పవన్ ను అగౌరవపరుస్తున్న తెలుగు బీజేపీ, జనసేన ఓడినా గెలిచినా ఇతరుల రాత మారుస్తుంది - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,328; 104 తత్వాలు (Tatvaalu) and views 225,143.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఆంధ్రా బీజేపీలో, సరిగ్గా ప్రజల ముందు, మాట్లాడుతూ మెప్పించి నెగ్గే, ధైర్యం దమ్ము ఉన్న నాయకులు ఒకరూ లేరని, ఆంధ్రా ప్రజలకు అందరికీ తెలుసు. అది పార్టీకు తెలుసు, ఉదాహరణకు ఒక్క ఎంపీ ఎమ్మెల్యే సీటు కూడా లేదు.

గతంలో ఇతర పార్టీలతో కలసి పోటీ చేసి, ఎమ్మెల్సీ స్ధానాలు తీసుకుని, నెట్టుకు వస్తున్నారు, ప్రజలకు దూరంగా ఉంటూ. మోదీ హవాలో కూడా, ఆంధ్రా లో ఎదగలేకపోయింది అంటే, ఆ తర్వాత అసలు ఆశ ఉంటుందా?

స్ధానిక సమస్యలు ఎక్కడ అయినా ప్రస్తావించారేమో, అసెంబ్లీ మరియు పార్లమెంటు బీజేపీ ఫేస్బుక్ పేజీలు, మీరే చూడండి. కనీసం స్థానిక నాయకుల, ఫోటోలు కూడా పెట్టడం లేదు. కేంద్ర లేదా రాష్ట్ర నాయకుల భజన తోనే సరిపోతుంది, నిండి పోతుంది ఆ పేజీలు.

పార్టీ కి విశ్వాసం గా ఉంటూ, కేవలం పార్టీ పదవులు అనుభవిస్తున్నారు, కనీసం తమ పార్టీ బాగుకై పాటుపడకుండానే. టార్గెట్ ఇచ్చి, ఇన్ని స్థానాలు సాధించండి, అని అరచి, నెట్టేవారూ లేరు. ఆంధ్రా లో ఎలా వృద్ధి చేయాలో ఆలోచన చేయకుండా, వారు సొంతం గా అడుగులు వేయకుండా నే, కాలం నెడుతున్నారు, మోదీ అమిత్షా పేర్లు చెప్పుకుని.

జన బలం లేని, ఆంధ్రా బీజేపీ నాయకులు లో కొంతమంది చంద్రన్న కు ఇంకొంతమంది జగనన్న కు సపోర్ట్ గా ఉంటూ, పార్టీని ఆంధ్రా లో ఎదగనీయకుండా చేస్తున్నారు. వైకాపా తెదేపా ఆరోపణలు బట్టి, ఏ నాయకులు ఎటు మొగ్గు అనేది, మీరే నిర్ణయం చేసుకోవచ్చు. 2019 లో, 0.84 రాష్ట్ర ఓటింగ్ శాతం ఉంది.

జనసేన కు కనీసం ఒక అసెంబ్లీ సీటు ఉంది. 2019 లో, 6.78 రాష్ట్ర ఓటింగ్ శాతం ఉంది. సొంతం గా గెలవకపోయినా, ఎన్నికల ఫలితాలు మార్చే సత్తా ఉంది, అని గత ఎన్నికల్లో తెదేపా అంగీకరించింది.

ఎందుకంటే 50 స్ధానాలు లో, జనసేన ఓట్లు తెదేపా కు వచ్చినట్టు అయితే, ఈరోజు బలమైన ప్రతిపక్షంగా తెదేపా ఉండేది. వైకాపా కు 151 రావు, ఏకపక్ష గెలుపు ఉండదు. చంద్రన్న (39.17%) ను జీరో చేసి, జగనన్న (49.95%) ను హీరో చేసింది ఎవరు, పవనే కదా ఆ 50 స్థానాలతో.

