From Sunday 5 am to 6pm, fasting, only water and turmeric milk - Eng/ Telugu - Devotional - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,620; 104 తత్వాలు (Tatvaalu) and views 225,161.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

From Sunday 5 am to 6pm, fasting, only water and turmeric milk. If we can't control and want eat, we can have one apple, banana, 2 dates. I am following all these for 2nd week and explaining the benefit.

Usually everyday night, dinner at 7pm. Even after fasting Sunday 6pm also, only idly banana or light food, not more than that.

How much control we should have, on our mind and body, to follow this?

Morning bitter guard ginger garlic juice, peppers Kashaya, will give more hungry.

Giving holiday rest to digestion system stomach, good for our health and active mind.

If we can't control physical food, sleeping on mat, 108 pradakshina on barefoot, chanting, good words, wishing good for others, scarifies, etc., how can we concentrate our inner eye on God?

How can we stop the flow of thousand thoughts in meditation and search for the God? When will it fulfill and find him?

Think another way and motivate ourselves, if we stop taking food for 1 or 2 times, someone in this world, like our God given brother will get that equal amount of food. Can we scarify, when we have everything?

How can we face life issues and sudden turns and up downs, if we can't control these small things?

Fasting is blessing of our elders wisdom. fasting is also staying near to God, which are our parents and keep God in thoughts continuously.

Try and see the benefit, be away from doctor and diseases. Om Namo Suryanarayana namah.

శుభోదయం, శుభదినం, శుభ సంకల్పం

ఆదివారం ఉదయం 5 నుంచి రాత్రి 6 దాకా, కేవలం నీళ్లు, కప్పు పసుపు పాలతో, సూర్య ఉపవాసం. ఆగ లేకపోతే, చిన్న బెల్లం ముక్క, ఒక ఆపిల్, ఒక అరటి పండు, ఓ 2 ఖర్జూరాలు తీసుకున్నా పర్లేదు. 2 వ వారం ఆచరణలో అమలు చేస్తూ, చెపుతున్న మాటలు ఇవి.

రోజూ రాత్రి 7 కే రాత్రి భోజనం, అంటే ముందు రోజు రాత్రి కూడా, తిండికి కొంచెము దూరమే. ఆదివారం ఉపవాసం తర్వాత సాయంత్రం 6 తర్వాత కూడా, ఇడ్లి మాత్రమే, కంచం మీద పడి దాడి చేయమని కాదు.

ఆదివారమే కాదూ ఏ రోజైనా మీ ఇష్టం, కాని ఎక్కువ మంది ఎగబడి తినేది ఆది వారమే, కాబట్టి ఎక్కువ లాభం.

అంటే, ఎంత నిష్ట, మనసు కోరికల నియంత్రణ, పట్టుదల ఉండాలి?

ప్రతి ఉదయము లాగనే, ఆది ఉదయం కాకర రసం అల్లం వెల్లుల్లి, మిరియాల కషాయం, ఆకలి ఇంకా ఎక్కువ.

కడుపు కాలి, కొవ్వు కరిగి, ఆరోగ్యం పెరగాలి. పేగులు కేకలు పెట్టినా, జీర్ణ వ్యవస్థ కు సెలవు, బుద్ధి కి నెలవు.

భౌతిక తిండి, చాప నిద్ర, 108 ఉత్త పాద ప్రదక్షిణాలు, శాఖాహరం, మంత్ర పూర్వక పలుకులు, మంచి మాటలు, ఇతరుల మంచి కోరడము, త్యాగము, ఇవన్ని మనసు నియంత్రణ లేకపోతే, మానసిక బలం ఎలా వస్తుంది, దేవునిపై చూపు ఎలా నిలుస్తుంది?

ధ్యానము లో, వేల ఆలోచనల ప్రవాహము మధ్యలో, దేవుని కై వెతుకు లాట ఎలా ఫలిస్తుంది, ఇంత చిన్న బౌతిక విషయాల కే నియంత్రణ చాతకాకపోతే?

మనము ఒకటి లేదా రెండు పూటల తిండి మానడము వలన, ప్రపంచములో ఇంకో మనిషికి, దైవం ఇచ్చిన మన సోదరుడికి, తిండి దొరుకుతుంది అనుకో, ఉత్సాహము తెచ్చుకో, ఆరోగ్యము నిలుపుకో, ఖర్చులు తగ్గించుకో. అన్ని ఉన్నప్పుడు ఒక్క పూట ఆగలేమా?

ఇవే తట్టుకోలేకపోతే, జీవితములో కష్టాలు నష్టాలు బాధలు ఎలా తట్టుకోగలము?

ఉపవాసం పెద్దల దీవెన. ఉపవాసం అంటే ఇంకో అర్ధం దేవునికి దగ్గరగా ఉంటూ ధ్యానం జపం. అంటే అమ్మా నాన్న కు దగ్గరగా కూడా, అవే చేయవచ్చు.

ప్రయత్నం చేసి చూద్దాం, డాక్టర్ కు రోగాలకు దూరము గా ఉందాము.

ఓం నమో సూర్య నారాయణ నమః  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,620; 104 తత్వాలు (Tatvaalu) and views 225,161
Dt : 21-Feb-2021, Upd Dt : 21-Feb-2021, Category : Devotional
Views : 1016 ( + More Social Media views ), Id : 982 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : sunday , water , yellow milk , god , sun , fasting
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content