నెలకి కొంత ధనం వేస్తుంటే తనకి ఆనందం, మనకు పాపం, ఊరక సేవ, మాట ఉండదు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2180 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2215 General Articles and views 2,476,109; 104 తత్వాలు (Tatvaalu) and views 265,989.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

అమాయకుడు నోరు లేని, మరిదిని ఇంట్లో పెట్టుకుని, తిండి పెడుతూ, బాగా చూసుకుంటాం అని అక్క చెప్పింది, తనకు ఏదో మంచి ఉచితముగా చేస్తున్నట్లు గా.

మరిది పేరు మీద, ఆస్తి గానీ ధనం గానీ, ఓ లక్ష రూపాయలు అయినా ఉందా?

ఇద్దరు కొడుకులు కు రాసినట్లు, మూడో కొడుకు కి రాశావా, ఇచ్చావా, ఏదైనా ఇప్పుడు?

భవిష్యత్తు లో ఇస్తానని అనొద్దు, మన పేరు న ఎలా రాయిచ్చుకున్నావో ఇప్పుడు, అలాగే కొంత అతనికి కూడా ఇస్తే మంచిది, భగవంతుని గీత అమలు చేసినట్లు, సమాన ద్రుష్టితో చూసినట్లు. ఎటూ మరిది వాడక పోతే లేదా ఆయన వెళ్ళాక, మీకే కదా అవి, నామినీ పెట్టుకోవచ్చు కదా.

మనకి కొడుకు లు చూడరేమో అని అనుమానం ఉన్నప్పుడు, పేరున ఇప్పుడు ఆస్తి ఉన్నప్పుడు, రేపు మరిది తో పడకపోతే, అతని బతుకు తెరువు కు, ఆస్తి ధనం ఉండవద్దా, ఎవరి పంచలో బతకాలి? మాట ఇచ్చాము, చూస్తాము అన్న నీతి వాక్యాలు, భవిష్యత్తు లో పాటించడం కష్టం, అని మనకు అందరికి తెలుసు. అమ్మమ్మ కూడా పడక, బయటకు వెళ్ళింది కదా.

అదృష్టవంతురాలివి అక్కా. మన అత్త, బావ జీవితాలు అంకితం చేసిందే కాకుండా, మరిది జీవితం కూడా, నీ చేతిలో నే పెట్టారు, చిల్లర కూడా ఇవ్వకుండా నే, అవ్వ.

లోక జ్ఞానం నేర్పకుండా, అన్న కూడా అన్యాయం చేసి పోయాడు కదా, ఇంట్లో అన్ని విషయాలు తెలిసి? తమ్ముడు కి దోవ చూపకుండా, చేయి చాపి, ఒకరి కింద ఆధారపడి ఉండ కుండా? రేపు ఒకవేళ మనం తరిమితే, ఎక్కడ కు పోవాలి, తల దాచుకోవాలి? మాట పట్టింపులు, తగాదాలు, ఎవరికైనా ఏ ఇంట్లో అయినా వస్తుంది కదా.

ఈరోజుల్లో, నమ్మకం అయిన జీతగాడు సేవకుడు, పదివేలు పెట్టినా రాడు, వచ్చినా ఏం జరుగుతుందో నమ్మకం లేదు. మనము బయటకు వెళ్ళి, అన్ని తెచ్చుకోవడము కష్టము.

కనీసం నెలకి 5 వేలు తిండికి ఉండటానికి తీసుకున్నా, మిగతా 5 వేలు అయినా, ఆయన సేవలకు, అతని ఎకౌంటు లో వేయి, వద్దు అన్నా కూడా. భవిష్యత్తు నిధి అవసరం అందరికీ అని, ముందు చూపు ఉండాలి అని చెప్పు.

కనీసం నీవైనా కృష్ణ ప్రేమ ఆచరణలో, జాలి దయ చూపించు. భగవంతుడు ఇచ్చిన అవకాశం లో, కాస్త అతని కై జాలి తో విడువు, ముందే మనస్ఫూర్తిగా.

పాత పాపాలకు ఇది అదనంగా చేసుకోకు. ఏవీ తప్పించుకోలేము. కోడళ్ల రాజ్యం లో మనకు స్థానం వద్దు అనుకుంటే, చాలా మారాలి, త్యాగాలు చేయాలి, పశ్చాత్తాపం పడాలి తప్పదు.

నెలకి కొంత వేస్తుంటే, సేవింగ్ ఎకౌంటు లో తనకి ఆనందంగా ఉంటుంది, మనకు పాప భారం, ఊరక సేవ చేయించాము, అన్న మాట ఉండదు. తను ఎటూ తినడు, ఖర్చు పెట్టడు.

మాట తప్పినా కూడా, మరిది బతుకు కు ఇబ్బంది లేకుండా, ధనం ఎకౌంటు లో ఉంచుతాం. రేపు భవిష్యత్తు నాకే తెలీదు, నేను ఒకళ్ళ చేతిలో ఉంటానేమో , మరిది కి ఆ ఖర్మ రానివ్వను. గొడవలు ప్రతి ఇళ్ళు లో వస్తాయని తెలుసు అనుకోవాలి కద అక్కా?

బావ అదే ధైర్యం తో, ఏమీ రాయలేదు ముందు జాగ్రత్త తో, అని బాధ పడ్డాము. అదే తప్పు మనం చేయకూడదు, రేపు ఉదయం లెగుస్తాము అని, మన ఇద్దరు కూ గారెంటీ లేదు కదా. గుర్తు చేయడం వరకే నా బాధ్యత. చేసినా చేయఖపోయినా కర్మ, క్రియ, ఫలితం నీకే.

గతములో అక్కా, బావ రాయకుండా వెళ్ళారు. పిల్లలతో రేపు రోజులు ఎలా ఉంటాయో, అని మనం అనుకున్నప్పుడు, తమ్ముడు, నాకు కృష్ణుని పై నమ్మకం ఉంది, భగవంతుని దయ ఉంది, నా పేరు తో అవసరం లేదు, కాబట్టే బావ రాయలేదేమో. కొడుకు లు బాగా చూస్తారు అని నమ్మకం ఉంది, నా నమ్మకం దేవుని మీద బిడ్డలు మీద, ఎన్నటికీ వమ్ము కాదు. ఏమీ వద్దు నా పేరుతో, రిజిస్ట్రేషన్ ఖర్చులు దండగ. ఫించన్ ఒకటి చాల్లే ఖర్చులు కి అంటే, నిజంగా దేవతవి.

అమాయక మరిది విషయంలో, పైన నీ జవాబులను మరలా చూసుకో. మనసు మారటానికి, వాస్తవం వైపు చూడటానికి ఈ మాటలు, బాధ పడకు,

అని రాము తన సొంత అక్కతో చెప్పారు, బాబాయి భవిష్యత్ గురించి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2215 General Articles and views 2,476,109; 104 తత్వాలు (Tatvaalu) and views 265,989
Dt : 12-Feb-2021, Upd Dt : 12-Feb-2021, Category : General
Views : 1040 ( + More Social Media views ), Id : 972 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : sister , put , money , monthly , maridi , brother in law , happy , no sin , free service , word
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content