సిరి సిరి మువ్వ - కలడందురు దీనుల ఎడా, రా దిగిరా దివి నుంచి - చంద్ర మోహన్, జయప్రద - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1731 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1766 General Articles and views 1,290,621; 90 తత్వాలు (Tatvaalu) and views 176,271.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

ఎవరికి ఏ కష్టము వచ్చినా ముందు, అడిగేది తిట్టేది పిలిచేది దేవుడ్నే. బుద్ది కుశలత ఇచ్చి, జంతువులు కన్నా మీరు మేలు, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, సంతోషముగా కలసి మెలసి ఉండండి అని దేవుడు దీవించారు.

అన్ని ఒక్కరికే ఇవ్వకుండా, సమముగా పంచి ఇచారు, తమ కష్టం తెలివితేటలను మోహ వ్యామోహాలను బట్టి. ధనం ఇచ్చిన వానికి బుద్ది ఇవ్వరు, బుద్ది ఇచ్చిన వారికి ధనం ఇవ్వరు, అలా ఒకటి ఉంటే ఇంకోటి ఉండదు. ఎందుకంటే, 2 ఇస్తే, వారు నేలపై నడవరు. సమిష్టిగా బతకాలి అంటే, ఒకరి పై ఒకరు ఆధారపడాలి.

మనకు సహాయం, మన పక్కనే ఉందని మరచి, మనలో మనమే పోట్లాడుకుంటూ, అరిషడ్వర్గాల అష్టవ్యసనాల బానిసత్వములో, దేవుడిని లేదా మంచి చెప్పిన వారిని, నిందిస్తే ప్రయోజనము ఏముంటుంది?

పక్కవాడి సహాయానికే, మనకు సమయము లేదు. సారీ, ఇంట్లో వారికి సంస్కారం నేర్పడానికే సమయం లేదు. దేవుడు ఎక్కడ నుంచో, తన అన్ని పనులు ఆపి, ఉచితముగా వెంటనే పరుగులు తీసి, మనలాంటి ప్రాపంచిక మోహాల అల్పుల కోసం రావాలా? రారు, మన నాయకులే, ఎలక్షన్ లేనిదే, మన బజారు రారు కదా? మనము ఓట్లు అప్పుడే కదా అమ్ముడు బోయేది, కలసి కట్టుగా?

ఈనాడు ఏ దేవుడు రావలసిన అవసరము లేదు, రామబాణము తో పని లేదు. మన అరిషడ్వర్గాలతోనే, ఇంటికి ఒకరు ఉన్న భస్మాసురులతోనే, మనము పతనము అవుతాము. ఇంకో అవతారానికి, అవకాశం, ఆస్కారం ఇవ్వము, అంత మంచి మనుషులము కదూ?

కలడందురు దీనుల ఎడా...
కలడందురు, పరమయోగి గణముల పాలన్..
కలడందురన్ని దిశలను
కలడు కలండనెడివాడు… ,కలడో.. లేడో...

రా.., దిగిరా.., దివి నుంచి, భువికి దిగిరా.. 2
రా దిగిరా దివి నుంచి భువికి దిగిరా 2
రామ హరే... శ్రీరామ హరే... 2

రాతిబొమ్మకు రవ్వలు పొదిగి, రామహరే... శ్రీరామహరే.. 2
అని పట్టిన హారతి చూస్తూ,
ఏమీ పట్టనట్టు ,కూర్చుంటే చాలదు
రా.., దిగిరా.., దివి నుంచి, భువికి దిగిరా.. 2
రామ హరే... శ్రీరామ హరే... 2

అలనాటి ఆ సీత… ఈనాటి దేవత..
శతకోటి సీతల… కలబోత ఈ దే.వత
రామచంద్రుడా కదలిరా…, రామబాణమే వదలరా..
ఈ ఘోరకలిని మాపరా… ఈ క్రూరబలిని ఆపరా...
రా.., రా.., దివి నుంచి, భువికి దిగిరా.. 2
రామ హరే... శ్రీరామ హరే... 2

నటరాజా శత సహస్ర రవితేజా.., నటగాయక వైతాళిక మునిజన భోజా..2
దీనావన భవ్యకళా, దివ్య పదాంభోజా..
చెరిసగమై, రసజగమై, చెలగిన
నీ చెలి ప్రాణము, బలిపశువై
యజ్ఞ్యవాటి, వెలి బూడిద అయిన క్షణము

సతీవియోగము సహింపక
ధుర్మతియౌ దక్షుని మదమదంచగ
ఢమ ఢమ, ఢమ ఢమ, ఢమరుక ధ్వనుల
నమక చమక యమగమక లయంకర
సకలలోక జర్జరిత భయంకర
వికట నటస్పద విస్పులింగముల
విలయతాండవము సలిపిన నీవే
శిలవే అయితే పగిలిపో… శివుడే అయితే రగిలిపో

Siri Siri Muvva Movie, 24th December 1976; Director K Vishwanath;Producer Edida Nageshwara Rao; Singer S P Balasubramanyam;Music KV Mahadevan; Lyrics Veturi Sundararama Murthy; Star Cast Chandra Mohan, Jaya Prada

సిరి సిరి మువ్వ సినిమా, 24 డిసెంబర్ 1976; దర్శకుడు కె విశ్వనాథ్;నిర్మాత ఏడిద నాగేశ్వరరావు; గాయకుడు S P బాలసుబ్రహ్మణ్యం;సంగీతం KV మహదేవన్; సాహిత్యం వేటూరి సుందరరామ మూర్తి; స్టార్ కాస్ట్ చంద్ర మోహన్, జయప్రద

Ra Digi Ra Divi Ninchi Song Lyrics – Siri Siri Muvva (1976) Movie

Siri Siri Muvva, kaladamduru dinula eda, Ra Digi Ra Divi Ninchi, Chandra Mohan, Jaya Prada, Vishwanath  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1766 General Articles and views 1,290,621; 90 తత్వాలు (Tatvaalu) and views 176,271
Dt : 19-Dec-2022, Upd Dt : 19-Dec-2022, Category : Songs
Views : 160 ( + More Social Media views ), Id : 1658 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : siri , muvva , kaladamduru , dinula , ra , digi , divi , chandra , mohan , jayaprada , vishwanath
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content