Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. మహారాజ రాజశ్రీ మహనీయులందరికీ వందనాలు వంద వందనాలు. ప్రజల సంక్షేమం కోసం పాటు పడే, మంచి వాళ్ళందరకు వందనాలు కోటి వందనాలు.
ధన్యవాదాలు మన గ్రామ పంచాయతీ అధికారులకు, సిబ్బంది కి, ఈనాడు వారికి. అలాగే, ముందుకు తీసుకుని వెళ్ళడానికి, సహాయం చేసిన ప్రతి ఒకరు కు కూడా వందనాలు.
పరిపాలన సక్రమంగా న్యాయం గా, సత్వరం గా సాగుతుందీ అంటే, జగనన్న కు, మన మంచి ఆమంచి గారికి, కరణం గారికి ఇందులో భాగం లేదనలేము. బిజీగా ఉండే వారి దాకా, పోనివ్వకుండానే అధికారులు, ప్రజా ఆరోగ్యం కోసం, నడుం బిగించి కదిలారు.
ఒక్క రోజులో ఎలా సాధ్యం ఇది. సాధ్యమైంది, గిల్లి చూసుకున్నాను. ఇది ఇండియా నా అమెరికా నా అని. సీసీటీవీ లో జరుగుతున్నది మొత్తం చూస్తున్నా.
మధ్యాహ్నం ట్రక్కులో వచ్చి, పారిశుధ్య సిబ్బంది, 10 సెంట్లు స్ధలం లో చెత్త తీసేసారు. స్ధలం ఓనరు మామయ్య గారి తో, మాట్లాడారు అనుకుంటా నోటీసులు గురించి, సమస్య గురించి. మామయ్య కూడా, జే సీ బి ట్రక్కు వచ్చి, పని మొదలు పెట్టిన తర్వాత వచ్చి, అక్కడే కొంత సేపు ఉన్నారు, జరిగేది గమనిస్తూ.
గంటలో మొత్తం దున్ని, చెత్తను తీసి, చిల్ల చెట్లు, పొట్టి తాటిచెట్టు, మొక్కలు అన్ని ఆ మిషన్ లాగి, చదును చేసింది. మా మామయ్య కు, ఆ బజారు న నడిచే జనానికి, చుట్టూ ఇళ్ళు కు పట్టుకుని ఉన్న భయం, దరిద్రం, అశుచి, అశుభ్రం, రోగపీడ అన్ని క్షణంలో దూరమైనవి. ఇక వర్షాకాలంలో కూడా డెంగ్యూ దోమరాదు. 3 ఏళ్ల క్రితం, నాకూ దోమకుట్టి 2 వారాలు బెడ్ రెస్ట్ తీసుకున్న, కేవలము 3 వారాల సెలవులో.
ఇంకెవరికీ ఆ బాధ కలగకుండా ఉండాలి అని నా తాపత్రయం. మామయ్య ను బతిమిలాడా, పెద్ద మనుషుల తో చెప్పించా, చివరకు పంచాయతీ సహాయం తో, ప్రజల ఆరోగ్యం కు ఉన్న, దోమల వైరస్ ల పీడ పోయింది. మీరంతా బాగుండాలి, అప్పుడే మేము బాగుంటాము.
మమ్మల్ని తిట్టినా మంచిగా పెట్టినా మీరే మాకు దిక్కు, అందరం దేవుని కన్న బిడ్డలము. ధన్యవాదాలు. ఇంకా సమస్యలు ఉన్నాయి, ముందు పెద్దలు తో చెప్పించి, తర్వాత పంచాయతీ లేదా పోలీసు వారి ద్వారా, పూర్తి చేద్దాం.
దాని ఖర్చు మామయ్య ఇవ్వకపోతే మాకు చెప్పగలరు, మేము కడతాం మా బజారు లో ఉన్న మంచి మనసుల కోసం. ఒకవేళ మామయ్య కట్టినా కూడా, మమ్మల్ని అడిగితే, ఏదో ఇసుక రేణువు లా, మా వంతు ఇస్తాము.
ఇక్కడ గెలిచింది ఎవరు? ప్రజలు, అధికారులు, ఈనాడు, మంచి మనసులు , మామయ్య.
ఓడింది ఎవరు? దోమలు, వైరస్.
సర్వేజనా సుఖినోభవంతు
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1948 General Articles and views 1,572,757; 97 తత్వాలు (Tatvaalu) and views 198,476 అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments