బాలెట్ లెక్కింపు? సేవ సహాయం అందరికీ అని చెప్పే వారు, జవాబులు అవకాశాలు అందరికీ ఇవ్వరా? - America/ NRI
           
     
మిగతా వార్తలనూ విషయాలను చదవగలరు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1256 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

మన తెలుగు తానా ఎన్నికల ఓటింగ్ పూర్తి అయిందా? ఇంకా సమయం ఉందా?

లెక్కింపు నిజాయితీగా ప్రశాంతము గా జరుగుతుందా? బాలెట్ కలెక్షన్స్ జరగ లేదని రుజువు ఉందా?

పక్కన వారికి బాలెట్ ఇచ్చి, ఓటు వేసుకోండి అనే, మూర్ఖ శిఖామణులు, విదేశీ తెలుగు వారిలో ఇంకా ఉన్నారా? అలాంటి పిల్లలను కన్న సంస్కారులము మనమేనా?

అని అందరిలో ఆత్రము గా వస్తున్న ప్రశ్నలు. అసలు ఏమి జరుగుతుంది, అక్కడ?

ఇతర తెలుగు సంఘాల ఎన్నికల సమాచారం కూడా, బయటకు రావాలి ఇలా, అప్పుడే అమెరికా ప్రజాస్వామ్యం, మన సంఘాల ఎన్నికల్లో ఉన్నట్లు.

లేదంటే, దొంగలు దొంగలు ముఠాలు ముఠాలు ఊళ్ళు పదవులు పంచుకుని, బానిసత్వ పోకడలు ఇక్కడ కూడా కొనసాగింపు సుమా?

ఎవరు లీడింగ్ లో ఉన్నారు? కొత్త ఉత్తములా, పాత లేదా కొత్త గ్రూపు రాజకీయ నాయకులా?

కొత్త అక్రమాలు, ఏమైనా వీడియో లేదా ఫోటో రూపంలో సాక్ష్యం తో, బయటకు వచ్చాయా?

బాలెట్ పేపర్లు రిజిస్టర్ పోస్ట్ లో పంపి, సంతకం తో ఓటరు కు నేరుగా ఇస్తున్నారా? లేదా గాలికి వదిలేసి దొరికిన వారికి కలెక్షన్ కు పంపుతున్నారా?

సంతకం తో బాలెట్ ఇస్తే, ఎవరు ఉన్నారు లేదా ఎవరు లేరు, ఎవరి అడ్రసు తప్పు ఒప్పు, అన్ని బయటకు వస్తాయి కదా?

మీరంతా, ఏదో ఒక సమాచారం చెప్పనిదే, పదిమందికి పంపనిదే మంచి చెప్పనిదే, మన తెలుగు సంఘాల వ్యవస్థ బాగుపడదు, బాధ్యత గా ఉండరు.

మనం ధైర్యముగా అడగలేకపోయినా, కనీసం అడిగే వారికైనా సమాచారం చెప్పకపోతే, దేవుడు క్షమించడు. ఎందుకంటే ఆ పాపంలో మనమూ భాగం అయినట్లే కదా?

మనం అడగకుండానే, వారు మారరు అనడం తప్పు కాదా? జవాబు ఇచ్చిన, మంచి నాయకులు, అధికారులు ఉన్నారు కదా.

మన సంఘాలను, మనమే బాగు చేసుకోవాలి. సంఘ సభ్యత్వం ఉన్నా లేకపోయినా, తెలుగు వారిగా మనకు ఆ హక్కు బాధ్యత ఉంది.

ఎందుకంటే మన పేరు చెప్పుకుని, మనల్ని అందరిలో, తమ మూర్ఖపు పనులతో చులకన చేస్తోంది అలాగే మంచి పనులతో గౌరవం పెంచుతుంది, వీరే వందల సంఘాల స్థాపన తో, దేశం మొత్తం లో.

అహంకారం అభిజాత్యం ముఠాల రాజకీయాల తో, వారు మనల్ని గౌరవించకపోవచ్చు, జవాబు ఇవ్వకపోవచ్చు.

ఎందుకంటే దుర్యోధనుడు, రావణుడు లాంటి వారసులు, సామాన్యుల మంచి మాటలు వింటారా? ఆదరిస్తారా?

