Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. సాత్వికులు తల్లి దండ్రులను దేవుని గౌరవించే వారు, రోజూ మన వాట్సాప్ చూడటం మానరు, తప్పో ఒప్పో స్పందిస్తారు, మనవన్ని నచ్చాలని ఏమీ లేదు. అలాగే తమ సొంత విషయాలు సాధనలు కూడా, వాట్సాప్ లో అందరితో పంచుకుంటారు.
మన గాంధారి సిండ్రోం కధనం, సోషల్ మీడియా గ్రూపుల్లో, చాల మందికి నచ్చి షేర్ ల మీద షేర్ లు చేస్తున్నారు, అభినందిస్తున్నారు. తిట్టెవారూ ఉంటారు సుమా, అందుకే అవన్నీ దేమునికే. ఆయన చెప్ప మన్న మాటలు చెప్పడం, రాయమన్న అక్షరాలు రాయడం వరకే, మన పని, నిమిత్త మాత్రులం, ఎవరికి చేరాలని ఆయన సంకల్పం ఉందో వారికి ఎటూ చేరతాయి.
గతాన్ని మరువకుండా, ఏరు దాటాక తెప్ప తగలేయకుండా, వృద్ధులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకుండా ఆదరించాలని, ఇప్పుడు మనము అనుసరించిన మార్గాన్నే, ముందు ముందు మన పిల్లలు, తర్వాత తరాలు, ఆచరిస్తారని చెప్పే, మనసున్న మనుషులకు కన్నీళ్ళు తెప్పించే, సందేశాత్మక ఉత్తమ చిత్రం ఇది.
మీరు మరలా మరలా చూడాలి, ఇప్పుడు ఇంత కన్నా ఘోరముగా జరుగుతున్నాయి. ఎందుకంటే, తల్లి దండ్రులకు ధన మరియు ప్రాపంచిక మోహములో చిక్కుకుని, బిడ్డల లాలనా పాలనా సంస్కారం గాలికి ఒదిలేసారు.
ప్రేమాభిషేకం, బెబ్బులి పులి, సర్దార్ పాపారాయుడు లాంటి ఎన్నో ఉత్తమ చిత్రాల మేటి దర్శకేంద్రుడు, సినీ పరిశ్రమ కు పెద్దలా ఉన్న, స్వర్గీయ దాసరి నారాయణరావు గారి సినీ ప్రస్థానం (దర్శకునిగా), ఈ చిత్రంతోనే ప్రారంభమైంది. అఖండ విజయం సాధించి, కొత్త వొరవడి స్రుష్టించి, దాసరికి బంగారు బాట వేసింది.
ఎస్వీ రంగారావు తండ్రి పాత్ర నటన అమోఘము, ఆయనకు మంచి పేరు తెచ్చింది. తల్లి గా అంజలి, కష్టాలకు కన్నీళ్ళకు నిలయం.
నీ అయ్యకు చేసిన ఈ మర్యాద, రేపు నీకు చెయ్యాలి కదయ్యా - అని కొడుకు తండ్రితో అనడమే చిత్రంలోని ప్రధాన కథాశం.
పిల్లలు మన చర్యల్ని, నడిచే మార్గాన్ని గమనిస్తూ ఉంటారు, అదే ఆచరిస్తారు అని చెప్పే చిత్రం, ఒక కొత్త ఒరవడికి నాంది పలికి విజయవంతమైంది.
కష్టపడి కొడుకుని, సత్యనారాయణ ను, చదివిస్తే, ఇంట్లో అత్త కూతురికి కడుపు చేసి మోసం చేసి, పట్నం లో ధనవంతుల పిల్లను, తానూ కోటీశ్వరుడు ను అని అబద్దాలు చెప్పి, తల్లి తండ్రికి తెలియకుండా పెళ్ళి చేసుకుంటాడు. పెళ్ళి సమయానికి వచ్చిన తండ్రిని, ఎవరో నాకు తెలీదు అని అవమానించి, గెంటేస్తాడు.
అన్ని పోగొట్టుకుని, పట్నం వచ్చి, కొడుకు ఇంట్లో నే పని మనిషిలా చేరుతుంది, తప్పనిసరి పరిస్తితి లో.
