స్వాగతమయ్యా ఓ యమరాజ - శ్రీ మంజునాథ - చిరంజీవి, అర్జున్, అంబరీష్, మీనా, సౌందర్య, సుమలత - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2269 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2304 General Articles and views 3,673,924; 104 తత్వాలు (Tatvaalu) and views 413,686.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Swagathamayya O Yama raja - Sri Manjunatha - Chiranjeevi, Arjun, Ambareesh, Meena, Soundarya, Sumalatha
*పాటతో పరమార్ధం - స్వాగతమయ్యా ఓ యమరాజ - శ్రీ మంజునాథ - చిరంజీవి, అర్జున్, అంబరీష్, మీనా, సౌందర్య, సుమలత*

- మన గాత్ర నైవేద్య సేవ Our Gatra Naivedya Seva
- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva

+ + +

అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లో మానసిక నియంత్రణ లేని కారణంగా, ప్రాపంచిక బ్రమలకు దాసులై, ప్రాణభయముతో అల్లాడుతారు, తాము అక్రమముగా సంపాదించినది ఎటు పోతుందో, తమ బంధాలు ఏమౌతాయో అని. కానీ సత్వ గుణ సంపన్నులు, ప్రాణం మీద తీపి చూపరు, యమరాజును స్వాగతిస్తారు.

సత్వగుణ భక్తులు ఇలా అంటారు, ఉత్త చేతులతో వచ్చాను, అలాగే వెళతాను. కాబట్టి మా ప్రాణాలనే, నైవేద్యముగా పంచభక్షాలుగా అర్పించెదర, యమరాజా. శివ అనుగ్రహముతో అంటారు. స్వాగతమయ్యా, ఓ యమరాజ, ఇకనైనా ఈ బ్రతుకు నాటక భారమును, ఈ మాయ తెరను దింపేయగ రారా.

అన్ని భోగ భాగ్యాలను వదలి, కాలానికి సాక్షీభుతులుగా ఉన్న మాకు, శ్వాస నువ్వే, శాంతి నువ్వే, స్వర్గమిచ్చే, సఖుడు నువ్వే, ఓ మృత్యుదేవా. మాకు ప్రాపంచిక బంధాలతో ఎందరున్నా, ఎన్ని వున్నా, వెంట వచ్చే, చివరి తోడు, మరణమేరా. మనకు లేనిదే ఏదీ పోదురా, ఉన్న శరీరం పోనిదే కొత్తది రాదురా. మాలాంటి జీవులను ఆలించారా, పరిపాలించారా, తనువొక మాయ, నీ వెంట కొనిపోరా యమరాజా అంటారు.

మమ్మల్ని ముద్దు చేసి ధైర్యం చెప్పి, భవ బంధాల ముడిని తెంచి, ఎదను చేర్చి, ఎత్తుకెళ్ళే, తండ్రి నువ్వే. మమ్మల్ని లాలీ పాడి, శాశ్వత నిదురపుచ్చి, వల్లకాటి ఒడికి చేర్చే, తల్లి నువ్వే. మా అంతిమ లెక్కలే చెల్లేరా, ఈ మానవ బంధమే తీరేరా. మమ్ము పాలించారా, మా పుణ్యఫల పంట పండిందిరా, కరుణామయ కడా తేర్చారా అంటూ ఆర్తిగా ఆ యమ రాజుని పిలుస్తారు.

+ + +

ప్రాణాలనే.. పంచభక్షాలుగా అర్పించెదర యమరాజా..., శివ

స్వాగతమయ్యా, ఓ. యమరాజ, ఓ. యమరాజ, ఓ.. యమరాజ 2
ఈ మాయ తెర., దింపేయగ రా.రా.

శ్వాస నువ్వే, శాంతి నువ్వే, స్వర్గమిచ్చే, సఖుడు నువ్వే., మృత్యుదేవా.
ఎందరున్నా, ఎన్ని వున్నా, వెంట వచ్చే, చివరి తోడు., మరణమేరా
లే.నిదే. పోదురా., పో.నిదే. రాదురా.
ఆ.లించారా.., పరిపా.లించారా.., కొనిపోరా., యమరాజా... ఆ, హ, హర

తనువొక మాయ, ఓ జవరాయ, ఓ జవరాయ, ఓ. జవరాయ
ఈ మాయ తెర., దింపేయగ రా.రా.

ముద్దు చేసి, ముడిని తెంచి, ఎదను చేర్చి, ఎత్తుకెళ్ళే.., తండ్రి నువ్వే.
లాలీ పాడి, నిదురపుచ్చి, వల్లకాటి, ఒడికి చేర్చే.., తల్లి నువ్వే.
లెక్కలే. చెల్లేరా, బంధమే. తీరేరా
పాలించారా..., పంట పండిందిరా.., కరుణామయ., కడా తేర్చారా.. ఆ హ, ఈశ్వర

స్వాగతమయ్యా, ఓ. యమరాజ, ఓ. యమరాజ, ఓ.. యమరాజ 2
ఓ యమరాజ ఓ యమరాజ ఓ యమరాజ  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2304 General Articles and views 3,673,924; 104 తత్వాలు (Tatvaalu) and views 413,686
Dt : 18-Dec-2024, Upd Dt : 18-Dec-2024, Category : Songs
Views : 482 ( + More Social Media views ), Id : 2206 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Swagathamayya O Yama raja , Sri Manjunatha , Chiranjeevi , Arjun , Ambareesh , Meena , Soundarya , Sumalatha
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 13 yrs
No Ads or Spam, free Content