కధానాలు ప్రముఖ పత్రికలో, నాయకులు తిట్టడం, ఎన్ని రోజులు నీతి గా, 4 పిల్లల పాపంలో భాగం - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,866,280; 104 తత్వాలు (Tatvaalu) and views 224,953.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఏవండీ మొదటిసారి, వార్త అంటే విలేఖరి అంటే తేడా తెలిసింది. రాజకీయాలు పురాణాలు కలిపి, ఎవరి పేరు ఎత్తకుండా, గౌరవముగా మెత్తగా నేటి పరిస్తితిని, అరటికాయ ఒలిచి నోట్లో పెట్టినట్టు గా చెప్పారు. రాజకీయ కధనం లో, దేవుని చొప్పించి, పురాణ కాలక్షేపం తో పాటు, రాజకీయ జ్ఞానం ఇస్తున్నారు. ఇంకొన్ని ప్రశ్నలు ఇబ్బంది లేకపోతేనే -

1. మీ కధానాలు, ప్రముఖ పత్రికలో ఎందుకు వేయరు? ఎక్కువ మందికి చేరుతుంది కదా, జనాన్ని చైతన్య పరచడానికి. మీలాగా ఉన్న వాస్తవం, ఎందుకు రాయరు వాళ్ళు?
2. అన్ని పార్టీ నాయకులు ఇవి చూసి, మిమ్మల్ని తిట్టడం లేదా?
3. ఎన్ని రోజులు మీరు మాత్రం, నీతి గా ఉండగలరు? మిగతా పత్రికల లా మారరా?
4. 4 పార్టీలు మీ బిడ్డలు అన్నారు, 4 గురి బాగు కోసం అందరిని వరుస బెడుతున్నారు ప్రజల తో కలిపి. మరి, 4 పార్టీల పిల్లల పాపంలో, మీకు భాగం రాదా?

జవాబు.

ముందుగా మా మూడో అబ్బాయి, వైకాపా అధినేత జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో, ఇలాంటివి ఎన్నో జరుపుకోవాలి. చంద్రన్న లాగా సలహాదారుల మాయలో భ్రమలో పడకు చిన్నా, బయటకు చూడు, వాస్తవాన్ని గ్రహించు, భవిష్యత్ జాగ్రత్త చేసుకో. మేము తోడు గా ఉన్నాము 4 బిడ్డలకు, మాయలో పడనీయకుండా.

1. పత్రికలు/ టీవీలు/ ఆన్లైన్ మీడియా ఎటో ఒకవైపుకు లొంగింది అని అనుకున్నాము కదా, వారు రెండు వైపులా ఉతకడాన్ని సహించరు. అందులో పనిచేసే విలేఖరికి స్వేచ్చ ఉండదు, కాబట్టి రాయరు.

ఒకవేళ పార్టీ పెద్దలు మన వాడేలే, క్రెడిబిలిటీ పెరుగుతుంది, మన పత్రికలో మన మీద కూడా విమర్శలు ఉంటే, మంచిదేను వేయండి అన్నా కూడా, వారి సమాధానం - అయ్యా ఇన్నాళ్ళు మీ ఉప్పు తిని పెంచిన సంస్థ, మీ మీద ఈగ వాలనీయము, ఈ కఠిన పరీక్ష పెట్టవద్దు మహా ప్రభో అంటారు.

కాబట్టి, ఆ ఆలోచనే వద్దు. సోషల్ మీడియాలో మీరు చదివి, ఒక్కరు అవును అన్నా చాలు. అసలు నాయకుల కే, ఆ పార్టీ కార్యకర్తల ద్వారా చేరితే, చాలు కదా.

2. పార్టీ నాయకులు, వయసులో అనుభవములో పెద్దవారు, మన కన్నా అనుభవజ్ఞులు. వీటి దగ్గర, ఆవేశం ఆవేదన తెచ్చుకోరు. ఇందులో మంచి నేర్చుకుని, మన పార్టీని ఇంకా బలోపేతము చేద్దామని మాత్రమే ఆశిస్తారు.

కాలం బలీయమైనది, రాజకీయ పులి మరియు అందులో జరిగే అవినీతి భూతం కి, తాము కూడా ఏదో ఒకరోజు, బలి అవుతాము అన్నది, ప్రతి రాజకీయ ధీరుడికి తెలుసు.

వివేకానంద, శివ ప్రసాద్, . . . ఇంకా ఎందరో గాధలు విన్నాము. నాటి ప్రభుత్వం లో విర్ర వీగిన మంత్రులు నాయకులు, ఇప్పుడు కలుగులో దాంకున్నారు, సిగ్గుతో తలదించుకుని పార్టీ మారారు, అని అందరికీ తెలుసు.

భవిష్యత్ లో జరగబోయేది, వారికి తెలుసు. అందుకే, సామాన్య కార్యకర్తలు లా, ఆవేశపడరు.

విజ్ఞత గల నాయకులు, వాస్తవం తెలుసు కాబట్టి, చాటుగా అభినందిస్తూ, గమ్ముగా ఉంటారు.

3. ఎన్ని రోజులు నీతి గా ఉంటాము అనేది, మీ ఆదరణ పై ఉంటుంది. మీరెవరు మంచిని ప్రోత్సహించలేదు. కొన్నాళ్ళ తర్వాత, కష్ట కాలములో, సాయానికి 4 బిడ్డల మీద ఆధారపడ వలసి వస్తే, తప్పదు కదా.

నిజమైన ధర్మబద్దమైన ఆపద సమయములో మాత్రమే, నీతి తప్ప వచ్చు అని, శాస్త్రం మాట. ప్రజాస్వామ్యాన్ని, నీతి నిజాయితీలను, ఆ స్థితికి తెచ్చిన, ప్రజలకే ఆ పాప భారం.

తగిన వనరులు ఉండీ సహాయము చేయని వారు, అవి అన్నీ తర్వాత పోగొట్టుకుంటారు. అవి భగవంతుడు ఇచ్చింది, ప్రజల కోసం. వారు దానం చేస్తారా లేదా అని దేవుని పరీక్ష, వారికి కూడా.

ఇప్పుడు మాకు మాటలు రాయడము దేవుడు ఇచ్చారు. మీకోసమే వాడుతున్నాము కదా? దాచుకోలేదు కదా, స్వార్ధముతో?

4. మంచి తెలివైన ప్రశ్న, పిల్లలను చెడు చేయమని, తండ్రి ప్రోత్సహిస్తే, ఖచ్చితముగా పాపము లో భాగం వస్తుంది.

మేము ఇప్పటి వరకు రాసిన, 870 పైగా కధనాలలో, ఎక్కడైనా, దోచుకుని దాచుకోమని రాసామా? లేదు కదా?

మంచి గా ఉండమనే, మంచి చేయమని, వారి క్షేమం కోసం, రాశాము చెప్పాము.

కాబట్టి, వారి పాపములో మాకు భాగము రాదు కదా? వారి నుంచి దూరంగా ఉన్నాము, వారితో కలసి, ఎటువంటి తప్పులలో భాగం కాలేదు కదా.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,866,280; 104 తత్వాలు (Tatvaalu) and views 224,953
Dt : 20-Dec-2020, Upd Dt : 20-Dec-2020, Category : Politics
Views : 750 ( + More Social Media views ), Id : 874 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : andhra , politics , jagan chandra , bjp , pawan , stories , news , leaders , cursing , morality , sin , children
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content