ఒకసారి కోల్పోయిన నమ్మకం, ప్రేమ, విశ్వసనీయత మరలా ఎప్పుడూ తిరిగి రానివి - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,863,342; 104 తత్వాలు (Tatvaalu) and views 224,668.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఎప్పుడు అయితే ఒక వ్యక్తి మరొక వ్యక్తి పై నమ్మకం కోల్పోయిన, అదే ఆ బంధానికి శాశ్వతమైన ముగింపు అవుతుంది.

ఒకవేళ ఆ వ్యక్తి జీవితంలో మళ్ళీ మరలా తిరిగి వచ్చినా, మనసులో అదే స్ధానం ను సంపాదించలేరు.

ఎందుకంటే ఒకసారి కోల్పోయిన నమ్మకం, ప్రేమ, విశ్వసనీయత, అభిమానం మరలా ఎప్పుడూ తిరిగి రానివి.

నమ్మకం ఎప్పుడూ పోగొట్టుగో కూడదు, అది ఎవరు అయినా సరే అంటే భార్య, స్నేహితులు, బంధువులు, పనివారు, పిల్లలు, ఆఫీసు వారు అయినా.

ఉదాహరణకు నేను, 50 వేల రూపాయలు అప్పు ఉన్నాను అనుకుందాము, ఇచ్చిన మాట ప్రకారం తిరిగి కట్టలేక పోయాను. ఇచ్చిన వారి దగ్గరకు వెళ్లి, చేతులు పట్టుకుని బాధ చెప్పి, అవసరమైతే ఇంటికి తీసుకుని వెళ్లి, మన దౌర్భాగ్యం ను, ఇప్పుడున్న భయంకరమైన పరిస్థితులను, వారికి చూపించాలి వివరించాలి.

అప్పుటికీ వారికి ధైర్యం నమ్మకం రాకపోతే, అందుకు సమానమైన లేదా కొంచెం అటు ఇటు విలువ ఉన్న దాన్ని, అంటే బంగారం ఇవ్వడం లేదా ఓ సెంట్ స్ధలం వారి పేరు మీద, రాయడం చేయాలి. మన బంధం, మంచితనం బట్టి, వారు వద్దు అనవచ్చు, లేదా తీసుకోవచ్చు.

అలా కాకుండా, మన నిర్లక్ష్యం లేదా మోసం లేదా బద్దకం లేదా అహంకారం తో ఎగకొట్టే ప్రయత్నం చేస్తే, మనకు ఇంక అప్పు పుట్టదు లేదా భవిష్యత్తు లో మనం, మన పిల్లలు లేదా మనుమలు, అదే నరకం బాధలు పడాలి తప్పదు. కోటీశ్వరులు ఖర్మకాలి, రోడ్డు న పడిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా.

మాకు తెలిసిన వారు, అందరికీ ధనం ఎగకొట్టి, గత రెండు ఏళ్లుగా హయిగా ఉంటూ, పెద్ద మనుషులు గా చెలామణి అవుతూ, ఇప్పుడు ఎన్నికలలో పుత్రుని నిలబెట్టారు, విచ్చలవిడిగా ఎన్నికలకు ఖర్చు చేసి, ఇంకా సంపాదించాలి అని దురాశతో ఉన్నారు.

అంటే జనం అందరునూ, భగవంతుని, నీతి నిజాయితీ నియమాలను, బంధుత్వం ను, అపహాస్యం చేసారు, గేళి చేసారు, అవమానించారు. ప్రతి ఫలం ఇంకో రోజైనా దక్కించుకుంటారు, తమ కుటుంబ పాప కర్మకు.

అలాగే జీవిత భాగస్వామి దగ్గర కూడా. మనం చేసేవి అన్ని కరెక్టు అని అబద్ధాలు చెపుతూ, ఇద్దరు తో తిరుగుతూ, తాగుతూ, అన్ని చాటుగా దొంగ పనులు, చేస్తూ ఉంటే, అవి బయట పడక తప్పవు. రేపూ వాళ్ళు కూడా అదేవిధంగా చేస్తే, రెండవ మనిషి తట్టుకో గలరా?

పిల్లల కు ఎప్పుడు అయితే, తమ తల్లి దండ్రులు నీతిమాలిన వారు అని పెద్దలు అంటే గౌరవించరని, ఎవరినీ లెక్క చేయరని, అర్థం అవుతుందో, వారూ అదేవిధంగా నడచుకుంటారు. ఇక ఆ పేరెంట్స్ మాట వినరు.

మనము చెప్పే నైతిక హక్కులు కోల్పోతాము. దొంగ ల పిల్లల కు, దొంగ బుద్దులు మాత్రమే వస్తాయి కదా. ఇక ఎవరూ ఎవరిని నమ్మరు ఆ ఇంటిలో. దాని ఫలితాలు, ఆ తల్లి దండ్రులు మరియు ఆ పిల్లలు అనుభవించక తప్పదు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,863,342; 104 తత్వాలు (Tatvaalu) and views 224,668
Dt : 18-Mar-2020, Upd Dt : 18-Mar-2020, Category : General
Views : 958 ( + More Social Media views ), Id : 421 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : trust , love , believe
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content