వీరబ్రహ్మేంద్ర స్వామి - కాలజ్ఞానం - చిలకమ్మ పలుకవే, శివ గోవింద - తండ్రి పూజ, తర్వాతనే బాబాయి గౌరవం - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2136 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2171 General Articles and views 2,206,574; 104 తత్వాలు (Tatvaalu) and views 244,325.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

*శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర - వీరబ్రహ్మేంద్ర స్వామి - కాలజ్ఞానం - చిలకమ్మ పలుకవే, శివ గోవింద - ముందు తండ్రి పూజ, తర్వాత బాబాయి గౌరవం*

మన తెలుగు వారు వీరబ్రహ్మం గారిని, ఎప్పుడూ మరువ కూడదు. తాళపత్రాలలో ఆయన రాసిన కాలజ్ఞానం సాక్ష్యం ఉంది. ఆయన శివ భక్తులు, భవిష్యత్ చెప్పారు. ఎంతో మందిని తన వాక్ పఠిమతో ఓడించారు, బుద్ది చెప్పారు. ఆయనకు సిద్దయ్య అని మహమ్మదీయ శిష్యుడు కూడా ఉన్నారు. పాలించే నవాబు కూడా, బ్రహ్మం గారికి పరీక్షపెట్టి, గెలిచిన బ్రహ్మం గారి శక్తి సామర్ధ్యాలను మహిమలు కీర్తించారు. మన పిల్లలకు కూడా, సాక్ష్యాలతో నమ్మడం నేర్పాలి.

పుణ్యదంపతులైన పరిపూర్ణయాచార్యులు, ప్రకృతాంబల సంతానం. వారు వెంటనే గతించారు. విశ్వబ్రాహ్మణ పుణ్యదంపతులు యనమదల వీరభోజయచార్యులు, వీరపాపమాంబ సంతాన భాగ్యం కోసం పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ, అత్రి మహాముని ఆశ్రమం చేరుకుంటాడు. సంతాన ప్రాప్తి కై పరితపిస్తున్న ఆ పుణ్య దంపతుల చెంతకు, బ్రహ్మన్ని అత్రి మహాముని అందజేస్తాడు. వీరభోజయాచార్య, ఈ బాలుడు మహా మహిమాన్వితుడు, మునుముందు, ఈ బాలుడు ఎన్నో వింతలు చూపించబోతున్నాడు - అంటూ ఆ బాలుని వీరభోజయాచార్య దంపతులకు అందజేస్తాడు. ఆయనే మన వీరబ్రహ్మం. మతము, రచనములు, కాలజ్ఞానం, అన్ని సాక్ష్యాలు ఉన్నాయి.

సాంధ్రసింధు వేదమనుపేర ప్రఖ్యాతి గాంచిన కాలజ్ఞానాన్ని బోధించిన మహా యోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకులు, కాళికాంబ సప్తశతి మరియు వీరకాళికాంబ శతకాలద్వారా ప్రపంచానికి తత్త్వబోధ చేసిన జగద్గురువు. వైఎస్ఆర్ జిల్లా లోని కందిమల్లాయపల్లిలో చాలాకాలం నివసించి, కాలజ్ఞానం రచించి సా.శ. 1693 లో సజీవ సమాధి నిష్ఠనొందినారు. శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామివారి వలన ప్రసిధ్ది పొందుట చేత కందిమల్లాయపల్లె, తర్వాతి కాలములో బ్రహ్మంగారిమఠంగా ప్రసిద్ధి చెందింది.

గురువారం (కనీసం శని/ ఆది వారాలు) మనము ముందు, మన ఇంటి తొలి గురువులు అమ్మా నాన్న కు పాద నమస్కారం చేసి, నీళ్ళతో కాళ్ళు కడిగి పూజించి, వారి తో పాటుగా, తెలుగు ఆధ్యాత్మిక గురువులు బ్రహ్మం గారు, రాఘవేంద్ర స్వామి, యోగి వేమనలను తలవందే, వారు సనాతన ధర్మ తెలుగు వారు కాదు. వారు పునాది లేని, కేవలం అరిషడ్వర్గాలకు బానిసలైన నమ్మక ద్రోహులు, తమ సొంత తల్లి దండ్రుల కు బంధువులకు, స్నేహితులు కు కూడా మంచి చేయరు విశ్వసనీయత చూపరు, అనుమానమే లేదు. కఠినముగా ఉన్నా, వాస్తవాన్ని అంగీకరించాలి మిత్రమా.