మనవడు రాజబాబు, తన తల్లి తండ్రికి ఎలా బుద్ది చెప్పాడు. కళ్ళు లేని తాతను, రోగం కష్టాల తొ ఉన్న నాయనమ్మలను ఎలా గౌరవించాడు అనేది, మీరు సినిమాలో ఈ లింక్ లో చూడాలి, ఇంకో 100 ఏళ్ళకైనా, ఈ సినిమా పేరు అందరూ చెప్పుకుంటూనే ఉంటారు.
ఏ పసివారికి అయినా ఆదిగురువు కన్న తల్లియే కదా! తల్లి, తన బిడ్డలకు ఎలా మంచి నేర్పాలో, ఈ పాటలో చూడండి - తండ్రి మాటకై కానకు, తరలిపోయే రాఘవుడు అందుకే ఆ మానవుడు, అయినాడు దేవుడు.
పోయినాక ఇంటికి లేదా వల్ల కాటికి కూడా రాని కొడుకు కూతుళ్ళ గురించి, అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మ తృప్తి కై మనుషులు ఆడుకొనే నాటకం అని, మన అవసర అవకాశ నటన బంధాలను చీల్చి చెండాడారు ఈ పాటలో.
సోమ మంగళ బుధ, పాటలో మిత సంతానం కష్టాలు నష్టాలు చెపుతూ, తండ్రికి కొడుకు బుద్ది చెపడం గురించి బాగా రాసారు/ పాడారు - బాబూ, బాబూ, నీకెందుకురా ఆ గొయ్య. నీ అయ్యకు చేసే ఈ మర్యాద, రేపు నీకు చెయ్యాలి కదయ్యా.
ఏమిటో ఈ వింత లోకం అనే పాటలు, మత్తు లో ఉండి చావుకు కూడా రాని పిల్లలను ఎండగట్టారు - భోగభాగ్యములు వలచిన కొడుకు, పుట్టినగడ్డను మరిచాడు, ఆలి చేతిలో కీలు బొమ్మయై, అందలం ఎక్కి కులికాడు.
1) గానం: సుశీలమ్మ
ఈనా..డే..., బాబు నీ పుట్టిన రోజు
ఈ.. ఇంటికే ...., ఈ ఇంటికే కొత్త వెలుగు వచ్చిన రోజు
ఈనా..డే.., బాబు నీ పుట్టిన రోజు
చిన్ని బాబు ఎదిగితే కన్నవారి కానందం..
నెలవంక పెరిగితే, నింగికే.. ఒక అందం
చుక్కలు వేయెందుకు, ఒక్క చంద్రుడే చాలు 2
తన వంశం వెలిగించే, తనయుడొకడే పదివేలు ||ఈనాడే బాబు||
కన్నవారి కలలు తెలుసు కో..వా..లి
ఆ కలల కంట నీరు పెడితే, తుడవా.లి - 2 సార్లు మొత్తము
తనకు తాను సుఖపడితే తప్పుగా.. కున్నా..
