, కషాయం తాగాలంటే, ఆరోగ్యం స్తిర త్యాగం క్రుతజ్ఞత విశ్వసనీయత తొ ఉండాలి అంటే, వారి మానసిక నియంత్రణ బలం చాలదు. వారం/ నెలలో పారిపోతారు, మనల్ని నానా మాటలు అని.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2215 General Articles and views 2,478,596; 104 తత్వాలు (Tatvaalu) and views 266,164
Dt : 03-Nov-2024, Upd Dt : 03-Nov-2024, Category : General
Views : 106 ( + More Social Media views ), Id : 2165 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : trust , children , face , spitting , keeping , parents
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content