సొంత కన్న తండ్రి లాంటి, తెలుగు గురువును వదలి మరచి, వీరి గురించి దేశ విదేశాలాలో, గొప్పగా చెప్పు కోలేని, దద్దమ్మలు విశ్వాసఘాతకులు గా, ఇతర భాషా గురువుల వెంట, మోహములో తిరుగుతూ, నిరుపయోగముగా దూరపు బాబాయిలని పొగుడుతున్నారు. అన్ని భాషల వారు ఆశ్చర్యముగా నవ్వుతున్నారు, మానసిక బలహీనురు మీద నడుపుతున్న మన పిచ్చి వ్యాపార ద్రుక్పధాన్ని చూసి, అదీ సొంత భాష వారినే మోసము చేస్తూ.

మన తండ్రి దొంగ అయినా, తప్పుడు వాడు అయినా, ఇంట్లో ఫోటో/ పూజ ఎందుకు లేదో, మనము స్పష్టముగా కారణం అందరికీ చెప్పాలి. దొంగ అయినా కూడా, పిత్రు రుణం తీరదు, కాబట్టి ఫోటో/ పూజ ఇంట్లో తప్పక ఉండాలి. అది లేకుండా పరాయి దూరపు బాబాయి ఫోటో ఉంటే, ఆ వంశం/ కుటుంబ మే, క్రుతజ్ఞతలు విలువలు లేనిది. ఆఖరుకు రాక్షస తండ్రిని కూడా ప్రహ్లాదుడు గౌరవించాడు, బుజ్జగించాడు, నచ్చచెప్పాడు.

తండ్రి మంచివాడు, జ్ఞాని, అరిషడ్వర్గాలను జయించి, ఇహ భోగాలను త్యజించి, స్వచ్చందముగా అందరి ఎదురుగా జీవ సమాధి అయినా కూడా, ఆ భాషా ఇల్లాలు బిడ్డలు, ఆ తండ్రి ఫోటో ఇంట్లో పెట్టలేదు అంటే, దూరపు బాబాయి ఫోటో పెట్టారు అంటే, తప్పకుండా, ఆ కుటుంబం నీతి నిబద్దత లేని వారనే కదా అర్ధం? బ్రమలకు దగ్గర, వాస్తవానికి దూరం. గాలి మేడల కుటుంబం.

మరిదిని గౌరవించు ఎవరూ వద్దు అనరు. కానీ ముందు భర్త ను గౌరవించు, ఆయన గౌరవానికి భంగము లేకుండా, ఎవరినైనా గౌరవించు. అలాగే మరదలను గౌరవించు, కానీ భార్య గౌరవం ఆత్మాభిమానం దెబ్బతినకుండా మాత్రమే. లేదంటే, వారికి విలువలు లేవు, దేవునికి వారు దూరము. దానికి వ్యతిరేకము గా ప్రవర్తిస్తే, అలాంటి విలువలు లేని వారికి, మనం దూరముగా ఉండటం మంచిది.

5 ఏళ్ళు గా మనము చెపుతున్న దానిలో సత్యం గ్రహించి, చాలా మంది ఆలోచనలో పడ్డారు. కన్న తెలుగు తండ్రా లేదా పరాయి భాషా బాబాయా అని? ఏది, సంస్కారం విశ్వసనీయత క్రుతజ్ఞత? అని. మనవారు అమెరికాలో కూడా, బ్రహ్మం గారి పాటలు పాడి అందరికీ పంపుతున్నారు అంట, మీ దాకా రావచ్చేమో అవి, మరి మీరూ పాడరూ? తెలుగు వారిగా, మనము ఇప్పుడు అయినా, సిగ్గు తెచ్చుకోమా? ఇంకా ఎన్ని సునామీలు, వరదలు, భూంకంపాలు, కరోనాలు రావాలి? ఇంకెంతమంది పోవాలి, మనలో చెడు తొలగాలి అంటే?

