ఆలయ ధర్మ కర్త, అధికారి ఎంత క్రూర స్వభావం నిర్దయగా ఉండకూడదో, ఓ ఉదాహరణ - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,865,290; 104 తత్వాలు (Tatvaalu) and views 224,877.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

మనము మన స్వభావము నడవడిక ఇంట్లో ఎలా ఉన్నా, దాని కష్ట నష్టాలు మన కుటుంబము, మన ఇరుగు పొరుగు, మన బంధువులే పడతారు. అదే మనము ఒక దేవాలయానికి లేదా సంస్థకు అధిపతి లేదా ఉద్యోగి లేదా వాలంటీర్ అయితే, మన అహంకార అనాలోచిత సంస్కారహీన పరిస్తితికి, ఎందరో ఇబ్బందులు పడాలి.

ఇప్పుడు ఆలయాలు అంటే, తేలిక వ్యాపారానికే మొదటి మెట్టు. వారిలో తగువు వచ్చినా లేదా కొత్త బాబాలు వచ్చినా కూడా, కొత్త ఆలయాలు సొంతముగా కడుతున్నారు, మనము పోతూ ఉంటాము. వారు ధనవంతులు అవుతున్నారు, ఆస్తులు పలుకుబడి పెంచుకుంటున్నారు, రాజకీయాలలో పాల్గొంటున్నారు. దేవుడిని తమ అవసరాలకు వాడుకుంటున్నారు, మనసు భక్తి దయ తరిగిపోతుంది, ఉండేకొద్ది. అసలు ముందే అణకువ లేకపోతే, తర్వాత ఇంకా దిగజారిపోతారు.

ఇప్పుడు కరోనా కోవిడ్ లాక్డౌన్ తో, 10 ఏళ్ళ పిల్లలు మరియు 60 దాటిన పెద్దలు, అత్యవసరము అయితే తప్ప, బయటకు రాకూడదు. గుడి లోపల ఎటువంటి కార్యక్రమము జరుగ కూడదు, జనము నిలబడకూడదు. ఆరు బయట పూజ చేయవచ్చును. కానీ అందరమూ లోపలే నిలవడం, కూర్చోవడం.

మన దేవాలయాల దగ్గర, ఆ పట్టింపు లేకుండా, అందరూ పసి పిల్లలతో పెద్ద వారితో వస్తున్నారు. కొన్ని నియమాలు అందరమూ పాటించము, తెలిసి కూడా. బయట తిరగద్దని చెపితేనే, జనాలు సినిమాలకు పెళ్ళిళ్ళకు మీటింగ్లకు బీచ్ లకు వెళుతున్నారు. కరోనా పెంచుతున్నారు, వీరికన్నా గుడి పదిలం కదా.

మొన్న, మన తెలుగు ఆయన ఒకరు, ఏళ్ళుగా అక్కడ ఉన్నా ఇంత కూడా జాలి భక్తి అర్ధము చేసుకునే గుణం అలవాటుచేసుకోని, గుడి లో వాలంటీర్ లేక ధర్మ కర్త కావచ్చు. అమ్మ, గుడిలో కూర్చుని ఉంటే, బయటకు పంపుతూ, ఇంక తేవద్దు అన్నారు 3 వారాల క్రితం. ఆయనతో గొడవ ఎందుకు అని, లోన వద్దు అంటే పర్లేదు, బయట కూర్చుంటారు లే, రాక తప్పదు, అని నవ్వుతూ వచ్చాము.

3 వారాల తర్వాత, మరలా కనపడ్డారు ఆయన. ఇంక తనకి, కోపము గుర్రు గా ఉంది, సంస్థాదీశుడిని నేను చెప్పినా కూడా, మరలా తెచ్చారు అని. ఇంతలో దురద్రుష్టవశాత్తు గుమ్మము లోపల ఉన్న టైల్స్ మీద ఉన్న నీరుతో, అమ్మ కాలు జారి పడింది, అని ఎవరో చెప్పారు. అవకాశం దొరికింది అని మన దగ్గరకు వచ్చి, ప్రదక్షిణము మధ్యలో ఆపి, గతములో నేను చెప్పినా తెచ్చారు, వెంటనే తీసుకుని వెళ్ళండి ఇంటికి, ఇక తేవద్దు, తల్లి సేవ కన్నా, దైవ సేవ ముఖ్యం కాదు అని, నీతి పాఠం చెప్పారు.

అప్పుడు వాదించడము మంచిది కాదు అని, గమ్మున తీసుకుని వెళ్ళి, కారు గుడి ఆవరణ బయట పార్క్ చేసి, అమ్మను అడిగాము, వెళ్ళిపోదామా బాధగా ఉందా అని. పరవా లేదు, 64 వ వారం జరుగుతున్న 108 లో మిగతా ప్రదక్షిణలు పూర్తి చేసి రా, అప్పుడే వెళదాము, లేకపోతే అరిష్టము అన్నది, చేసేది లేక మరలా వెనక్కి వచ్చి పూర్తి చేసాము. దీనిని మీరు అర్ధము చేసుకుని, అభినందించ లేరు, మన గుడి గొప్ప తనాన్ని పదిమందికి చాటుతుంటే, కలుషితమైన మీకు మీ మనసుకు పట్టదు.

అప్పుడు అతనితో, గట్టి గా చెప్పాము, మీరు చాల అమర్యాదగా అగౌరవంగా అహంకారముతో అధికారముతో, పెద్దవాళ్ళను అవమానిస్తున్నారు. గుడిలో మాట్లాడ వలసిన పద్దతి ఇది కాదు. ఎంతో ఓర్పుతో, నవ్వుతూ చెప్పాలి, ఎదుటి వారి పరిస్తితి అర్ధము చేసుకోవాలి. గుడి లో ఏమి జరిగేది అందరికీ తెలుసు. ఐడీ కార్డులు చూసి, 10 లోపు చిన్నలు, 60 పైన పెద్దలను గేటు బయటనే ఆపాలి. ఇప్పుడు మీరు తలుపులు తీసింది కూడా 4 డబ్బులు వస్తాయని, పూజారులకు సిబ్బందికి ఇవ్వాలి మీ జేబులోనివి తీయకుండా అని, దానిని నేను తప్పు పట్టను, జోక్యం చేసుకోను ఆపను. మీ ఇష్టం, మీ వ్యాపారం.

ఇక రూల్ అంటున్నారు, అసలు గుడి లోపలకు జనము ను, రప్పించ వచ్చా? ప్రభుత్వము బయట పూజలు సేవలు మాత్రమే అన్నది. వాలంటీర్ లు కూడా ఉండకూడదు, వారూ మనుషులే గదా? పూజారి ఒక్కరే చేసుకోవాలి, లేదంటే ఇంకో మనిషి. మిగతా అందరూ, గది బయట ఉండి, సహాయం చేయాలి అంతే.

గుడి లోన, పిల్లలు పెద్దలు, 10 to 20 మంది నిలబడి లేదా కూర్చోని, అరగంట పైన ఉండవచ్చా? వచ్చిన వారు వెంటనే నిమిషములో వెళ్ళే విధముగా, మీరు ఎందుకు చేయడము లేదు? ఎవరైనా పోలీసులకు ఫోన్ చేస్తే, గుడి మూసేస్తారు అని మీకు తెలుసా? మనము ఆ పని చేయగలిగి ఉండి, ఎందుకు గమ్ముగా ఉంటున్నాము? మన సమాజం, అలా చేయకూడదు అని. మరి మీరు ఎందుకు అనవసరముగా, రోషము కోపముతో మాట్లాడుతున్నారు? గుడి మేనేజ్మెంట్ అందరూ, మనకు తెలుసు.

ఇంక పడిన విషయము, వయసుతో కాదు. అమ్మ కు ముందు ఇద్దరు పడ్డారు, వర్షము నీళ్ళతో ఎవరికైనా కాలు జారుతుంది, మనకైనా మీకైనా. అక్కడ మీరు పట్ట వేయలేదు, మీ నిర్లక్ష్యము స్పష్టముగా కనపడుతుంది. ఇంకొకరు పడకుండా, ముందు దానిని వేయించండి, తుడుచుకునే టవల్ కాదు, రబ్బరు పట్ట జారకుండా, టైల్స్ మీద అని బుద్ది చెప్పాను. అది ఫొటొ తీసి, మీ మీద కేసు వేసి, నష్టపరిహారం అడగవచ్చును. కానీ చేయము, మనవారు కాబట్టి.