విదేశీ తెలుగు సంఘాలు సంస్ధలు, అన్ని మనవే. మన జాతి రత్నాల మూలాలు, మన ఊరిలోనే ఉన్నాయి.

మన నాయకుల వెంటే, ఫోటోల కోసం, స్థలాల కోసం, పదవులు పైరవీల కొసం, వెంటపడతారు కదా?

విదేశీ టాక్స్ లాభం పొందుతున్నారు, నాన్ ఫ్రాఫిట్ గా కాబట్టి, ప్రభుత్వం మరియు ప్రతి విదేశీ తెలుగు పౌరునికి, తెలుగు జాతి కి, వారు గౌరవం తో సమాధానం చెప్పాలి, సంస్కారం బాధ్యత నిబద్దత కృతజ్ఞతలు ఉంటే సుమా.

మన అన్ని పార్టీలు అధిష్ఠానం, ఆ ఎన్నికల సమాచారం కోసం చూస్తున్నారు. మీకూ మనకు బాధ్యత ఉంది.

అవగాహన లోపంతో, తప్పులు ఉంటే సరిచేస్తారని భావిస్తున్నాము. మన 19 ప్రశ్నలు కు జవాబు లు లేవు, ముగ్గురు నుంచి కూడా.

సేవ సహాయం అందరికీ చేస్తాము అని పైకి చెప్పే వారు, జవాబులు అవకాశాలు అందరికీ ఇవ్వరా? link.

బాలెట్ వాలిడేషన్ ఎలా చేస్తారు?

* ఆ వ్యక్తి ఆ అడ్రసు లో ఉన్నాడా లేదా ఇప్పుడు అన్నది చూడాలి?

* లేకపోతే అది రిటర్న్ వచ్చిందా డెలివరీ కాకుండా, లేదా సంతకం తో డెలివరీ లేదు వారు ఇల్లు మారి, కాబట్టి అక్కడ పడేసారా? చెత్త బాక్స్ దగ్గర బాలెట్ పడి ఉందని తెలిసింది.

* ఓటు తో బాలెట్ వస్తే, అతనే వేశాడా ఆ అడ్రసు లో ఉండి లేదా అతను వేరే అడ్రసు కు మారితే, ఇతరులు కలెక్షన్ చేసుకున్నారా?

* బాలెట్ పై సంతకం, ఆన్ రికార్డు సంతకం ఒకటేనా?

ఇంకేమైనా వాలిడేషన్ రూల్స్ ఉన్నాయా, నిబద్ధత తో కూడిన లెక్క కు?

వీడియో రికార్డు తో అందరూ చూస్తుండగానే, వెరిఫికేషన్ మరియు లెక్క ఉండాలి.

ఊరక మెషిన్ తో, బాలెట్ కౌంట్ వేస్తే, అది సరైన వ్యక్తి ఓటని నమ్మకం ఎలా?

---

అందరూ మన మిత్రులే, గెలుపు ఓటమికి సంబంధం లేదు.

వారి లో ఎవరైనా సరే, కరెక్టు లెక్క తో, కరెక్టు మనిషి అడ్రసు లో ఉండి, వేసిన ఓటు తో లెక్క గెలుపు, అందరం అంగీకరించాలి.

డెలివరీ కాక వెనక్కి వచ్చిన బాలెట్, వెనక్కి రాకుండా అక్కడ నే ఆగిపోయిన బాలెట్, కూడా లెక్క తేల్చి,

దొంగ లేదా పాత అడ్రసు, డమ్మీ లేదా లేని సభ్యులు, అడ్రసు లో లేకపోయినా కలెక్షన్, ఓటు లెక్క కూడా తేల్చాలి.

ఇప్పుడే మొత్తం సభ్యులు లెక్క ను కూడా, కరెక్టు అంకెతో తేల్చాలి.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1256 General Articles, 47 Tatvaalu
Dt : 25-May-2021, Upd Dt : 25-May-2021, Category : America
Views : 148 ( + More Social Media views ), Id : 1181 , Country : USA
Tags : tana , leaders , service , help , everyone , answers , opportunities , gogineni , kodali , niranjan

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content