మొన్న ఒక పక్క రాష్ట్ర మరియు 2 తెలుగు వారము స్నేహితులము కలిసాము - మాటల్లో వారి రమణ మహర్షి గురించి గొప్పగా చెప్పారు, పక్క రాష్ట్ర స్నేహితుడు. మనము, సమర్ధించాము, ఆయన చాలా గొప్పవారు అని.

2 వ తెలుగు స్నేహితుడిని, మీ తెలుగు గురువుల గురించి చెప్పు అని అతను కోరితే, మన తెలుగు వాడు, పరాయి బాబాయి గురించి గొప్పల స్తోత్రం మొదలు పెట్టాడు - పుట్టుపూర్వోత్తరాలు తెలీదు, హైందవ నామాలు రచనలు వాసనలు లేవు, మా నోటికి ఒక్క ఆరతి రాదు అక్షరాలు పలకలేం, భాష అర్ధం కాదు, మేము స్థంబాలు లా నిలుచుంటే మైకు పాడుద్ది, ప్రసాదం మాత్రం మేము తింటాము, మా సొంత అమ్మా అయ్యా వేస్ట్ పరాయి బాబాయే బెస్ట్ అని, అర్ధము వచ్చేటట్లు గుక్క తిప్పుకోకుండా చెపుతూ పోతున్నాడు.

అతను ఆశ్చర్యపోతూ, సిగ్గులేదు, మీకు బ్రహ్మం వేమన రాఘవేంద్ర వంటి, కాలజ్ఞానం రాసిన మంచి గురువులు ఉన్నారు అని విన్నాను. వారిని వదిలిపెట్టి ఎవరో బాబాయి గురించి చెపుతావు. మీరు ఉన్మాదులు గా, మీ తెలుగు గురువులకు ద్రోహము చేస్తున్నారు, అన్నాడు నవ్వుతూ చురకలు వేస్తూ. మనము వారించాము, నువ్వు ఉండు రా బాబూ, మరలా దీనిని ప్రాంతీయ బాషా సమస్యగా చేస్తారు, రాష్ట్రాల మధ్య, మా గట్టి పునాది సమాధానం లేని మేధావులు.

మేము చెపుతాము సమాధానం, తోటి తెలుగు వాడిగా, అప్పుడు నోరు ఎత్తరు అని ఈ విధముగా చెప్పినాము - మాకు పొరుగింటి పుల్ల కూరంటే మాత్రమే ఇష్టము, మా బతుకులు ఇంతే, సొంత వారి మాటలు చచ్చినా వినము.

విదేశాలలో కూడా, మన తెలుగు వారే బాబాయి మందిరాలు కట్టి, ధనం దోచుకుంటూ, ఘనమైన వ్యాపారం చేస్తూ ఉంటే, బాబాయి రాష్ట్రం వారికే అనుమానం వస్తుంది ఇప్పుడు. ఈయన మన గురువా లేక తెలుగు వారి గురువా అని? మనకన్నా వారే ఎక్కువ ఎందుకు మోస్తున్నారు అని, ఇదేం పిచ్చి వీరికి అని? మంచి వ్యాపారులము అని మాత్రం ఒప్పుకుని గమ్మున ఉన్నారు, ఏమీ అనలేక.

కనీసం, మనవారు, వాళ్ళ రాష్ట్రం వెళ్ళి కానుకలు వేస్తారు లే అని. స్వదేశం అలాగే విదేశాల లో ఇతర భాషల వారు కూడా, మనల్ని చూసి నవ్వుకుంటున్నారు - సొంత ఆధ్యాత్మిక తండ్రి ద్రోహులు, పరాయి బాబాయి ఆప్తులు అని.

2 వ తెలుగు అతను అడిగారు - మరి మీరు వెళతారు కదా, బాబాయి దగ్గరికి అని.

మనము ముందు వేద సూక్తాలు మంత్రపుష్పం నేర్చుకుని, అన్ని హైందవ శ్లోకాలు చక్కగా వాక్సుద్ది తో పలుక గలుగుతూ, తెలుగు గురువు లను ప్రధానము గా కీర్తిస్తూ, 8 ఏళ్ళు గా సజీవ గురువు సేవ చేస్తూ, 20 ఏళ్ళు గా శాఖాహారము తింటూ నేలపై నిద్రిస్తూ, ఇతర బాబాయి ల విషయ పరిజ్ఞానం నేర్చుకుని, వారిని సరిచేస్తూ, సహాయము చేస్తూ, వాదించడము లో తప్పు ఏముంది? మన మూలం మారదు కదా?

4 హారతులు వచ్చు, బాబాయి దగ్గర సంవత్సరము పాటు 2 గంటల వాలంటీరు పూజారి గానూ చేసాము, కేవలము అక్కడ జరిగే తప్పును సరిచేయడానికి, బొట్టు పెట్టుకుని రమ్మనడానికి, అరగంట పాడమని చెప్పడానికి, ముదుసలి తల్లి దండ్రులను ఇంట్లో పెట్టుకుని గౌరవించమని చెప్పడానికి. వారి చరిత్ర లో ఉన్న, అన్ని లోటు పాట్లు తెలుసు, అవి నేర్చుకోనిదే వారి లోతు ఎలా తెలుస్తుంది? డాక్టర్ ఎక్కడకు వెళ్ళి నా తప్పులేదు, తను ఆరోగ్య పరిరక్షణలో ఉంటే. మరి మీరు? ఏ ఒక్కటైనా ఆరతి నోటికి వచ్చా?

ఇప్పుడు శివశక్తి అని ఒక సంస్థ నడుస్తుంది, వారు ఇతర మతాల గ్రంధాము చదివి, అందులో ఉన్న అన్ని తప్పులన్ను ఎత్తి చూపుతూ, మత మార్పిడులను ఆపి, వారిని వెనక్కు తెచ్చే ప్రయత్నము చేస్తున్నారు. అవి చదవకుండా, తప్పులు ఎలా తెలుస్తాయి?

మనము కూడా తెలుగు గురుల వైపు తిప్పడానికి ప్రయత్నం చేద్దాము, ఇది అవసరం, విలువలు గల కుటుంబం కావాలి అంటే. మనకు వారి తప్పులతో కూడా పనిలేదు, కేవలము మన మిత్రులను ఎందుకు తండ్రిని వదిలావు, ఆయన దగ్గర లేనిది ఏమిటి, బాబాయి దగ్గర ఉన్నది ఏమిటీ అంటేనే వారి దగ్గర జవాబు లేదు. అది వారి బలహీనం.

మీరూ మీ పిల్లలు కూడా ఇప్పుడైనా వివేకముతో వాస్తవాన్ని గ్రహించి, తప్పును సరిచేసుకుని, తెలుగు గురువులను గౌరవిస్తూ, గొప్పగా చెప్పుకుంటూ, బ్రహ్మం గారి కాలజ్ఞాన రచనలు పాటలు చదువుతూ పాడుతూ, మన సనాతన జనానికి, మన విజ్ఞానాన్ని, అందరికీ నిద్రలేపి చెపుతారు కదూ. బలమైన మానసిక సమాజాన్ని తయారు చేస్తారు కదూ?

సొంత తెలుగు గురువులను ఆదరించని వారే, సజీవ గురువు లైన సొంత తల్లి దండ్రులను, తమ సొంత పిల్లలు మాదిరిగా, దగ్గర పెట్టుకుని, క్రుతజ్ఞత సేవ చేయరు. అంటే, ఇక భూమిపై ఎవరికీ క్రుతజ్ఞత కలిగి ఉండరు, అంతే కదా?