అమ్మ పడిన తర్వాత, నొప్పితో బాధతో కూర్చుని ఉంటే, ఒక గంట తర్వాత , నొప్పి తగ్గుంది అని కూర్చోపెట్టాను, ఆమె అనుమతితో. మీరు, అంత నొప్పి లో కూడా, వెనకా ముందు పరిస్తితి ఆలోచన చేయకుండా, బయటకు తీసుకుని వెళ్ళమన్నారు అంటే, మీకు మనసు దయ జాలి పెద్దలు అంటే గౌరవము ఉందా? తల్లి బాధ మనసు, మీకు తెలుసా?

ఆమె నాతల్లి కాదు, నా కూతురు. 7 ఏళ్ళు గా ప్రతి శని వారము, కూతురు 4.30 ఉదయము లెగిచి, తల స్నానము చేసి, అయ్యా దిక్కు లేని వారికి, దిక్కు దేవుడే, మనకు చుట్టము బంధువు అయిన, దేవ దేవుడు ఆయన దగ్గరకు పోదాము ప్రతి శని వారము అంటే, ఏమి చేయాలి కొడుకుగా/ తండ్రిగా ? మీరు చెప్పండి? మీకు ఆ మంచి తనాన్ని అర్ధము చేసుకునే అభినందించే గుణం ఎటూ లేదు, అవమానించి పాపం ఎందుకు పొందుతారు?

చంద్ర మండలానికి, అంగారక గ్రహానికి, తీసుకుని వెళ్ళమన్లేదు కదా? అందుకే వచ్చి, బయట నే తిరిగి, బయటనే వెళ్ళి పోతున్నాము. అందరికీ చూసే వాళ్ళు, ఇంటి దగ్గర ఉంటారా? కనీసము మీ ప్రసాదాలు హారతులు కూడా, మేము తీసుకోవడము లేదు. అని, అన్ని విధాలు గా నచ్చ చెప్పాము. మనిషి సమాధాన పడలేదు.

రిసెప్షన్ లో ఉన్న, మేనేజ్మెంట్ వారికి, ఇది మొత్తము చెప్పాము. వారు, చలికి అమ్మ కారులో ఉందని, లోనకి తెమ్మన్నారు వెచ్చగా ఉంటుంది అని. కానీ మనము తీసుకు రాలేదు, ఇక వెళుతున్నాము అని. ఇది విన్నాక, ఆయన అంత క్రురముగా ఉండకూడదు, అతని బుద్ది మాకూ తెలుసు, ఓకరి మీద ఒకరము ప్రభుత్వానికి కంప్లైంట్ చేస్తే, గుడి మూత పడుతుంది.

ఎన్నో ఏళ్ళు గా మీరు మాకు ఫోటో వీడియోలు తో, ప్రమోట్ చేస్తూ సహకరిస్తున్నారు. నేను చెప్పాను అని చెప్పి, ఈ సారి, పెద్ద గుడిలోనే కూర్చోపెట్టండి. పర్లేదు. ఆయన తన స్వభావముతో, తల్లికి మీరు చేస్తున్న సేవను, సరిగ్గా అర్ధము చేసుకోలేదు అని చెప్పారు. మొత్తము మేనేజ్మెంట్ కు కూడా, ఇది తెలియపరుస్తాను అని చెప్పారు.

చూద్దాము, తర్వాతి వారము ప్రదక్షిణ కొనసాగుతుందో, అదే చివరది అవుతుందో. గతము లో కొందరు అడిగితే, ఇదే సమాధానము చెప్పాము, ఎప్పుడు ఆపాలో ఆ దేవుని ఇష్టము, మన చేతిలో లేదు అన్నాము. మరి ఆయన ఇచ్చ, వచ్చే వారము చూద్దాము, అని రాము గోపీ తో చెప్పాడు.

చూసారా, గమ్ముగా, మన కష్టాలు మనము పడుతూ, ప్రశాంతముగా, దైవ ప్రదక్షిణలు చేయడానికి కూడా, పరిస్తితి అర్ధము చేసుకుని, మనుషులు సహకరించరు కదూ.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,865,290; 104 తత్వాలు (Tatvaalu) and views 224,877
Dt : 02-Jan-2021, Upd Dt : 02-Jan-2021, Category : General
Views : 918 ( + More Social Media views ), Id : 912 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : temple , dharma karta , officer , volunteer , example , cruel nature , disrespect
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content