తన వారినీ సుఖపెడితే, ధన్యత ఓ నాన్నా ||ఈనాడే బాబు||
తండ్రి మాటకై కానకు, తరలిపోయే రాఘవుడు
అందుకే ఆ మానవుడు, అయినాడు దేవుడు
తల్లి చెరను విడిపించగ, తలపడె ఆ గరుడుడు
అందుకే ఆ పక్షీంద్రుడు అంతటి మహనీయుడు
ఓ.. బా..బు ....నువ్వు, ఆ బా..ట నడవాలి.... 2
భువిలోన నీ పే..రు, ధ్రువతారగ వెలగాలి, ధ్రువతారగ వెలగాలి ||ఈనాడే బాబు||
2) అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం
ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం.. వింతనాటకం 2
చరణం 1 :
ఎవరు తల్లి ఎవరు కొడుకు, ఎందుకు ఆ తెగని ముడి
కొనవూపిరిలో ఎందుకు అణగారని అలజడి - 2 లైన్లు 2 సార్లు
కరిగే కొవ్వొత్తిపై, కనికరం ఎవ్వడికీ.. ఎవ్వడికీ
అది కాలుతున్నా 2, వెలుగులే కావాలి అందరికీ. . అందరికీ ||అనుబంధం ఆత్మీయత||
శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ, ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి
చరణం 2 :
కొడుకంటూ, నీకూ వొకడున్నాడూ, వాడు గుండెను ఏనాడో, అమ్ముకున్నాడు
నిన్ను కడసారైనా చూడ రాలేదూ, వల్లకాటికైనా వస్తాడను ఆ.శలేదూ
ఎవరమ్మా వినేది, నీ ఆత్మఘోషనూ - ఏతల్లీ కనగూడదు, ఇలాంటి కొడుకునూ
ఇలాంటి కొడుకునూ ||అనుబంధం ఆత్మీయత||
చరణం 3 :
కానివారి ముచ్చటకై, కలవరించు మూఢునికీ
కన్నవారి కడుపుకోత, ఎన్నడైనా తెలిసేనా
తారాజువ్వల వెలుగుల, తలతిరిగిన వున్మాదికీ
చితిమంటల చిటపటలు వినిపించేనా? చితిమంటల చిటపటలు వినిపించేనా?
||అనుబంధం ఆత్మీయత||
3)
గానం : బాలు, ఎల్.ఆర్.ఈశ్వరి
సోమ మంగళ బుధ, గురు శుక్ర శని ఆది 2
వీడికి పేరేదీ, పుట్టే వాడికి చోటేదీ..2 ||సోమ మంగళ||
పెంచేదెట్లా.., గంపెడు మంద
పెట్టలేక మన పని గోవిందా 2
కలిగిన చాలును, ఒకరూ ఇద్దరూ
కాకుంటే ఇంకొక్కరు 2 ||సోమ మంగళ||
కాదు.. కాదు కాదు, ఒకరూ, ఇద్దరూ, ముగ్గురు
కనవలసిందే ఎందరినైనా
బుద్దుడో, జవహరో గాంధీజీ, కాకూడదా ఇందెవరైనా
ఔతారౌతారౌతారు బొచ్చెలిచ్చి,బజారుకు తరిమితె
ఔతారౌతారౌతారు, బిచ్చగాళ్ళ సంఘానికి
నాయకులౌతారౌతారౌతారు, తిండికి గుడ్డకు కరువై
కడుపుమండి విషం తిని ఛస్తారు ||సోమ మంగళ||
ఎగిరే పక్షికి ఎవడాధారం, పెరిగే మొక్కకు ఎవడిచ్చును సారం 2
దా..రిచూ..పునం..దరికి వాడే 2 నారుపోసిన వాడు, నీరివ్వక పోడు
ఎవరికి వారే ఇట్లనుకుంటె, ఏమైపోవును మనదేశం
ఎప్పుడు తీరును దారిద్ర్యం, ఇంకెప్పుడు కల్గును సౌభాగ్యం
కనాలందుకే.. మిత సంతానం, కా..వాలిది అందరికి ఆదర్శం
అయ్యా అయ్యా ఎందుకు గొయ్య
నాకొక పీడర మీ తాతయ్య, చావగొట్టి పాతెయ్యడానికే ఈ గొయ్య
బాబూ, బాబూ, నీకెందుకురా ఆ గొయ్య
నీ అయ్యకు చేసే ఈ మర్యాద, రేపు నీకు చెయ్యాలి కదయ్యా
తాతకు వారసుడు మనవడేగా, ఎప్పటికైనా తాతా మనవడు ఒకటేగా.. ఒకటేగా
పెద్దలనే సరిదిద్దేవాళ్ళు, ఇలాంటి ఒకరిద్దరు చాలు
కనిపెంచిన వాళ్ళు తరిస్తారు, దేశానికే పేరు తెస్తారు - వారే పేరు తెస్తారు ||సోమ మంగళ||
4) ఏమిటో ఈ లోకమంత, తందానా తానె తందనా,
ఎంతకూ అంతు పట్టని వింత, తందానా తానె తందనా,
గడ్డిమేసిన గోవులేమో, కమ్మని పాలిస్తుంటాయి,
పాలుతాగి పెరిగిన కొందరు, పచ్చి విషం కక్కుతుంటారు ||ఏమిటో ఈ||
దేవా .. దేవా..
