అందర్ని సుతిమెత్త విమర్శ లేదా పొగడ్త. జగన్ ని ఒక్క మాట కూడా లేదు. అభిమానా మీరు? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,866,642; 104 తత్వాలు (Tatvaalu) and views 224,975.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఏవండీ సంవత్సరము పైగా చదువుతున్నా - పేరెంట్స్, ఆరోగ్యం, పురాణాలు, ఆధ్యాత్మికం, అభివ్రుద్ది, రాజకీయాలు, మంచి పాట మాట విభాగాలు గా. మీరు అందర్ని సుతిమెత్త గా విమర్శిస్తున్నారు, అందరినీ పొగుడుతున్నారు. జగన్ ని నేరుగా ఒక్క మాట కూడా అనడము లేదు. ఆయన అభిమానా మీరు?

జవాబు - మంచి విలేఖరి ఎప్పుడు కూడా, రాజుకు మంత్రి లాగా ఉండాలి. మన పరిధిలో తెలిసిన కొన్ని అయినా తప్పులు లేదా మార్పులు నిష్పక్షపాతం గా చూపించి, సరి చేయించే ప్రయత్నం చేసి, రాజు కల కాలము రాజ్యము చేసేటట్లు గా, లోపాలు సరిదిద్దేటట్లుగా ఉండాలి, వారి బాగు కోరి. ఎన్నో కొత్త మార్పులు సమస్యలు విన్నవించాము, మన వెబ్సైట్ లో లోకం తీరు లో రిక్వెస్ట్ కాటగిరి కింద చూడవచ్చు.

మీకు జగన్ గారి పై ఉన్న అభిమానమును బట్టి అలా అనిపిస్తుంది, ఇంకొకరికి వ్యతిరేకము అని అనిపిస్తుంది టాపిక్ ను బట్టి. మనము జగనన్న, చంద్రన్న, పవన్, వీర్రాజు గార్లు అందరికీ అభిమానులమే, మంత్రుల వంటి, శ్రేయోభిలాషులమే.

ఉదాహరణకు, అన్ని ప్రభుత్వ శాఖలు, వివరాలు సోషల్ మీడియాలో ఉంచాలి అని కోరాము. ఇది జగన్ గారికి, చాలా ఉపయోగము, ఉచిత నమ్మకమైన ప్రచారానికి.

అలా చేయమని అడగాలని ప్రతిపక్షాలకు కూడా, ఉపయోగమే గదా. సోషల్ మీడియాలో తప్పులు వారు నిలదీయవచ్చు గదా. అలాగే ఈ అభివ్రుద్ది పనుల సమాచారము అంతా, ప్రజలకు కూడా లాభమే కదా, రేపు ప్రశ్నించడానికి.

అంటే ఏ పార్టీ లేదా వ్యక్తి గురించి రాసేటప్పుడు, వారి మంచి కోరి సరిచేసే ప్రయత్నము మాత్రమే చేయాలి. సంస్కారము దాటి విమర్శలు చేయకూడదు, దానికి పార్టీ నాయకులు మరియు అనుచరులు ఉన్నారు. వారు మార్పు చేయనంత మాత్రాన, మనకు కోపము రాకూడదు. సలహా అంత వరకే, ఎందుకంటే ఫలితము వారికే గదా. గతములో చంద్రన్న వినలేదు ఎవరిమాట, ఫలితము చూసాము.

జగన్ గారు, ముఖ్యమంత్రి గా మొదటి సారి అధికారములో ఉండి, కోటరీ మరియు బంధువుల నీడలో ఉన్నారు. ఇంకా కొత్త పెళ్ళికొడుకే. చుట్టూ ఉన్న వారు, తమ రాజ కీయ లబ్ది కోసము, ఎలా భ్రమలలో ఉంచుతారో, ఇంకా ఆయనకు అనుభవము కాలేదు. కాబట్టి చాల వారకు తప్పులు అన్ని, కోటరీ లేదా బంధువుల ప్రోద్భలముతో జరుగుతున్నాయి. ఎందుకంటే ఎదగాల్సింది సంపాదించాల్సిన అవసరం చుట్టు ఉన్న వారికే ఉంది. కాబట్టి ఎక్కువ విమర్శలు వారికి వెళతాయి.

ఆయన చిత్తశుద్ధి తో మంచి చేయమనే చెపుతున్నారు, ఏ పార్టీ వాడైనా, ఇల్లు లేకపోతే, స్థలము ఇవ్వాలి అని చెప్పారు. కాని, దానిని అమలు చేస్తున్నారా లేదా స్థానికం గా అనేది, ఎవరూ సరిగ్గా ఆయనకు వివరించడము లేదు. మరి ఆయనకు కొత్త పధకాలతో సరిపోతుంది కాని, ఎలా జరుగుతున్నాయి అనే సమాచారం, గ్రహించడము లేదు. కేవలము మీటింగ్ లో మాటలు విని, త్రుప్థి చెందుతున్నారు. ఇంటలిజెన్స్ సంస్థ ఉంది మరి. కాబట్టి ఆయనను ఇప్పుడు అని ప్రయోజనము లేదు. కానీ అప్పుడప్పుడు చురకలు వస్తూనే ఉన్నాయి, మీరు అన్ని చదివి ఉండరు బహుశా.

అదే చంద్రన్న విషయములో జరిగింది కూడా, కానీ, ఆయన 40 ఏళ్ళ అనుభవము కూడా, కోటరి మాయ నుంచి కాపాడుకోలేక పోయింది.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,866,642; 104 తత్వాలు (Tatvaalu) and views 224,975
Dt : 22-Sep-2020, Upd Dt : 22-Sep-2020, Category : General
Views : 690 ( + More Social Media views ), Id : 716 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : simple criticism , compliment , jagan , fan
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content