1) పద్యాలు -

భూలో.క కల్పతరువా.., కాల జ్ఞానము వ్రాయగా, దొరకొంటిన్
మేలైన ఆ.కులిమ్మా., పాలించెద నిన్ను, జన్మ బం.ధము తొలగన్

యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక నిష్ఠాకరీ
చంద్రార్కానల భాసమాన లహరీ త్రైలోక్య రక్షాకరీ
సర్వైశ్వర్యకరీ తపః ఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

2) హరిహి ఓం, హరిహి ఓం
చిలకమ్మ పలుకవే పలుకు... చిలకమ్మ పలుకవే పలుకు...
వీరబ్రహ్మం వాక్కు నిత్యమై సత్యమై, విశ్వమంతాగూడ మారుమ్రోగేటట్టు ||చిలకమ్మ||

స్వాములని ఎందఱో లోకాన వెలిసేరు, దేవుడే తామని చెప్పుకుని తిరిగేరు
చేతిలో వీబూది ఉంగరాల్ తీసేరు, చిటికెలోన జనుల సేవలందేరు ||చిలకమ్మ||

అన్ని రంగాలలో సంఘాలు పుట్టెను, చీటికి మాటికి సమ్మేలే జరిగేను
యజమాని శ్రామికుల ద్వేషాలు ప్రభలేను, దిన దినం గండంగా బ్రతుకులే మారేను ||చిలకమ్మ||

ఎంగిలాకులనే విక్రయిస్తారు, మల మూత్రములు కూడా వెలగట్టి అమ్మేరు
ఇనుమును దేశాలకెగుమతులు చేస్తారు, గుళ్ళోన లింగాల గుళ్ళగించేస్తారు||చిలకమ్మ||

నోటి మాటకు విలువ లేకపోయేను కాగితాలకు విలువ గొప్పగా పెరిగేను
పంది కడుపున ఏన్గు పిల్ల పుట్టెను, మారెమ్మ మనిషితో మాటలాడేను ||చిలకమ్మ||

పెళ్ళాల పేరుతో ఆస్తులే పెడతారు, ఉన్నది దాచి దివాలా తీస్తారు
ప్రభుత్వం డబ్బుతో పరిశ్రమలే పెట్టి, ప్రజల సొమ్మంతా గుటుక్కుమనిపిస్తారు ||చిలకమ్మ||

రూపాయికొక గిద్ద నూకలమ్మేరు, మసి పాతనే ఒక్క మాడకమ్మేరు
ధరలు ఆకశానికెగిరిపోయెను, పట్టపగలే బందిపోట్లు వచ్చేను ||చిలకమ్మ||

కొండలన్నీ పిండి కొట్టివేస్తారు, నదులు అడ్డం కొట్టి అదుపులో పెడతారు
హంసవాహనమెక్కి ఆకాశవీధిలో...2 పయనించెదరు జనులు భయమేమి లేకుండా .. ||చిలకమ్మ||

ఇనుప కమ్ములపై పొగ బండ్లు నడిచేను, నీటి ఆవిరి తోటి దీపాలు వెలిగెను 2
ధూర శ్రవణములు దూరదర్శినులు 2 దేశదేశాలలో వ్యాపించిపోయేను ||చిలకమ్మ||

కాలహస్తీశ్వరుని ఘనత తగ్గేను, తిరుపతి స్వామి ప్రభ వెలిగిపోయేను
కంచి కామాక్షమ్మ కన్నీరు కార్చేను, బెజవాడ దుర్గమ్మ కొండపగిలేను ||చిలకమ్మ||

పాయలుగ చీలేను భరత ఖండమ్ము, కాశ్మీరమ్మున గొప్ప కలహాలు రేగెను
వంగ దేశమ్ములో వడిసుడుల్ వచ్చి, గొంతు కోతలతోటి గుబ గుబలు పుట్టెను ||చిలకమ్మ||

ఉప్పు గుండూరుకడ వరద ముంచుకు వచ్చి, ఊర్లు తుడిచి పెట్టి జననష్టమయ్యెను
అద్దంకి సీమలో ఐదేళ్ళ కుర్రాడు, భావి గతులు విప్పి చెప్పేనూ ||చిలకమ్మ||

పాతాల గంగమ్మ పైకి లేచెను, మల్లికార్జున స్వామి కాళ్ళు కడిగేను
బెజవాడ కృష్ణమ్మ కలియుగాంతమ్మున, కనకదుర్గా ముక్కు పోగునంటేను
కనకదుర్గా ముక్కు పోగునంటేను ......

