సెలబ్రటీస్ తో ఫోటోలు కాదు, మన సొంత అమ్మా నాన్నలను, గొప్ప హీరోలు గా వర్ణిస్తూ - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,538; 104 తత్వాలు (Tatvaalu) and views 225,076.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

మనము చేసే ఏ పనిలో కూడా, ఆ పని యొక్క మోహములో మాయలో వ్యామోహములో పడకూడదు, మనము చేసే పని, మనము నిజాయితీతో చేయాలి, ఫలితము తిట్లు పొగడ్తలు దేవునికి వదిలేయాలి.

మాటలతో పాటు గా, ఆచరణలో కూడా నిజాయితీ ఉండాలి, త్రికరణ శుద్దిగా, నష్టపోయినా పతనమైనా కూడా.

మనము మీడియాతో ఉన్నప్పుడు లేదా రాజకీయాలలో, ఉద్యోగములో, సమాజములో, పెద్ద వారిని నాయకులను హీరోలను కలిసినప్పుడు, ఎగబడి వెంటబడి వారికి ఇబ్బందులు కలిగిస్తూ, ఫోటోలు సెల్ఫీలు తీసుకుని, మనము గొప్పగా సోషల్ మీడియాలో పెట్టుకుంటాము, పది మందికి గొప్పగా చూపించుకుంటాము, అదేదో పెద్ద ఘన కార్యము అయినట్లు గా, ఏదో సాధించినట్లుగా.

ఆ పెద్దలు కలిసే లక్ష మందిలో, మనము ఒకరము, మనకు విలువ లాభము ఏముంది? మనల్ని గుర్తు పడతారా, ఫోన్ చేస్తే పలుకుతారా?

ఇది అందరికీ ఓ అలవాటు, ఓ రకము గా పిచ్చి చాలామందికి. వారి సొంత అమ్మా నాన్నలను, గొప్ప హీరోలు గా వర్ణిస్తూ, వారి ఫోటోలు మాత్రము, వారి సోషల్ మీడియాలో పెట్టరు, సొంత వారికి క్రుతజ్ఞతలు తెలుపరు.

గతములో అంటే 10 ఏళ్ళ ముందు, మీడియా పని మీద ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, గొప్ప ఫేమస్ నాయకులను కలిసే అవకాశము, అలాగే ఇంటర్వ్యూ చేసే అవకాశము వచ్చింది, కానీ ఆ అవకాశము వినియోగించుకోలేదు.

గతము కాబట్టి, ఇప్పుడు చెపుతున్నాము, కుర్రకారుకు సెల్ఫీల పబ్లిసిటీ పిచ్చి తగ్గాలి అని. సోషల్ మీడియాలో, ఇంట్లో వారి, ఫోటోలు పెట్టకండి. రాజకీయాలు పదవిలో ఉన్నవారికి తప్పదు, సామాన్యులము, మనకెందుకు పబ్లిసిటి?

దూరము గా ఉండి, నాయకులు హీరోలతో, వారి ఫోటోలు తీసుకుని వచ్చాము. అవకాశము ఉన్నా కూడా, ఎవరితో కూడా కలసి, కనీసము ఒక్క ఫోటో కూడా దిగలేదు. ఎందుకంటే అలా దిగితే, అప్పుడు మనము కూడా ప్రాపంచిక మోహములో పడినట్లే.

హాలీవుడ్ ఇంగ్లీష్ సినిమా అవతార్ చూశారా, దాని డైరెక్టర్ జేంస్ కామెరూన్, గొప్ప పేరు ఆయనకు ప్రపంచము అంతా, లింక్ లో ఫోటో చూడండి. ఇంటర్వ్యు టెంట్ లో తీసిన ఫోటో చూడండి, వారిని టాగ్ కూడా చేసి ఉంది, కేవలము మీడియా కే అనుమతి. ఇంకా చాలా మంది సెలెబ్రటీలు వచ్చారు, ఆ కార్యక్రమానికి. link.

అలాగే, ఒబామాతో క్రిస్మస్ మీటింగ్ లో అవకాశం వచ్చింది, కానీ మంచు వర్షము వలన వెళ్ళ లేకపోయాము.

మిలటరి షిప్, హెలికాప్టర్ లో ప్రయాణం అవకాశం వచ్చింది, వెబ్సైట్ లో ఉన్నాయి ఫోటోలు వీడియోలు.

ఆ తర్వాత, హిల్లరీ క్లింటన్ తో, మీటింగ్ పర్మిషన్ వచ్చింది. మీకు గతములో లింక్ పంపాను కూడా, వెబ్సైట్ లో చూడవచ్చును.

ఇక మన తెలుగు లో అనసూయ, బాలక్రిష్ణ, ఆలి, గాయకులు, టీవీ తారలు, ఇంకా చాలా మంది సినిమా సెలబ్రటీస్ తో అవకాశం వచ్చినా, దూరము గా ఉండి ఫోటోలు వీడియోలు తీసుకున్నామే గానీ, దగ్గరకు వెళ్ళే అవకాశం ఉన్నా కూడా, ఒక్క ఫోటో వారితో కలసి తీసుకోలేదు, 10 ఏళ్ళు గా.

అలాగే రాజకీయ నాయకులు మన దగ్గర ఊరికి వచ్చి వెళ్ళారు, ఎవరితో ఫోటోలు ఎప్పుడు లేవు. వారిని తక్కువ చేయడము కాదు, మనము మోహములో పడి ఫోటోల పిచ్చి పెరగకూడదు, అని మాత్రమే.

మీడియా లో లేదా సమాజములో సామాన్య వ్యక్తులు గా, మనపని, వారి గురించి మంచి చెడు రాయడం వరకే, అదీ వారి మంచి కోసం, మన ప్రజల మంచి కోసం, ఎవరినీ అవమానించ నవసరము లేదు. వారితో కలసి ఫోటోలు దిగి, అదేదో గొప్పగా అనుకోవాల్సిన పని లేదు.

ముందు ఫోటోలు దిగి గొప్పగా చెప్పాల్సింది, కని పెంచిన మన సొంత తల్లి దండ్రుల గురించి, ఆ తర్వాత ఆ దైవము గురించి మాత్రమే.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,538; 104 తత్వాలు (Tatvaalu) and views 225,076
Dt : 05-Mar-2021, Upd Dt : 05-Mar-2021, Category : General
Views : 902 ( + More Social Media views ), Id : 1006 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : tell , show , mom , dad , great heroes , photos , celebrities , avatar , james camaron
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content