కన్నకొడుకని నమ్ముకుంటే, వెన్నుపోటు పొడిచే తందాన తాన
గుట్టుగ సాగే బతుకు నావ, నట్టేటన ముంచే తందాన తాన
కడుపు చించుకుంటే, ఓతల్లి కాళ్ళ మీద పడుతుందమ్మ తందాన తాన
గంపెడాశతో కొడుకును పెంచితే, కన్నీరే మిగిలిందమ్మా తందాన తాన
అన్నెంపున్నెం ఎరుగని జీవికి అన్యాయం జరిగిందమ్మా
ఇంతటి ఘోరం, దేవా .. దేవా..దేవా ..
ఇంతటి ఘోరం చూస్తూ దేవా, ఎక్కడ దాక్కున్నావయ్యా ..
ఎక్కడ దాక్కున్నావయ్యా .. ||ఏమిటో ఈ||
భోగభాగ్యములు వలచిన కొడుకు, పుట్టినగడ్డను మరిచాడు 2
ఆలి చేతిలో కీలు బొమ్మయై, అందలం ఎక్కి కులికాడు 2
కన్న కడుపే రగిలిన వారు, ఉన్న ఊరే విడిచారు 2
అయ్యో...అయ్యయ్యో..
రెక్కలు తెగిన పక్షుల్లాగా, బిక్కు బిక్కుమని చూసేరు 2 ||ఏమిటో ఈ||
అయ్యో...అయ్యయ్యో..
మూగగా ఒక తల్లి బతుకు, ముగిసిపోయింది తందానా అయ్యో తందానా ఓదేవ నందనానా
పొత్తిళ్ళలో ఓ నెత్తుటి కందు మిగిలీ పోయింది తందానా అయ్యో తందానా ఓదేవ నందనానా
అన్ని ఉన్నా బాబుని పెంచే, ఆత్మీయత లేదొక చోట, తందానా తాన
ఏ.మీ. లేకున్నా, పాప ఎదపై పెరిగేనొక చోట, తందానా అయ్యో తందానా ఓదేవ నందనానా
వెలుగు నీడల చదరంగములో, వింత పావులు జీవులు 2
అందరి మతులకు గంతలు కట్టి, ఆడించే వాడెవ్వడూ, ఆటాడించేవాడెవ్వడు
ఆడించే వాడెవ్వడు, ఆటాడించేవాడెవ్వడు 2
చిత్రం: తాత మనవడు 1973, సంగీతం: రమేష్ నాయుడు, దర్శకుడు : దాసరి, నటీ నటులు - నారాయణరావు, ఎస్వీ రంగారావు, అంజలీదేవి, రాజబాబు, విజయనిర్మల, కైకాల సత్యనారాయణ, రాజసులోచన, అల్లు రామలింగయ్య, రమాప్రభ, ఛాయాదేవి, గుమ్మడి వెంకటేశ్వరరావు
Tata Manavadu Songs - Soma Mangala Budha - S V Ranga Rao, Anjali Devi, Satyanarayana, Rajababu, ramaprabha
tata manavaḍu - inade babu ni puttina, anubandham atmiyata, soma mangala, emito e lokamanta
మిగతా మాటలు పూర్తి వీడియో పాటలు సినిమా లింక్ లోపల సుమా. మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1958 General Articles and views 1,585,748; 97 తత్వాలు (Tatvaalu) and views 199,493 Dt : 09-Jun-2022, Upd Dt : 09-Jun-2022, Category : Songs
Views : 893
( + More Social Media views ), Id : 1421 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
tata ,
manavadu ,
enade ,
babu ,
puttina ,
anubandham ,
atmiyata ,
soma ,
mangala ,
emito ,
lokamanta ,
svr ,
rangarao ,
anjali ,
rajababu ,
vijaya nirmala ,
satyanarayana Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments