కన్న తల్లి పెంపక గొప్పతనం, పిల్లలలో ఒకరైనా, చివరలో అండగా ఉన్నప్పుడు బయట పడుతుంది - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,465; 104 తత్వాలు (Tatvaalu) and views 225,070.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

The greatness of a Mother will be known, when at least one of the children, takes care of her, along with them, at old age. Also, respect for women increases when they serve their fellow women, old mothers and aunts.

కన్న తల్లి పెంపక గొప్పతనం, పిల్లలలో ఒకరైనా, చివరలో తమతో పాటుగా, అండగా ఉన్నప్పుడు, బయట పడుతుంది. అలాగే తమ తోటి మహిళలైన, ముదుసలి అమ్మ, అత్త లను సేవించినప్పుడే, మహిళలకు గౌరవం పెరుగుతుంది.

Don't forget that even if a woman do outside jobs, businesses, positions and earns crores, if she does not teach the children culture/ Samskara, she will be ruthlessly left behind by old age.

మహిళ, బయట ఉద్యోగాలు, వ్యాపారాలు, పదవులు చేసి, కోట్లు సంపాదించినా, పిల్లలకు సంస్కారం నేర్పకపోతే, ఆమెను నిర్దక్షిణ్యముగా ముదుసలి తనములో వదిలేస్తారు, మరువద్దు.

మయూరి సినిమాలో, సుధ గారి గొప్పతనం తెలుసు కదా? కాలు ఆపరేషన్ తర్వాత కూడా, గొప్పగా నాట్యం చేయగలిగారు. నిజ జీవితం ఆధారంగా, ఆ సినిమా తీసారు. అదీ పట్టుదల ఆత్మ విశ్వాసం అంటే, అందుకే మహిళలు మహరాణులు అంది.

అందులో, క్లాసు లో, విద్యార్థులు ను ఒక వాక్యాన్ని, అభినయం చేసి చూప మంటారు. ఆ వాక్యం ఏమిటో తెలుసా, ముదుసలి వారు పసి పిల్లల తో సమానం అని. అది అన్ని విషయాలలో వంద శాతం కరెక్టు.

నా కూతురు పసిపిల్లల చేష్టలు చూడండి. పసి పిల్లకు (అమ్మ 74), అప్పుడే ఏదో మునిగి పోయినట్టు, బాల నెరుపు తో జుట్టు తెల్లబడితే, నల్లగా నిగ నిగలాడాలని, 6 ఏళ్లుగా రెండు నెలలకు ఒకసారి తలరంగు వేస్తా, జుట్టు పాయలు పాయలు గా తీసి, దువ్వుతూ, అది పాత విషయమే.

కానీ అందుకోసం కూర్చోవాలి అరగంట అంటే, కుదురు గా కూర్చోదు కూర్చోలేరు. తల అటు ఇటు కదిలిస్తూ ఉంటుంది. తప్పు కదా, రంగు పోదా తగిలి అంటే, ఏం చేయనురా తల ఊగుతూ ఉంటే అంటుంది. పసి పిల్లలు కుదురు గా ఉండరు కదా. ఇంకేమైనా అంటే కోపం వస్తుంది, నా కొద్దుపో నీ రంగు అంటుంది, అలిగి వెళ్ళిపోతూ.

అలాగే, రోజుకు 8 బిళ్ళలు వేసుకోవడం కష్టం, ఇబ్బంది అనుకున్నప్పుడు, నాకసలు టాబ్లెట్ లు వద్దు పో అంటుంది, పక్కన పెట్టేస్తుంది, మరలా అలగడం. ఒక పూట అసలు మరచి పోతుంది. ఆ డబ్బా వలన మనకు తెలుస్తోంది, పొద్దున్న వేసుకోలేదు అని. ఏం చేస్తాం, నయానో భయానో ఏదో విధంగా వేయడమే, మనమూ తగ్గము కదా.

అన్నము తిన్నాక పడుకోవద్దు అన్నా కూడా, మా పసి పిల్లకు కోపము వస్తుంది.

మొన్నటిది గుర్తు ఉంది కదా? ఆలయములో, స్వీట్ పానకము వారు ఇస్తే, గబుక్కున తాగి, నేను అడగలేదు నిజముగా, వద్దు అన్నా వారే ఇచ్చారు, అంటుంటే, నవ్వాలో అరవాలో తెలియలేదు. సరే పర్లేదు, మన కాకర వేపాకు ఉన్నాయి కదా అని గమ్మున ఉన్నాను.

