సిరి సిరి మువ్వ - ఎవరి కెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక - ఆస్కార్ స్థాయి అవార్డులు నటన బంధాలకు - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,877,047; 104 తత్వాలు (Tatvaalu) and views 225,879.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

వీడియోలో గమనించారా, 1 అంటే మాటలు, 2 అంటే పాట. అంటే, నేరుగా పాట దగ్గరకు నెట్టుకుని వెళ్ళవచ్చు సుమా. అరిషడ్వర్గాల అష్టవ్యసనాల పతనం నుంచి దూరం గా ఉండాలి అంటే, రోజూ వాట్సాప్ స్టేటస్ చూడాలి. ఇంకెవరు మనల్ని గుర్తు చేయరు, బాగుండమని ఇలా, సొంత మాటలు సొంత పనులతో.

* * *

అమ్మా, నాన్న, కూతురు, కొడుకు, అత్త, మామ, భర్త, భార్య, కోడలు, అల్లుడు, అబ్బో ఎన్నో బంధాలు చెప్పుకోవడానికి.

ఇవన్నీ అవసర అవకాశాలకేనా? ధనం మరియు వయస్సు ఉన్నంతవరకేనా? రోగం రానంత వరకేనా? ఆస్తులు, పదవి, అధికారం, ఉద్యోగం, ఆదాయం, పోనంత వరకేనా? అంటే?

అబ్బే ఎవరూ ఒప్పుకోరు, ముందు. మావి గట్టి ఫెవికాల్ బంధాలు అండి అంటారు, ఉత్తమ నటుల అవార్డ్ తో, ఆస్కార్ రేంజ్ లో. కానీ తమ ఊసరవెల్లి రంగులు, సమయం వచ్చినప్పుడు చూపుతారు.

గుణం చూడని, అవసర అవకాశ పెళ్ళి అయ్యినదాకా, అమ్మా నాన్న కావాలి అన్ని పనులకు, మన ఎదుగుదలకు. అవి తీరాక, అసలు అవసరం లేదు. మరి ముదుసలి వారు అయ్యాక, అసలు వాసనే పడదు.

ముందు నవ్వుతూ, మా మమ్మీ డాడీ ముద్దు అన్నవారే, మాకు వద్దు వద్దు అంటారు కోపముగా, అసహ్యముగా, లేదా నటిస్తూ తమ కష్టాలు ఏకరువు పెడుతూ.

మేము పెద్ద చదువులు ఉద్యోగాలతో, మహానగరం లో లేదా విదేశం లో మీ భిక్షతో ఆనందముగా జీవిస్తూ, మిమ్మల్ని మాత్రం అనాధాశ్రమములో లేదా ఇంట్లో ఒంటరిగా ఎవరి చేతిలోనో కొంత బెట్టి, ఉంచుతాము అని గర్వముగా, ఏదో త్యాగం, సమయ దానం, సజీవ గురువు సేవ, చేస్తున్నంత ఫీలింగ్ తో, ద్రోహం చేస్తున్నాము.

ముదుసలి పెద్దలు కూడా, తాము ఇంకా పూర్తిగా మోసపోయిందాకా నమ్ముతామని, ఆ భస్మాసురులకే ధనం ఆస్తులు ఇచ్చి బలవంతులను చేసి, ఇతరుల కన్నీళ్ళకు కూడా కారణమయ్యి, పాపం పెంచుకుందాము అని ఆరాటపడతారు, అన్ని బంధాలు తెంపి, రోడ్ న వేసిన దాకా.

ఎందుకంటే, రేపు వయసు ఉడిగిన తర్వాత, మన బ్రతుకు అంతే అని తెలుసు, కానీ అప్పుడు చూద్దాములే అన్న బద్దకం, నిర్లక్ష్యం. డబ్బు కాపాడుతుంది అని, బ్రమ. మన పతన రాత మనమే రాసుకుంటున్నాము, భవిష్యత్ గొయ్యతో. అందుకే ఎవరికెవరు ఈ లోకములో, ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరినీ అడగకా, .. హ హ హా.

ఎవరికెవరు ఈలోకంలో.., ఎవరికి ఎరుక..
ఏదారెటు పోతుందో.., ఎవరినీ అడగక..
ఎవరికెవరు ఈలోకంలో.., ఎవరికి ఎరుక..
ఏదారెటు పోతుందో.., ఎవరినీ అడగక..
ఎవరికెవరు ఈలోకంలో.., ఎవరికి ఎరుక..

వాన కురిసి కలిసేదీ.. వాగులో.., వాగు వంక కలిసేదీ.. నదిలో.. 2
కదిలి కదిలి నదులన్నీ.., కలిసేదీ కడలిలో..2
కానీ, ఆ కడలి.., కలిసేదీ.., ఎం.దులో ..

ఎవరికెవరు ఈలోకంలో.., ఎవరికి ఎరుక..
ఏదారెటు పోతుందో.., ఎవరినీ అడగక..
ఎవరికెవరు ఈలోకంలో..

Siri Siri Muvva - Eavari Kevaru Ee Lokamlo - Oscar level awards for Acting Bonds relations  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,877,047; 104 తత్వాలు (Tatvaalu) and views 225,879
Dt : 19-Dec-2022, Upd Dt : 19-Dec-2022, Category : Songs
Views : 518 ( + More Social Media views ), Id : 1659 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : siri , muvva , eavari , kevaru , lokamlo , oscar , level , awards , acting , bonds , relations
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content