Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 నిమిష చదువు సమయం.
* వైసీపీ, టీడీపీ నాయకులను, దుమ్ము దులిపారు
* లాక్ డౌన్ తర్వాత, కేసులు పెరిగాయి, కాని మరణించే సంఖ్య తక్కువ
* దేశములో స్వాభిమానము, మనకు మనమే అన్ని తయారు చేసుకోవాలని
* జగన్ చేసిన ఇసుక ప్రయోగాలు అట్టర్ ప్లాప్
* చంద్రబాబు అబద్ధాల కోరు, చిన్నప్పటినుంచి అలవాటు
* టీడీపీ చేర్చుకుందని, అస్సెంబ్లీకి రాని జగన్, ఇప్పుడు అదే పని
ఏపీలో కొన్నిరోజులుగా జరుగుతున్న విషయాలు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. జనసేన నాయకులతో కలసి, విలేఖరుల సమావేశములో, ఇరు పార్టీలను అంటే పాలక మరియు ప్రతిపక్ష టీడీపీ నాయకులను, దుమ్ము దులిపారు.
వీర్రాజు గారు, మొహమాటం లేకుండా, ఉన్నది ఉన్నట్లు గా , గట్టిగా మాట్లాడుతారు. అందుకే అంత గుర్తింపు ఉండటం లేదు ఏమో అనిపిస్తుంది. టీడీపీ తో ఉన్నప్పుడు కూడా, కుండ బద్దలు కొట్టిన విధంగా, కడిగేస్తారు ఏ విషయమైనా. ఆంధ్రా బీజేపీ ఫేస్బుక్ లో కూడా, వారి వివరాలు వార్తలు ఎక్కువ ఉండవు.
వీడియో లో వారి మాటలు వినండి, బయట మనం వినని చాలా విషయాలు ఉన్నాయి. జేసీ గారి అనంతపురం ఊళ్ళో సంగతులు కూడా చెప్పారు.
ఇప్పుడు కన్నా గారు, గట్టిగా ఉన్నారు. అరెస్ట్ లు కరెక్టే గానీ, అన్నింటి లోనూ జరగాలని కోరారు.
* లాక్ డౌన్ సడలించిన తర్వాత, కేసులు పెరిగాయి, కాని మరణించే వారి సంఖ్య మనకు తక్కువగా ఉంది, ఇతర దేశాలతో పోలిస్తే.
* దేశములో స్వాభిమానము పెరిగింది, మనకు మనమే అన్ని తయారు చేసుకోవాలని. మనమే మందులు ఇతర దేశాలకు పంపాము.
* ప్రపంచములోని అన్ని దేశాలకు, నమ్మకమైన మేధస్సు గల దేశముగా, ఈ కరోనా సమయములో వెలుగులోకి వచ్చింది, అది మంచి పరిణామము.
* కేంద్రం, లక్ష డెబ్భయ్ వేల కోట్ల మొదటి పాకేజ్ ఇచ్చారు.
* చంద్రబాబు హయాంలో, ఇసుక మోసాలు ఉన్నా, కాస్త తక్కువకు దొరికింది, ఇప్పుడు ఇంకా విపరీతముగా ఉంది. గ్లోబల్ టెండర్ పిలవండి. ఈ సొమ్మంతా ఎవరు తింటున్నారని ప్రశ్నించారు. జగన్ చేసిన ఇసుక ప్రయోగాలు అట్టర్ ప్లాప్ అయ్యాయని సోము వీర్రాజు విమర్శించారు.
* ఇదొక్కటే కాదు... ఇళ్ల స్థలాలలో అవినీతి జరుగుతోంది అని జగన్ సర్కారుపై బీజేపీ నేత సోము వీర్రాజు విరుచుకుపడ్డారు.
* చంద్రబాబు పచ్చి అబద్ధాల కోరు అని, చిన్నప్పటినుంచి అలవాటు అని, కులానికి, నేరానికి ఏమిటి సంబంధం అని ప్రశ్నించారు.
* నాడు టీడీపీ చేర్చుకుందని, అస్సెంబ్లీకి రాని జగన్, ఇప్పుడు అదే పని చేస్తున్నారు. ప్రలోభాలు అంటే ఏమిటో బాబు చెప్పాలి. గనులు ఉన్నవారిని, ఫైన్ ల తో, తమ వైపుకు తిప్పుకుంటున్నారు.
* తుక్కు లారీ కొని, బస్సులు చేసారు, తమ తప్పు లేదు అంతా, అధికారులదే అంటున్నారు, జేసీ సోదరులు. ఎవరు అధికారములో ఉంటే, వారి వైపు చేరుతున్నారు.
* మోదీ కుటుంబ పాలన లేకుండా, తాను గొప్ప అనకుండా, దేశము గొప్ప అన్నారు. రాష్ట్రములో, టీడీపీ వైసీపీ లో కుటుంబ పాలన జరుగుతుంది.
* బీసీ అయినందునే అచ్చెన్నాయుడ్ని అరెస్ట్ చేశారన్న టీడీపీ వ్యాఖ్యలపై స్పందిస్తూ, కుల పార్టీలను కూకటి వేళ్లతో సహా పెకలిద్దాం అన్నరు. చంద్రబాబు హయాంలో కులస్తులకు పెద్దపీట వేశారని, దాన్ని జగన్ రెట్టింపు చేశాడని సోము వీర్రాజు విమర్శించారు.
* ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను పక్కనబెట్టి, బీజేపీ జనసేనకు అవకాశం ఇస్తే ఏపీ పురోగతి వైపు పయనిస్తుందని అన్నారు.
మిగతా మాటలను వీడియోలో వినండి చూడండి.
Sri, Telugu ,
10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 958 General Articles, 46 Tatvaalu
Dt : 14-Jun-2020, Upd Dt : 14-Jun-2020, Category : Politics
Views : 384
( + More Social Media views ), Id : 16
, State : AP/ Telangana (Telugu)
, Country : India
Tags :
Somu Veerraju ,
Chandrababu ,
Atchannaidu ,
Andhra Pradesh ,
Telugudesam ,
YSRCP ,
BJP ,
Janasena ,
JC Divakar reddy
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments