కోట్లాది భారతీయుల ఏకపక్ష గెలుపు ఆమోదం - జయహో నమో మోదీ నమహా: - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,873,886; 104 తత్వాలు (Tatvaalu) and views 225,624.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

అఖండ భారత ప్రధానమంత్రి మోదీ గారికి, నీడ లాంటి మిత్రులు అమిత్షా గారికి మరియు కమలం అభిమానులకు హ్రుదయపూర్వక అభినందనలు. మార్పు కావాలి, కొత్తదనం రావాలి, కొత్తపాలన చేయాలి అని, ప్రజలు కాంగ్రెస్ ను దూరంగా పెట్టారు కోలుకోకుండా.

మండుటెండల్లో కూడా, కమలం సువాసనలు భారీగా వీచాయి, కాశ్మీరు నుండి కన్యాకుమారి దాకా. నేను మీ సేవకుడిని, మీ ఆస్తులకు కాపలాదారుడిని, అన్న మాటలను జనం విశ్వసించారు. గత 5 ఏళ్ళ పాలనకు జేజేలు పలికారు, మరలా మోదీయే కావాలని, జనం పట్టుబట్టి భారీ విజయం తిరిగి ఇచ్చారు. ప్రజా తీర్పును గౌరవించాలి.

ఇది మామూలు యుద్దం కాదు, నరాలు తెగే ఉత్కంఠ - మోదీ ఒకవైపు అన్ని ప్రతిపక్షాలు ఇంకో వైపు. ఏమి అవుతుందో, ఏమి జరుగుతుందో ఎవరికీ నమ్మకం లేదు చివరిదాకా, ఎంత మెజారిటీ వస్తుందో అని, పక్క పార్టీల మీద ఆధారపడాలి ఏమో అని.

ఎదురుగా 30 యేళ్ళు రాజకీయాలలో పండిన అపర చాణక్యులు కురువ్రుద్దులు, దీదీ, బాబు, ఇంకా ఎంత మందో, ప్రధాని పదవిని చేజిక్కించుకోవాలి అని, చక్రం తిప్పాలి అని. అన్నిటిని ఎదుర్కొని, భారీ మెజారిటీ సీట్లు సంపాదించి, విజయమాలను వరించారు. ఎవరైనా దీనిని కాదనలేరు, భారీ ఊహించని విజయం.

ప్రజలు మార్పు కోరుకొని, తన మీద పెట్టిన ఆశలను తీరుస్తారు అని, నిజమైన భరత పుత్రుడిగా కమలం వారసుడిగా, ఈ 5 ఏళ్ళ పాలనలో కూడా , ఇంకా ఎక్కువ పేరు సంపాదిస్తారని, ప్రపంచములో భారత పతాకాన్ని గర్వంగా ఎగురవేస్తారని ఆశిద్దాము.

నమో ఉదయం అలాగే రాహూల్ ప్రభావం అస్తమయం. స్వయముగా సోనియా, రాహూల్ చేసుకున్న స్వయంక్రుతాపరాధం. అనుభవజ్ణులైన పార్టీ, గాంధీ కుటుంబం అని జనం నమ్మి అవకాశం ఇస్తే ఇన్నేళ్ళు, అభివ్రుద్ది లేకపోగా, కుటుంబ పాలనతో మాసానికొక స్కాం తో భారతాన్ని ఇబ్బంది పెట్టారు. ఫలితం అనుభవించారు, ఘోరమైన పరాజయంతో, ఇప్పుడు కూడా.

మోడీ ని అనవసరం గా తిడుతూ, దేశం లోని అన్ని ప్రతిపక్షాలు ఏకమైనాయి. ఇంకా ఎన్నో తప్పటడుగులు జిమ్మిక్కులు చేసాయి. ఒక్క మంచి పనినీ సమర్ధించలేదు, అన్నిటికీ వంకలు పెట్టాయి ప్రతిపక్షాలు. సరియైన అవగాహన లేకుండా ముందుకి వెళితే, ఫలితం ఎలా ఉంటుందో ఇది ఒక ఉదాహరణ.

కోట్లాది భారత ప్రజలకు, కొత్త మార్పుతో అంతా మంచే జరుగుతుంది, అని ఆశిద్దాము. మోదీ పై చాలా పెద్ద భారం ఉంది, గెలుపుతో బాధ్యతను మరువకుండా, అన్ని వర్గాల ప్రజలతో మరలా ఎన్నిక అయ్యెట్లు గా, మంచి పాలన చేస్తారు అని ఆశిద్దాము. ఈ ఎన్నికలలో కులం మతం కార్డు, పని చేయలేదు. అది విశేషము, అభిందనీయం.

ప్రధానమంత్రి గా, మోదీ కి ధీటుగా ఎవరూ లేరు , అలాంటి సాహసోపేత నిర్ణయాలు ఎవరూ చేయలేరు, ఇది జగమెరిగిన సత్యం. 543 seats in the Lok Sabha. 272 seats needed for a majority.

Party 2019 2014
BJP+ 350 352
CONG+ 92 61
YSRCP 23 9
TRS 9 11
TDP 2 16

పరీక్ష తప్పితే, ఇంకో సంవత్సరం ఉంటుంది, అని సర్దుకోలేము అవమానంలో మన సొంత పిల్ల వాడికి.

ఇందిర రాజీవ్ లేకుండా, రామన్న రాజన్న లేకుండా, దేశం తో పాటూ రాష్ట్రం కూడా ముందుకు పోయింది. ఎక్కడా ఆగదు, ఆగలేదు. మంచే ఆశిద్దాం.

ఇప్పుడు అయినా తప్పులు తెలుసుకుని , అవినీతి స్కాం లు లేకుండా , అందరినీ కలుపుకుని పోతే నే, మరలా అవకాశం వస్తుంది గెలిచిన లేదా ఓడినవారికి లేదా ఎవరికైనా.  

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,873,886; 104 తత్వాలు (Tatvaalu) and views 225,624
Dt : 23-May-2019, Upd Dt : 23-May-2019, Category : Politics
Views : 1450 ( + More Social Media views ), Id : 121 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : india pm , narendra modi , amitsha , bjp , 2019 election
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content