ఆ కాకర వేపాకు కషాయాలు కు, వేరే వారు అయితే, వామ్మో తట్టుకోలేను, మమ్మల్ని చంపేస్తున్నారు అని పరిగెత్తే వారు. కానీ ఇంగ్లీష్ మందుతో, వారు చేసుకునేదీ అదే అని తెలిసి కూడా. మా పిల్ల తాగే ప్రతిదీ అంటే ఆ పచ్చి రసాలు, నేనూ తాగుతున్నా అని మరువద్దు. తినగ తినగ వేము, తియ్యగ నుండు సామెత మరువద్దు, మన అలవాటు 6 ఏళ్ళు ప్రాణము నిలిపింది.

మునక్కాయ అంటే చాలా ఇష్టం, కానీ ఒళ్ళు వేడి చేసి, ఆ రాత్రి అంతా నిద్ర పోదు. కడుపు లో ఏదో తిప్పుతూ ఉంది బిగదీసినట్టు, అని అంటుంటే బాధపడుతుంటే, మెంతి నీళ్ళు, గసగసాలు దగ్గర ఉంచుతా. అందుకని, నెల కొకసారే మునక్కాయ కూర అనుకున్నాము.

కానీ వారానికి కూర షాపు కెళ్ళినప్పుడు, మధ్యలో మునక్కాయ కావాలని అంటే మారాం చేస్తే, మనము వద్దు అంటే, అబ్బో ఎంత రోషం కోపం, వద్దు అంటావా అని, ఏం వద్దులే పదా అని, పిల్ల కోపంగా విదిల్చి అంటుంటే, నవ్వాలో ఏడవాలో తెలీదు. కానీ మిగతావి, యంత్రం లా తనే, ముందుకు వెళుతుంది గడియారం ముల్లులా.

అప్పుడు అనిపిస్తుంది, అమ్మ కే ఈ వయసులో ఇంత కోపం ఉంటే, పాపం మా అన్నలు, తమ్ముళ్ళు, మామలు, బాబాయి ల పరిస్థితి ఏమిటి? వాళ్ళ ఇంట్లో వాళ్ళు, ఇంకా కుర్రవాళ్ళు, ఇలా కోపంతో విదిలిస్తూ ఉంటే, పాపం ఎలా ఓర్పు తో సర్దుబాటు చేసుకుంటున్నారో, అని మనసులో బాధ వ్యధ.

ఇంకా ఇలాంటి వి ఎన్నో. ఇది ఆరోపణ ల కోసం కాదు, చిన్న పిల్లలా అలుగుతు ఉంటే, ఒక వైపు నవ్వు, ఇంకో వైపు బాధ. మంచి తల్లి నే, లాలించి బుజ్జగించే అదృష్టం, ఎంతమంది కి వస్తుంది. నిజమైన పసి పిల్లలా తిట్టలేము, కొట్టలేము కదా, పెద్దలు కదా.

తెలుసు కదా ఇక్కడ, పిల్లల ను లేదా 60 పైన పెద్దలు కు కష్టం కలిగితే, పోలీసులు తాట తీస్తారు. అన్ని చోట్లా కెమెరా రికార్డు ఉంటుంది, అందరూ జాగ్రత్తగా ఉండాలి సుమా.

Women's Day is not about praising women for their work, opportunity, needs, but in times of difficulty, sickness, old age, if we stand by them with love, they will not leave us for the rest of our lives. Love should be given and appreciated, the same act we play, will come back to us in the end.

మహిళా దినోత్సవం అంటే, అవకాశం అవసరాలు పనులు కోసం మహిళలను పొగడటం కాదు, కష్టం లో రోగం లో పెద్ద తనం లో, మనం ధృడంగా తోడుగా ప్రేమగా అండగా ఉంటే, వారూ మనల్ని జీవితాంతం వదలరు. ప్రేమ ఇచ్చి పుచ్చుకోవాలి, మనం నటించిన అదే నటన, మనకు వెనక్కు వస్తుంది చివరలో.

That's why women are great, no doubt. Even in all of them, the mothers who raise their children with responsibility and culture are still the greatest. Salutations to all their feet with tears of gratitude.

అందుకే మహిళలు గొప్పవారు, సందేహము లేదు. వారందరూ లో కూడా, పిల్లల ను బాధ్యత గా సంస్కారం తో పెంచే, తల్లులు ఇంకా గొప్పవారు. వాళ్ళందరి పాదాలకు కృతజ్ఞతల కన్నీటితో నమస్కారాలు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,465; 104 తత్వాలు (Tatvaalu) and views 225,070
Dt : 08-Mar-2020, Upd Dt : 08-Mar-2020, Category : General
Views : 1112 ( + More Social Media views ), Id : 391 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : womens day
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content