Chilakamma Palukave Video Song

3) శివ గోవింద గోవింద, హరిహి ఓం , హరి గోవింద గోవింద
నా వాక్ ప్రభావమ్ము జ్ఞాన ప్రభోధమై కాల గతిని ఎరుక చేసెను |శివ గోవింద గోవింద|
శివ గోవింద గోవింద

కలియుగమ్మున ఐదు వేలేండ్ల పిమ్మట, మనధర్మమే మారిపోయేను
కుల వివక్షత కూలిపోయేను, మానవులలో నీతి మటుమాయంయ్యేను
అన్యాయమే రాజ్యమేలేను |శివ గోవింద గోవింద|

బ్రహ్మ వంశమునందు పుట్టిన బ్రాహ్మణులు, వృత్తిధర్మం వదలి పెట్టేరు
బ్రష్టులై చెడుదార్లు పట్టేరు
అగ్రహారమ్ములు మణిమాన్యములూపోయి బుడ్డి చెంబులు చేతపట్టేరు |శివ గోవింద గోవింద|

రాజులందరూ కూడా భోగాలలో మునిగి, రాజ్యమూడి తరాజులవుతారు
ప్రజలకు దండాలు పెడతారు
రాజ్యభవనాలన్ని భోజనాలయములై, భరణాలతో వారు బ్రతికేరు |శివ గోవింద గోవింద|

వర్తక వ్యాపారములు వీడి వైశ్యులు నిజమన్నదాన్ని వదిలేసేరు
తలకు మాసిన పనులు చేసేరు
సంపాదనకు మరిగి స్వార్థతత్వం పెరిగి జనులలో చులకనైపోతారు |శివ గోవింద గోవింద|

కర్షకులు వ్యవసాయ పద్ధతులు గిట్టకా... చట్టాల సందున నలిగేరు
పాలు నెయ్యి అమ్మి బ్రతికేరూ
భూమిపుట్టా ఊడి పొట్ట చేత పట్టి, పట్టణాలకు వలస పోయేరు |శివ గోవింద గోవింద|

వ్యాపారమనుపేరా తెల్లదొరలూ వచ్చి, మనలోన చీలికలు తెచ్చేరు
ప్రభువులై నెత్తి పైకేక్కేరు
ఉద్యోగములు చూపి ఉచ్చులెన్నో రేపి, మన మతానికే ఎసరు పెడతారు |శివ గోవింద గోవింద|

ఉత్తరదేశాన వైశ్యకులము నందు, గంధి అనువాడొకడు పుడతాడు 2
స్వాతంత్ర సమరమ్ము చేస్తాడు
ఏకు బలము తోటి మేకవుతూ చివరకు తెల్లవాళ్ళను వెళ్ళగొడతాడు |శివ గోవింద గోవింద|

ముండమోపూలంత ఏలికలు అయ్యేరు, మాలమాదిగా మంత్రులోచ్చేరు
విడ్డూరములు చాల జరిగేను
వెంపలి చెట్లకు నిచ్చెనలు వేసేటి వీరులు మున్ముందు పుడతారు |శివ గోవింద గోవింద|

మిగతా మాటలు పూర్తి వీడియో పాటలు సినిమా లింక్ లోపల సుమా. మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, వాక్సుద్ది కి.

Siva Govinda Govinda

Sri Madvirat Veerabrahmendra Swamy Charitra - NTR, Bala Krishna  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2171 General Articles and views 2,206,574; 104 తత్వాలు (Tatvaalu) and views 244,325
Dt : 07-Apr-2022, Upd Dt : 16-Jul-2022, Category : Songs
Views : 1256 ( + More Social Media views ), Id : 1331 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : madvirat , veerabrahmendra , brahmam , swamy , charitra , movie , ntr , balakrishna , siva govinda , chilakamma palukave
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content