తిరుపతి ఎంపీ సీటు కోసం, ఢిల్లీ కి పవన్ ఎందుకు వెళ్ళారో తెలీదు, పడిగాపులు ఎందుకు, ఆత్మాభిమానం తాకట్టు పెట్టి, ఎవరు తప్పుడు సలహాలు ఇస్తున్నారో తెలీదు.

జనసేన అభ్యర్థి పేరు ని ప్రకటిస్తామని, వార్త బయటకు వదిలితే చాలు, వారే వస్తారు దారిలోకి. తెలంగాణ లో సహకరించాము, ఇక్కడ మాకు బలం ఉందని చెప్పవచ్చు. ఢిల్లీ నాయకులు హైదరాబాద్ ఎన్నికలకు ఎటూ వస్తారు, ఇక్కడనే కలవచ్చు.

బీజేపీ నాయకులు వచ్చి, ఓటింగ్ శాతం ఎక్కువ ఉన్న, పవన్ సహాయం సలహాలు తీసుకోవాలి. ఎందుకంటే వైకాపా, తెదేపా లను దాటి, బీజేపీ సొంతంగా గెలవలేదు, జనసేన 4 వ అభ్యర్థి గా ఉంటే అసలు గెలవదు. త్రిముఖ పోటీ కూడా, వైకాపా కే లాభం చేయవచ్చు.

తిరుపతి ఎంపీ ఎన్నికల గత బీజేపీ ఓటింగ్ చూసే, సొంతంగా 2019 లో 1.22%, 2014 తెదేపా అండతో 44.76%, 2009 లో సొంతముగా 2.04% తో గెలిచారు.

ఆంధ్రా బీజేపీ ఏమి చూసుకుని ఇలా చేస్తోందో, స్ధానిక సమస్యలు కు పోరాడే, జనాకర్షణ కలిగిన నాయకులు లేరని వారికి తెలుసు. అనవసరము గా జనసేన ను దూరము చేసుకుని, తెదేపా లాగా నష్టపోతూ, వైకాపాకు లాభం చేస్తారేమో చూడాలి.

తెలంగాణా బీజేపీ కూడా, మాకు ఎవరి పొత్తు వద్దు హైదరాబాద్ ఎన్నికల్లో అంది, అక్కడ కూడా ఇదే సిద్దాంతము, జనసేన్ అభ్యర్ధులు గెలవకపోయినా, బీజేపీ రాత మారుస్తారు అని వారికి తెలిసి కూడా, పొత్తు వద్దని వ్యర్ధ ప్రేలాపనలు చేస్తున్నారు. అయితే, పార్టీ పెద్దలు వచ్చి సరి చేసారు, పవన్ మద్దతు ఇచ్చారు, ఉచితముగా, ఏమీ ఆశించకుండానే.

ఆంధ్రా బీజేపీ ఇలా ఉన్నా, కనీసము కేంద్ర బీజేపీ అయినా, ఇక్కడ జరుగుతున్న నాటకాలను, పట్టించుకునే స్థితిలో లేదు. దానివలన బీజేపీకే నష్టము.

వచ్చే ఎన్నికల్లో, జగన్ లాగా, పవన్ కు ఒక్క అవకాశము ఇచ్చి చూద్దాము అనుకుంటే, చాలా రాతలు మారిపోతాయి. ఈలోపు గా జనసేన, పూర్తిగా సమయము వెచ్చించి సంస్థాగతముగా, స్థానిక నాయకులకు ట్రైనింగ్ ఇచ్చి, ముందుకు నడపాలి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,328; 104 తత్వాలు (Tatvaalu) and views 225,143
Dt : 27-Nov-2020, Upd Dt : 27-Nov-2020, Category : Politics
Views : 856 ( + More Social Media views ), Id : 828 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : telugu , andhra , telangana , bjp , disrespecting , pawan kalyan , janasena , change , result , tdp , ycp
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content